అన్వేషించండి

Mathu Vadalara 3 Movie: మత్తు వదలరా... మూడో పార్ట్‌ వస్తుందా? - మూవీ లవర్స్‌కు డైరెక్టర్ రితేష్ సర్‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్

శ్రీ సింహా, సత్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'మత్తు వదలరా 2' సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్ లో 'మత్తు వదలరా3'పై దర్శకుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Mathu Vadalara 3 Announced: యంగ్ హీరో శ్రీ సింహ, కమెడియన్ సత్య, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం 'మత్తు వదలరా 2'. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కామెడీ ఎంటర్ ​ట్రైనర్... తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తోంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకలో దర్శకుడు రితేష్ రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

'మత్తు వదలరా 2’ సీక్వెల్ పై క్రేజీ అప్ డేట్  

‘మత్తు వదలరా2’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో సీక్వెల్ గురించి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు దర్శకుడు రితేష్ రానా. ‘మత్తు వదలరా 3’ తప్పకుండా ఉంటుందన్నారు. “మత్తు వదలరా 2 సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తే సంతోషంగా ఉంది. ఈ సినిమాకు కొనసాగింపు ఉంటుంది. కచ్చితంగా ‘మత్తువదలరా 3’ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అనేది కచ్చితంగా చెప్పలేను. కానీ, తప్పకుండా వస్తుంది” అని చెప్పుకొచ్చారు. ఇప్పటికే వచ్చిన రెండు సినిమాలు మంచి హిట్ అందుకోవడంతో మూడో భాగంపై ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అంతేకాదు, ‘మత్తు వదలరా 2’ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ వస్తుందా? లేదంటే కొత్త స్టోరీతో తెరకెక్కిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

'మత్తు వదలరా 2’పై చిరంజీవి, మహేష్ బాబు ప్రశంసలు

‘మత్తు వదలరా 2’ సినిమా ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలను ఆకట్టుకుంటున్నది. తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాలో రాత, తీత, కోత, మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేశారంటూ దర్శకుడు రితేష్ రానాను చిరంజీవి అభినందించారు. ఈ మధ్యకాలంతో తనను ఎక్కువగా నవ్వించిన సినిమా ఇదే అన్నారు. ఈ సినిమాలో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికీ అభినందనలు చెప్పారు. అటు ఈ సినిమా చూసి నవ్వుల్లో మునిగిపోయామని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ఈ సినిమా చాలా ఎంటర్ టైనింగ్ గా ఉందన్నారు. వెన్నెల కిషోర్ కనిపించినంత సేపు తన కూతురు సితార నవ్వు ఆపుకోలేక పోయిందన్నారు. సత్య కూడా అద్భుతంగా నవ్వించాడని చెప్పారు. ఈ సినిమాలోని ప్రతి యాక్టర్ అద్భుతంగా అలరించారని చెప్పారు. అందరికీ అభినందనలు చెప్పారు.

ఇక ఈ సినిమాలో  శ్రీ సింహా, సత్య, ఫరియా అబ్దుల్లాతో పాటు వెన్నెల కిశోర్, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. ఈ మూవీని క్లాప్ ఎంటర్‌ టైన్‌ మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై చిరంజీవి పెద్దమల్లు, హేమలత పెద్దమల్లు నిర్మించారు. ఈ చిత్రానికి కాల భైరవ మ్యూజిక్ అందించారు.  

Read Also: ‘మత్తువదలరా 2‘ ఓటీటీ ఫార్ట్ నర్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today July 21st: నిండు మనసులు: ఈశ్వరి మృతి.. గుండెపగిలేలా ఏడుస్తున్న గణ..! అన్నని చూసి ఏడ్చేసిన ప్రేరణ!
నిండు మనసులు: ఈశ్వరి మృతి.. గుండెపగిలేలా ఏడుస్తున్న గణ..! అన్నని చూసి ఏడ్చేసిన ప్రేరణ!
Pradeep Machiraju ETV Show: మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
Nuvvu leka Neanu Lenu Serial Today July 21th:దమయంతి ఎత్తుకు రామచంద్రం పైఎత్తు....రాధను దత్తత తీసుకోవాలని నిర్ణయం
నువ్వులేక నేను లేను: దమయంతి ఎత్తుకు రామచంద్రం పైఎత్తు....రాధను దత్తత తీసుకోవాలని నిర్ణయం
OG Television Premiere: ఈటీవీలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'... గ్రాండ్ టెలికాస్ట్ ప్రీమియర్ ఎప్పుడంటే?
ఈటీవీలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'... గ్రాండ్ టెలికాస్ట్ ప్రీమియర్ ఎప్పుడంటే?

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Trainee IPS Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్
ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్, అంతా డ్రామానే!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
CM Vijay WhatsApp Bribe Buster: సినిమాల్ని తలపించే వాట్సాప్ గుడ్ గవర్నెన్స్ - తమిళనాడులో సీఎం విజయ్ యాంటీ కరప్షన్ వ్యూహం నిలబడుతుందా?
సినిమాల్ని తలపించే వాట్సాప్ గుడ్ గవర్నెన్స్ - తమిళనాడులో సీఎం విజయ్ యాంటీ కరప్షన్ వ్యూహం నిలబడుతుందా?
Assembly Seats Increase: డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
రూ.6 లక్షల లోపే మంచి ఫ్యామిలీ SUV - మన దేశంలో 8 లక్షల మంది ఎంపిక చేసుకున్న కారు
8 లక్షల మంది కొన్న ఫ్యామిలీ SUV, యూత్‌కీ ఇష్టమే - రేటు కూడా రూ.5.70 లక్షలే!
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Embed widget