Constable Kanakam Series Trailer: గ్రామంలో అమ్మాయిలు మిస్సింగ్ - జింక అనుకునే సింహం ఏం చేసిందంటే?... 'కానిస్టేబుల్ కనకం' ట్రైలర్ వేరే లెవల్
Constable Kanakam Trailer: వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'కానిస్టేబుల్ కనకం'. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు.

Varsha Bollamma's Constable Kanakam Trailer Released: ఎక్స్‌క్లూజివ్ ఒరిజినల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'కానిస్టేబుల్ కనకం' నుంచి ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేశారు. హీరోయిన్ వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌కు ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించగా... రొటీన్‌కు భిన్నంగా ఓ జానపద పాట రూపంలో రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
ట్రైలర్ ఎలా ఉందంటే?
గ్రామాల్లో తప్పిటగుళ్లు ఆడే వారి పాటతో ట్రైలర్ ప్రారంభమై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. వాళ్లు కాలికి గజ్జలు కట్టి వివరిస్తుండగా... సిరీస్‌లో కీలక సీన్స్‌ను చూపించారు. 'రేపల్లే గ్రామానికి ఉత్తరాన దట్టమైన చెట్లతో అడవి గుట్ట ఉంది. అడవి గుట్టలో క్రూరమైన మృగాలున్నాయి. ఏమున్నాయిరా అంటే... సింహం ఉంది, చిరుత, నక్కా, మొసలి, గద్ద ఉందీ...' అంటూ గ్రామంలో పోలీస్ స్టేషన్లో ఒక్కో క్యారెక్టర్‌ను చూపించారు. 'ఇన్ని మృగాలున్న చోటుకి ఓ జింక వచ్చింది.' అనే డైలాగ్‌తో వర్ష బొల్లమ్మ ఎంట్రీ ఇచ్చారు.
ఆ స్టేషన్‌కు వచ్చిన కొత్త కానిస్టేబుల్ ఆమె కాగా అక్కడ ఎదురైన పరిణామాలను చూపించారు. 'ఎన్ని చేసినా ఆ జింక కొంచెం కూడా బెదరలేదు. ఎందుకంటే అది జింక కాదు...' అంటూ పవర్ ఫుల్ కానిస్టేబుల్ రోల్ ఎలివేషన్ ఇచ్చారు మేకర్స్. ఈ ట్రైలర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ ఆద్యంతం సస్పెన్స్ క్రియేట్ చేసింది.
View this post on Instagram
Also Read: టాలీవుడ్‌కు మరో ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ దొరికాడు... చైతన్యకు క్యారెక్టర్లు రాయొచ్చు
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ సిరీస్ ఎక్స్‌క్లూజివ్‌గా 'ఈటీవీ విన్' కోసం రూపొందించారు. ఈ నెల 14 నుంచి స్ట్రీమింగ్ కానుండగా... ఫస్ట్ ఎపిసోడ్‌ను ఫ్రీగా చూడొచ్చు. వర్ష బొల్లమ్మతో పాటు అవసరాల శ్రీనివాస్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించగా... కోవెలమూడి సత్యసాయిబాబా, వేటూరి హేమంత్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు.
గ్రామంలో అమ్మాయిల మిస్సింగ్
ఈ సిరీస్ 1998లో ఓ గ్రామంలో జరిగే క్రైమ్ ఆధారంగా రూపొందించారు. రేపల్లె అనే గ్రామంలో వరుసగా అమ్మాయిలు మిస్ అవుతుంటారు. రాత్రిపూట అడవి గుట్ట వైపు వెళ్లే అమ్మాయిలు కనిపించకుండా పోతుంటారు. వరుసగా అమ్మాయిలు అదృశ్యం కావడం పోలీసులకు సవాల్‌గా మారుతుంది. రాత్రి పూట అమ్మాయిలు ఎవరూ అడవి గుట్ట వైపు వెళ్లొద్దంటూ గ్రామంలో దండోరా వేయిస్తారు. అదే టైంలో పీఎస్‌లో కానిస్టేబుల్‌గా జాయిన్ అవుతుంది కనకం (వర్ష బొల్లమ్మ).
అమ్మాయిల మిస్సింగ్ కేసును స్పెషల్‌గా తీసుకుంటుంది. ఈ క్రమంలో స్టేషన్‌లో అధికారుల నుంచి అవమానాలు, ఒత్తిడులు ఎదుర్కొంటుంది. అయినా సరే తన పట్టు వదలకుండా అసలు గ్రామంలో ఏం జరుగుతుందనే దానిపై విచారిస్తుంది. అసలు అమ్మాయిల కిడ్నాప్‌నకు కారణమేంటి?, అసలు అడవి గుట్ట మిస్టరీ ఏంటి? అమ్మాయిల మిస్సింగ్ వెనుక ఉన్నది ఎవరు? ఈ క్రైమ్‌ను కానిస్టేబుల్ కనకం ఎలా సాల్వ్ చేసింది? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో ఆకట్టుకోగా... తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ వేరే లెవల్‌లో ఉంది.





















