![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Unstoppable With NBK: మళ్లీ స్టార్ట్ అవుతున్న ‘అన్‌స్టాపబుల్’ - ఈసారి లిమిటెడ్ ఎడిషన్!
Unstoppable With NBK Limited Edition: నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమం ఆహాలో తిరిగి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు.
![Unstoppable With NBK: మళ్లీ స్టార్ట్ అవుతున్న ‘అన్‌స్టాపబుల్’ - ఈసారి లిమిటెడ్ ఎడిషన్! Unstoppable With NBK Limited Edition To Stream From October 17th On AHA First Episode With Anil Ravipudi Sreeleela Kajal Aggarwal Arjun Rampal Unstoppable With NBK: మళ్లీ స్టార్ట్ అవుతున్న ‘అన్‌స్టాపబుల్’ - ఈసారి లిమిటెడ్ ఎడిషన్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/13/2f11dc8e1c9a94d9b14d6197632f1d0d1697220746086252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Unstoppable With NBK: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు రెండు సీజన్లు పూర్తయ్యాయి. ఇప్పుడు మూడో సీజన్ కాకుండా ‘లిమిటెడ్ ఎడిషన్’ పేరుతో మళ్లీ ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ను ఆహా ప్రసారం చేయనుంది. మొదటి ఎపిసోడ్లో ‘భగవంత్ కేసరి’ టీమ్ రానున్నారు. అనిల్ రావిపూడి, శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్ ఉన్న ప్రోమోను ఆహా ఇప్పటికే విడుదల చేసింది.
ఇందులో ఫన్‌తో పాటు కాంట్రవర్సీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. "మేం తప్పు చేయలేదని మీకు తెలుసు. మేం తలవంచం అని మీకు తెలుసు. మమ్మల్ని ఆపడానికి ఎవడు రాలేడని మీకు తెలుసు." అనే డైలాగ్‌తో ప్రొమో ప్రారంభం అయింది. ‘మనిద్దరం కలిసి ఫస్ట్ టైం చేస్తున్నాం.’ అని అనిల్ రావిపూడి అనగానే... బాలకృష్ణ ‘ఏంటి?’ అని అడగటం... దానికి అనిల్ రావిపూడి సిగ్గు పడటం ఇలా ఫన్నీగా ప్రోమోను ప్రారంభించారు.
గ్లామర్ క్వీన్స్ కాజల్ అగర్వాల్, శ్రీలీల కూడా ఎంట్రీ ఇచ్చారు. ‘నా చందమామ, అందాల ఆడబొమ్మ’ అంటూ కాజల్‌ను ఆకాశానికి ఎత్తేశారు బాలకృష్ణ. ‘నాతో చేయడంతో ఫుల్ సర్కిల్ పూర్తి చేశావ్. నందమూరి, కొణిదెల హీరోలతో పని చేశావ్. నాతో మళ్లీ చేస్తావా?’ అని కాజల్‌ను అడగ్గా... ‘100 పర్సెంట్’ అని కాజల్ నవ్వుతూ ఆన్సర్ ఇచ్చారు.
‘డైరెక్టర్లు, నిర్మాతలు అందరూ... అయితే బాలకృష్ణతో చేయాలి? లేకపోతే శ్రీలీలతో చేయాలి అంటారు.’ అని శ్రీలీలను కూడా పొగడ్తలతో ముంచెత్తారు. "సినిమా అయినా, లైఫ్ లో అయినా, అంతా బాగున్నపుడు ఒకడు దిగుతాడు. మొత్తం నాశనం చేయడానికి బయలుదేరుతాడు. మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటికి రావాలి." అంటూ పొలిటికల్ గ్రౌండ్‌ను కూడా టచ్ చేశారు.
ఆ తర్వాత అర్జున్ రాంపాల్‌కు బాలయ్య హిందీ పాటతో స్వాగతం చెప్పారు. ‘నీకు, తమన్నాకు ఎందుకు గొడవ అయింది?’ అని అనిల్ రావిపూడిని అడగ్గా... ‘మీరు బాలకృష్ణుడు కాదు బాబూ... ఫిటింగ్ కృష్ణుడు.’ అంటూ అనిల్ ఆన్సర్ ఇచ్చారు. మొత్తంగా ఫన్, కాంట్రవర్సీలతో ఈ ప్రోమోను నింపేశారు. అక్టోబర్ 17వ తేదీ సాయంత్రం ఆరో తేదీన ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. అంటే భగవంత్ కేసరి విడుదలకు సరిగ్గా రెండు రోజుల ముందన్న మాట.
మరోవైపు ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ ఇటీవలే విడుదల అయింది. ఇందులో నందమూరి బాలకృష్ణను కొత్త అవతార్‌లో చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తెలంగాణ మాండలికంలో బాలయ్య చెప్పిన డైలాగులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆయన రొటీన్ డైలాగ్ డెలివరీకి భిన్నంగా ఈ సంభాషణలు ఉండటం కొత్తగా అనిపిస్తుంది. కానీ బాలయ్య మార్కు యాక్షన్ సన్నివేశాలు మాత్రం ఎక్కడా మిస్ కానివ్వలేదు. థమన్ ఎస్ఎస్ అందించిన రీ-రికార్డింగ్ ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకువెళ్లింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)