The Night Manager Part 2 trailer: 'ది నైట్ మేనేజర్' పార్ట్ 2 వచ్చేస్తోంది - ఉత్కంఠ భరితంగా ట్రైలర్!
బాలీవుడ్ అగ్ర హీరో ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ది నైట్ మేనేజర్ సీజన్ 2' కు సంబంధించి తాజాగా ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్.
ఈ మధ్య హిందీలో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ లలో 'ది నైట్ మేనేజర్' కూడా ఒకటి. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన 'ది నైట్ మేనేజర్' సీజన్ వన్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ ని అందుకోగా ఇప్పుడు సీజన్ 2 కూడా వచ్చేస్తుంది. ది నైట్ మేనేజర్ రెండో సీజన్ స్ట్రీమింగ్ డేట్ ను తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అనౌన్స్ చేస్తూ ట్రైలర్ను సైతం విడుదల చేసింది. ఈ మేరకు జూన్ 30 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'ది నైట్ మేనేజర్' సీజన్ 2 స్ట్రీమింగ్ కానునట్లు హాట్ స్టార్ అనౌన్స్ చేసింది. బాలీవుడ్ హీరోలు అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషించారు. ఆయుధాల డీలర్ గా అనిల్ కపూర్ నటించగా.. గవర్నమెంట్ తరఫున ఏజెంట్గా నైట్ మేనేజర్ పాత్రలో ఆదిత్య రాజ్ కపూర్ కనిపించాడు. ఇక సీజన్ వన్ ని మేకర్స్ ఎంతో ఉత్కంఠ భరితంగా ముగించడంతో ఇప్పుడు సీజన్ 2 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ కి ప్రియాంక ఘోష్, సందీప్ మోడీ, రుక్ నబీల్ దర్శకత్వం వహించారు.
ఇక సీజన్ వన్ లో సెకండ్ ఎపిసోడ్ లో అనిల్ కపూర్ ఎంట్రీ ఇవ్వడంతోనే ఈ వెబ్ సిరీస్ మరింత ఆసక్తికరంగా మారుతుంది. షెల్లి(అనిల్ కపూర్) చేసే ఇల్లీగల్ బిజినెస్ కు సంబంధించి షాన్ (ఆదిత్య రాయ్ కపూర్) తన తెలివితేటలను ఉపయోగించి సమాచారాన్ని సేకరించే సన్నివేశాలు ఎంతో ఆసక్తిని పెంచుతాయి. అంతేకాదు షెల్లి టీంలో చేరడానికి లిపిక (శోభితా ధూళిపాళ్ల) తో కలిసి షాన్ వేసే ఎత్తులను డైరెక్టర్ మరింత ఆసక్తికరంగా చూపించారు. ఇక సీజన్ వన్ షెల్లీ టీమ్ లో షాన్ చేరడంతో ముగుస్తుంది. షెల్లీ టీమ్ లో జాయిన్ అయిన తర్వాత ఏం జరిగింది? షాన్, షెల్లీ చేసే ఆయుధాల బిజినెస్ గురించి అన్ని రహస్యాలు బయటపెట్టడా? అలా బయటపెట్టే క్రమంలో షాన్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? తన పని కోసం ఎవర్ని వాడుకున్నాడు? అనేవి సీజన్ 2 లో చూపించబోతున్నారు. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ లో కూడా అదే చూపించారు. షెల్లీ టీంలో షాన్ చేరిన తర్వాత నుంచి ఒక్కో రహస్యం బయటపడుతూ వస్తుంది.
అందుకు లిపికను మరింత దగ్గర చేసుకుని షాన్ ఒక్కో రహస్యాన్ని బయట పెడుతూ ఉంటాడు. ఇక షెల్లీ, షాన్ ని తన టీమ్ లో చేర్చుకొని తన ఇల్లీగల్ బిజినెస్ లో పార్ట్నర్ గా చేర్చుకుంటారు. అప్పటినుంచి షెల్లీ ఇల్లీగల్ బిజినెస్ ని షాన్ దగ్గరుండి చూసుకుంటాడు. ఇక చివరగా షెల్లీ తన ఇల్లీగల్ బిజినెస్లో అవకతవకలు జరుగుతున్నాయని తెలుసుకొని ఇదంతా నువ్వే చేస్తున్నావా? అంటూ షాన్ ని అడగడం ఈ ట్రైలర్ లో గమనించవచ్చు. అక్కడితో ట్రైలర్ ఎండ్ అయిపోతుంది. దీన్నిబట్టి చూస్తే సీజన్ వన్ కంటే సీజన్ 2 మరింత ఉత్కంఠ భరితంగా ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా సీజన్ 2 లోనే షెల్లీ ఇల్లీగల్ బిజినెస్ కి సంబంధించిన రహస్యాలను షాన్ ఏ విధంగా బయటపెడతాడు అనే అంశాలు కీలకంగా ఉండబోతున్నాయి. యాక్షన్, రొమాన్స్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలివెంట్స్ తో ఈ టైలర్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. ఇక ఈ ట్రైలర్ తో సీజన్ 2 పై మరింత ఆసక్తిని పెంచేశారు మేకర్స్. ఇక ఈ వెబ్ సిరీస్ లో అనిల్ కపూర్ ఆదిత్య రాయ్ కపూర్ లతోపాటు శోభిత ధూళిపాళ్ల, తిలోత్తమ షోమ్, అరిస్టా మెహతా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Shelly ki Lanka jalane ke liye, Shaan hai taiyaar. The most awaited season finale is here 🔥#HotstarSpecials #TheNightManager Part 2 streaming 30th June.#TheNightManagerOnHotstar pic.twitter.com/d0ToIVsJHW
— Disney+ Hotstar (@DisneyPlusHS) June 5, 2023
Also Read: ‘ఆదిపురుష్’పై దిల్ రాజు ఊహించని నిర్ణయం - ‘శాకుంతలం’ ఎఫెక్టే కారణమా?