The Game Web Series OTT: ఓటీటీలోకి 'జెర్సీ' హీరోయిన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
The Game Web Series OTT Platform: హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో త్వరలో రాబోతున్నారు. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్ 'ది గేమ్' త్వరలోనే ఓటీటీలోకి రానుంది.

Shraddha Srinath's Exclusive The Game Web Series OTT Release On Netflix: 'జెర్సీ' మూవీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్' ఓటీటీలోకి రాబోతోంది. ఈ మేరకు మేకర్స్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఎక్స్‌క్లూజివ్‌గా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ కోసం ఈ సిరీస్ రూపొందించగా... అక్టోబర్ 2 నుంచి సిరీస్ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. 'గేమ్ డెవలపర్ జీవితంలో ఇది క్లిష్టమైన సమయం' అంటూ స్ట్రీమింగ్ వివరాలను ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే, ఏ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందనేది చెప్పలేదు.
ఈ సిరీస్ రాజేస్ ఎం.సెల్వ దర్శకత్వం వహించగా... శ్రద్దా శ్రీనాథ్‌తో పాటు సంతోష్ ప్రతాప్, చాందిని కీలక పాత్రలు పోషించారు. ఓ మహిళా గేమ్ డెవలపర్ తనకు ఎదురైన సవాళ్లను గేమ్ డెవలపింగ్ ద్వారా ఎలా సాల్వ్ చేశారనేదే ఈ సిరీస్ స్టోరీ అని తెలుస్తోంది.
View this post on Instagram
Also Read: మళ్లీ థియేటర్లలోకి విజువల్ వండర్ 'అవతార్ 2' - 3D ఎక్స్‌పీరియన్స్ ఎంజాయ్ చేయండి... ఎప్పుడో తెలుసా?
ఈ సిరీస్ నేటి సమాజానికి ప్రతిబింబం లాంటిదని డైరెక్టర్ రాజేశ్ ఎం. సెల్వ తెలిపారు. డిజిటల్ తెరల్లో మన వివరాలు, రహస్యాలు చిక్కుకున్నాయని... నిజానికి, మోసానికి మధ్య ఉండే సన్నని గీత ఈ సిరీస్ స్టోరీ అని చెప్పారు.





















