అన్వేషించండి

Adipurush: ‘ఆదిపురుష్’పై దిల్ రాజు ఊహించని నిర్ణయం - ‘శాకుంతలం’ ఎఫెక్టే కారణమా?

పీపుల్స్ మీడియా నిర్మాతలు ఆదిపురుష్ మూవీ నైజాం, ఉత్తరాంధ్ర రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి అమ్మాలని ప్రయత్నించగా.. దిల్ రాజు పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది.

పాన్ ఇండియా హీరో ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన లేటెస్ట్ మైథాలజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్' కోసం ఫాన్స్ తో పాటు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో జోరు మీద ఉన్న ఈ సినిమా జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ ధరకు కొనుగోలు చేసి విడుదల చేస్తున్నారు. నిజానికి మొదట UV క్రియేషన్స్ నిర్మాతలు 'ఆదిపురుష్' మూవీని తెలుగులో విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. కానీ ఏమైందో తెలియదు ఆ తర్వాత వారి స్థానంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ హోల్ సేల్ రేట్ కి కొనుగోలు చేసి తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నారు. సుమారు రూ.185 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని పీపుల్స్ మీడియా 'ఆదిపురుష్' మూవీ కోసం ఖర్చు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఈ మూవీ తెలుగు రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు అమ్మేందుకు పీపుల్స్ మీడియా నిర్మాతలు తీవ్రంగా ప్రయత్నించారట. కానీ దిల్ రాజు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అందుకు కారణం ఆదిపురుష్ మూవీకి పీపుల్స్ మీడియా నిర్మాతలు భారీ ధరను డిమాండ్ చేయడమే అని అంటున్నారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం పీపుల్స్ మీడియా నిర్మాతలు ఆదిపురుష్ మూవీ నైజాం రైట్స్ రూ.60 కోట్లకి, అలాగే ఉత్తరాంధ్ర రైట్స్ రూ.22 కోట్లకి అమ్మేందుకు రెడీ అయ్యారట. సాధారణంగా అగ్ర హీరోల సినిమాలకి డిస్ట్రిబ్యూటర్లు ఈ రేంజ్ లో డిమాండ్ చేయడం కామనే. కానీ దిల్ రాజు మాత్రం ఎందుకనో ఆదిపరుష్ నైజాం, ఉత్తరాంధ్ర రైట్స్ ని కొనేందుకు మాత్రం ఆసక్తి కనబరచలేదు. అయితే నిర్మాతలు భారీగా డిమాండ్ చేయడంతోనే దిల్ రాజు పెద్దగా ఆసక్తి చూపించలేదని ఒకవైపు వార్తలు వినిపిస్తుండగా.. మరోవైపు ఆదిపురుష్ మూవీ పట్ల దిల్ రాజుకి పెద్దగా నమ్మకం లేదనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అలాగే ఇటీవల ‘శాకుంతలం’ మూవీ ఫ్లాప్ ప్రభావం కూడా దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకోడాని కారణం కావచ్చని సమాచారం.

మరి దిల్ రాజు ఆదిపురుష్ విషయంలో కావాలనే ఇలా చేశాడా? లేక గతంలో పలు పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి నష్టాలు అందుకున్న కారణంగా మరోసారి రిస్క్ ఎందుకు అనుకున్నాడా? అనేది తెలీదు కానీ ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో దీని గురించే చర్చలు జరుగుతున్నాయి. కాగాలో ఆదిపురుష్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు మేకర్స్. ఇక ఈవెంట్ కోసం నిర్మాతలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారట. అంతేకాదు ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా శ్రీ చిన్న జీయర్ స్వామి హాజరు కాబోతుండడం విశేషం. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరో స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే ఈ ఈవెంట్ లోనే ఆదిపురుష్ నుంచి మరో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచగా.. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా విడుదలయ్యే మరో ట్రైలర్ ఆ అంచనాలను తారస్థాయికి చేర్చడం ఖాయమని చెప్పొచ్చు.

Read Also: పచ్చి బూతులు, పారుతున్న నెత్తురు, జుగుప్సాకరంగా ‘సైతాన్’ ట్రైలర్’ - పెద్దలకు మాత్రమే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget