Unstoppable 4 Latest Promo: జై బాలయ్య... ఎవ్వడేయమన్నాడ్రా ఈ ఫొటో, నవ్వులే నవ్వుల్ - అన్‌స్టాపబుల్ 4 ఎపిసోడ్ 6 గ్లింప్స్ చూశారా?
ఆహాలో అన్‌స్టాపబుల్‌గా దూసుకెళుతోన్న నటసింహం బాలయ్య షో ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ సీజన్ 8 ఎపిసోడ్ 6కి వచ్చే గెస్ట్‌లు ఎవరో రివీల్ అయింది. ఎపిసోడ్ 6కి సంబంధించి ఓ వీడియోని టీమ్ వదిలింది.
తెలుగు ఓటీటీ ఆహాలో అన్‌స్టాపబుల్‌గా దూసుకెళుతూ.. సీజన్ 4కి చేరుకున్న నటసింహం బాలయ్య షో ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ నెక్ట్స్ ఎపిసోడ్‌కి ఎవరు రాబోతున్నారో క్లారిటీ ఇస్తూ.. స్మాల్ గ్లింప్స్ వీడియోని వదిలారు ఆహా టీమ్. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో సక్సెస్ ఫుల్‌గా 5 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 6వ ఎపిసోడ్‌కు చేరుకుంది. ఈ ఎపిసోడ్ 6కి వచ్చే గెస్ట్‌లు మరెవరో కాదు... డ్యాన్సింగ్ బ్యూటీ శ్రీలీల మరియు నవ్వుల రాజు నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty). రీసెంట్‌గా నవీన్ పోలిశెట్టి ఈ ఎపిసోడ్‌లో పాల్గొనేందుకు వెళుతున్న వీడియో ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అతనికి జతగా శ్రీలీల కూడా యాడ్ అయినట్లుగా ఈ వీడియోతో క్లారిటీ వచ్చేసింది.
అంతేకాదు, ఈ ఎపిసోడ్ నవ్వుల మయం కాబోతుందనే విషయం కూడా ఈ చిన్న వీడియో చెప్పేస్తోంది. ఈ వీడియోలో.. జై బాలయ్య అంటూ బాలయ్యే.. నవీన్ పోలిశెట్టిని, శ్రీలీలని ఆటపట్టిస్తుండటం హైలెట్‌గా నడిచింది. మనసుందా అసలు అని బాలయ్య అంటే.. ‘నా మనసులో బాలయ్య గారే ఉన్నారని’ నవీన్ చెప్పే సమాధానం, ‘ఇది కూడా తీసేద్దామనే’ అంటూ తను వేసుకున్న కోటును బాలయ్య విప్పేస్తుంటే.. శ్రీలీల (Sreeleela) ముఖమంతా నవ్వులతో నిండిపోయింది. ఆ తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో సమంత, అనుష్క, రష్మిక ఫొటోలు ప్లే అవుతుంటే.. ఈ ఫొటో ఎవ్వడేయమన్నాడ్రా అంటూ బాలయ్య తనదైన కామిక్ సెన్స్‌ని కురిపించాడు. ఆ హీరోయిన్లను ఉద్దేశించి నవీన్ ఏదో చెబితే.. ఎంతమందికి ఈ మాట చెప్పావ్ అంటూ బాలయ్య ఆట పట్టిస్తూ అడిగితే.. ‘శ్రీలీలకు మాత్రం ఒక్కటేసారి చెప్పా’ అంటూ నవీన్ పోలిశెట్టి సమాధానమిచ్చాడు. ఆ సమాధానానికి శ్రీలీల నవ్వే నవ్వు.. చూస్తున్న ఆడియెన్స్‌ను కంట్రోల్ చేసుకోనివ్వడం లేదంటే.. పూర్తి ఎపిసోడ్ వస్తే.. నవ్వి నవ్వి పోతారేమో..
Also Read: అల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'
It’s unstoppable, it’s madness, it’s @NaveenPolishety and @sreeleela14 !
— ahavideoin (@ahavideoIN) December 1, 2024
Catch the glimpse of Episode 6 now and promo dropping tomorrow! #UnstoppableWithNBK Season 4, Episode 6 premieres on Dec 6.#UnstoppableS4 #naveenpolishetty #nandamuribalakrishna #Aha #Unstoppable… pic.twitter.com/9FBAOtV7wL
ఇది జస్ట్ శాంపిల్ వీడియోనే.. ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన అసలైన ప్రోమోని డిసెంబర్ 2 ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా ఈ వీడియో ఎండింగ్‌లో తెలిపారు. అంతేకాదు, ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్‌ని కూడా అధికారికంగా ప్రకటించేశారు. డిసెంబర్ 6న ఈ ఎపిసోడ్ 6 ప్రీమియర్ కానుంది. మొత్తంగా అయితే, ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందనేది ఈ చిన్న వీడియోతోనే తెలిసిపోతుంది. ఇక పొట్టచెక్కలయ్యేలా ఆహా యూజర్స్ నవ్వడానికి ఇక రెడీ అవ్వండి.
‘అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 6’ ఎపిసోడ్స్ విషయానికి వస్తే.. మొదటి ఎపిసోడ్ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో మొదలవ్వగా, రెండో ఎపిసోడ్‌కు ‘లక్కీ భాస్కర్’ టీమ్ దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి గెస్ట్‌లుగా వచ్చారు. మూడో ఎపిసోడ్‌కు ‘కంగువా’ టీమ్ వస్తే.. నాల్గవ ఎపిసోడ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు. నాల్గవ ఎపిసోడ్‌కు కంటిన్యూ అన్నట్లుగా సాగిన ఐదవ ఎపిసోడ్‌కు అల్లు అర్జున్ పిల్లలు, ఆయన మదర్ గెస్ట్‌లుగా వచ్చారు. ఇప్పుడు 6వ ఎపిసోడ్‌తో అన్‌స్టాపబుల్‌గా ప్రేక్షకులను అలరించేందుకు నటసింహం సిద్ధమయ్యాడు.