SSMB29 Update : నవంబర్ 'SSMB29' బిగ్ అప్డేట్ - ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్... ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
Mahesh Babu Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు 'SSMB29' అప్డేట్ కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్ చేసే ఛాన్స్ ఉంది.

Mahesh Babu Rajamouli SSMB29 Event To Live Streaming On OTT : నవంబర్ నెల వచ్చేసింది. యావత్ సినీ ప్రపంచం ఓ బిగ్ అప్డేట్ కోసం ఎదురు చూస్తోంది. అదే దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబో పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ 'SSMB29'. ఇప్పటికే ఆదివారం అర్ధరాత్రి నుంచే ట్విట్టర్‌ను మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ షేక్ చేశారు. దీంతో 'SSMB29' ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఎప్పుడు సార్?
రాజమౌళి గత ప్రాజెక్టుల కంటే ఈ మూవీ చాలా డిఫరెంట్. ఎందుకంటే పూజా కార్యక్రమాల దగ్గర నుంచీ ఏదీ కూడా ఇప్పటివరకూ అఫీషియల్‌గా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు జక్కన్న. మహేష్ బర్త్ డే సందర్భంగా ప్రీ లుక్ రిలీజ్ చేస్తూ... 'Globe Trotter' అనే హింట్ ఇచ్చి నవంబరులో బిగ్ అప్డేట్ ఇస్తామంటూ చెప్పారు. చెప్పిన మాట ప్రకారమే ఈ మూవీ టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇంటర్నేషనల్ స్థాయిలో మూవీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుండగా... అందుకు తగ్గట్లుగానే ఈ బిగ్ అప్డేట్ హాలీవుడ్ లెజెండ్ 'జేమ్స్ కామెరూన్' చేతుల మీదుగా రివీల్ చేయనున్నారట.
ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్
ఈ మూవీ అప్డేట్‌ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ ఈవెంట్‌లో రివీల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. ఈ నెల 16న లాంచ్ ఈవెంట్ కోసం రెడీ చేస్తుండగా... దీన్ని ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఈ వేడుకను లక్ష మంది జనం మధ్య భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మహేష్, రాజమౌళి మూవీ అప్డేట్స్ కోసం అటు మహేష్ ఫ్యాన్స్‌తో పాటు ఇటు వరల్డ్ వైడ్‌గా మూవీ లవర్స్, యావత్ సినీ ప్రపంచం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
View this post on Instagram
Also Read : ముగ్గురు స్టార్స్... మాస్ సాంగ్... డ్యాన్స్ వైరల్ మాత్రమే కాదు వేరే లెవల్ - '45 ద మూవీ' బిగ్ ట్రెండింగ్
ఆదివారం అర్ధరాత్రి మూవీ టీం సోషల్ మీడియాలో సరదాగా చేసిన చాట్ హైప్ పదింతలు పెంచేశాయి. 'నవంబర్ వచ్చేసింది. అప్డేట్ ఎప్పుడు సార్' అంటూ మహేష్ అడిగితే 'ఇప్పుడే కదా మొదలైంది మహేశ్. ఒక్కొక్కటి ఒక దాని తర్వాత ఒకటి నెమ్మదిగా ఇద్దాం' అంటూ చెప్పారు రాజమౌళి. వీరితో పాటే ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం వారి వారి ఒపీనియన్స్ సరదాగా షేర్ చేసుకున్నారు. ఈ చాట్ వైరల్ అవుతోంది.
#SSMB29 టీమ్ నుంచి తొలిసారిగా అప్డేట్స్ వెల్లువ.
— ABP Desam (@ABPDesam) November 1, 2025
మహేశ్ బాబు, రాజమౌళి, ప్రియాంకచోప్రా, పృథ్వీరాజ్ ల మధ్య జరిగిన ఫన్నీ బ్యాంటర్ వల్ల తెలిసింది ఏంటంటే..ఈ సినిమా గురించి నవంబర్ లో ఇస్తానన్న #SSMB29 అప్డేట్ డేట్ ఎప్పుడో నవంబర్ 2న చెబుతున్నారు. సినిమాలో హీరో మహేశ్ @urstrulyMahesh సరసన… pic.twitter.com/wlECq0G7b2
లాంగ్ షెడ్యూల్
ఇక, ఇప్పటికే ఒడిశా, నైరోబీ, కెన్యా ప్రాంతాల్లో షూటింగ్ కంప్లీట్ కాగా... తాజాగా హైదరాబాద్‌లో లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం 'వారణాసి' టెంపుల్ సెట్ వేశారనే టాక్ వినిపిస్తోంది. నవంబర్ రెండో వారం నుంచి మహేష్‌పై భారీ యాక్షన్ సీక్వెన్స్ సహా ఓ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ప్రపంచ యాత్రల సాహస ప్రయాణంగా మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.





















