అన్వేషించండి

Telugu Indian Idol Season 3: తుది ఘట్టానికి స్వర యుద్ధం, ఇవాళే గ్రాండ్ ఫినాలే... ప్రోమో చూస్తే ఆహా అనాల్సిందే

‘ఆహా‘ తెలుగు ఇండియన్ ఐడియల్ సీజన్ 3 ఫైనల్ కు చేరుకుంది. ఇవాళ టైటిల్ విజేత ఎవరో తేలిపోనుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో కంటెస్టెంట్లు అదిరిపోయే పాటలతో ఆహా అనిపించారు.

Telugu Indian Idol Season 3 Finale Promo:  తెలుగు ఓటీటీ దిగ్గజం ఆహా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షో తుది ఘట్టానికి చేరుకున్నది. 24 వారాలుగా కొనసాగుతున్న ఈ స్వర యుద్దం చివరి పోరుకు సిద్ధం అయ్యింది. ఈ సీజన్ కోసం ఏకంగా 37 దేశాలలో ఆడిషన్స్ నిర్వహించగా 1500 మంది పాల్గొన్నారు. వారిలో 100 మందిని సెలెక్ట్ చేసి చివరకు 12 మంది కంటెస్టెంట్స్ గా తీసుకున్నారు. ఎలిమినేషన్స్ తర్వాత ఫైనల్ కు ఐదురుగురు సెలెక్ట్ అయ్యారు. చక్కటి ఫర్మార్మెన్స్ తో అనిరుధ్, కీర్తన, నజీరుద్దీన్, శ్రీకీర్తి, స్కంద టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. తాజాగా ఈ షో ఫైనల్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది. అదిరిపోయే ఫర్మార్మెన్స్ తో కంటెస్టెంట్లు అదరగొట్టారు.

అద్భుతమైన పాటలతో మైమరిపించిన కంటెస్టెంట్లు

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఫైనల్లో ఐదురుగు కంటెస్టెంట్లు క్లాస్, మాస్ పాటలతో ఆకట్టుకున్నారు. కీర్తన ‘పరువం వాలగా..’ అనే పాటతో పాటు ‘గోంగూర తోటకాడ కాపుకాశా’ అనే సాంగ తో స్టేజ్ దద్దరిల్లేలా చేసింది. కీర్తన పాటలకు జడ్జీలు ఫిదా అయ్యారు. నజీరుద్దీన్ ‘మాటే రాని చిన్నదాని’తో పాటు  ‘రచ్చాడుకోగా..’ అంటూ పాడి రచ్చచేశాడు. శ్రీకీర్తి  ‘దుమ్మురేపే ఆపరేషన్.. దమ్ము ఆపే మాస్ యాక్షన్’తో పాటు ‘చంద్రలేఖా..’ అంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనిరుధ్ ‘ఇది రణరంగం..’ అంటూ పాటతో అదరగొట్టారు. నువ్వా నేనా అంటూ సాగిన ఈ ఫైనల్ లో ఎవరు కప్పు కొట్టారనే ది ఇవాళ తేలనుంది.

పాటలతో అలరించిన తమన్, గీతా మాధురి

అటు ఈ షో జడ్జీలుగా వ్యవహరిస్తున్న తమన్, గీతా మాధురి అదిరిపోయే పాటలతో అలరించారు. “మెలికల్ తిరుగుతుంటె అమ్మాయో” అంటూ గీత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎర్ర చీర, కళ్ల జోడు, కొప్పున మందార పువ్వు పెట్టి ఆహా అనిపించింది. తమన్ పాటిన్ ఫాస్ట్ బీట్ సాంగ్ తో ఆకట్టుకున్నారు.  

నవ్వుల పువ్వులు పూయించిన తమన్ ఫ్యాన్

ఇక తమన్ డై హార్డ్ ఫ్యాన్ అంటూ కీర్తన తమ్ముడిని స్టేజ్ మీదకు పిలుస్తారు. “ఏంట్రా చీటింగ్.. హౌ ఆర్ యు?” అంటారు తమన్. “అయాం ఫైన్” అని చెప్తాడు బుడ్డోడు. “మీ అక్క ఫర్మార్మెన్స్ ఫోన్ లో చూశావా?” అనడంతో “లేదు టీవీలో చూశాను” అని చెప్తాడు. “ఫోన్ లో ఎందుకు చూడలేదు?” అని అడిగితే, “ఛార్జింగ్ అయిపోయింది” అంటూ నవ్విస్తాడు. స్టేజి మీది నుంచి ఆ చిన్నోడిని లేపి తన ఒడిలో కూర్చో బెట్టుకుంటారు తమన్. “ఎప్పుడైనా.. ఎవరైనా.. నిన్ను ఇలా లేపారా?” అని తమన్  అడుగుతారు.  “మీడియా ముందు ఎవరూ లేపలేదు” అని ఆ కుర్రాడు ఆన్సర్ చెప్పడంతో అందరూ పడీ పడీ నవ్వుతారు. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ షో విజేతగా ఎవరు నిలుస్తారోనని బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

Read Also: మత్తు వదలరా... మూడో పార్ట్‌ వస్తుందా? - మూవీ లవర్స్‌ కు డైరెక్టర్ రితేష్ సర్‌ ప్రైజ్ అనౌన్స్‌ మెంట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget