అన్వేషించండి

Squid Game 3 ఉచితంగా డౌన్‌లోడ్ చేస్తున్నారా? అయితే డేంజర్! లీక్ అయిన వెబ్ సిరీస్ పైరసీతో ముప్పు! | Telugu

Squid Games 3 Leaked: స్క్విడ్ గేమ్స్ 3 లీక్డ్‌ వెర్షన్ నెట్‌లో వైరల్ అవుతోంది. దీని చూడాలని పొరపాటున ఉచిత డౌన్‌లోడ్ లింక్‌లపై క్లిక్ చేశారో భారీగా నష్టపోతారు. 

Squid Games 3 : ప్రపంచమంతా ఎంతగానో ఎదురు చూస్తున్న కొరియన్ వెబ్‌సిరీస్‌ స్క్విడ్ గేమ్స్ మొదలైపోయాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ఈరోజు(జూన్ 27) నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. లీ జంగ్-జే, లీ బైయుంగ్-హున్ నటించిన మూడో సీజన్ అభిమానులను థ్రిల్ చేస్తోంది. చిల్లింగ్ గేమ్‌లు, సంఘర్షణలు, షాకింగ్ మలుపులు వేరే లెవల్‌కు తీసుకెళ్తున్నాయి. అయితే వెబ్‌సిరీస్‌ స్ట్రీమింగ్ అయిన కాసేపటికే దీన్ని పైరేట్ చేశారు. పైరేటెడ్ కాపీలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. 

Tamilrockers, Movierulez, Filmyzilla, Telegram ఛానెల్స్‌లో ప్రసిద్ధ వెబ్‌సైట్‌లు HD 1080p నుంచి 240p వరకు చాలా ఫార్మాట్‌లలో స్క్విడ్ గేమ్స్ 3ని అప్‌లోడ్ చేశాయి. అధికారికంగా ప్రారంభించిన కొన్ని గంటల తర్వాత ఈ వెబ్‌సిరీస్ లీక్ అయింది. దీనిపై సైబర్ భద్రతా నిపుణులు, కంటెంట్ క్రియేటర్స్‌ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

'స్క్విడ్ గేమ్స్ 3'ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుంటే ఏమవుతుంది? 
ఆ ఉచిత డౌన్‌లోడ్ లింక్‌లపై క్లిక్ చేయాలనే ఆలోచనతో ఉంటే మాత్రం ప్రమాదంలో పడ్డట్టే. పైరేటెడ్ కంటెంట్‌ను చట్టవిరుద్ధంగా యాక్సెస్ చేయడం వల్ల భారతదేశంలో కాపీరైట్ చట్టాలు ఉల్లంఘించినట్టు అవుతుంది.ఇలా చేస్తే వినియోగదారులు న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కుంటారు. భారతీయ నిబంధనల ప్రకారం, నేరస్థులు రూ. 2 లక్షల వరకు జరిమానా చెల్లించాలి. జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది.

చట్టపరమైన ప్రమాదాలకుమించి, ఈ వెబ్‌సైట్‌లు మాల్వేర్‌కు నిలయంగా పేరుగాంచాయి. స్పైవేర్, రాన్సమ్‌వేర్ నుంచి వ్యక్తిగత డేటాను చోరీకి తయారు చేసిన నకిలీ డౌన్‌లోడ్ బటన్‌ వరకు, పైరసీ ప్లాట్‌ఫారమ్‌లు ప్రమాదాలతో నిండి ఉన్నాయి. అందుకే ఒకసారి మీరు అందులోకి వెళ్లి డౌన్‌లోడ్ క్లిక్ చేస్తే మీ సమాచారం వాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది.  

మీరు అత్యుత్తమ నాణ్యత గల వినోదానికి పొందాలనుకుంటే ఇది సరైన మార్గం కాదు. పైరేటెడ్ వెర్షన్‌లో ఆ ఫీల్ కనిపించదు. ఆడియో సరిగా ఉండదు. వీడియో కూడా బ్లర్ అవుతుంది.   
పైరసీ వినోద పరిశ్రమను నాశనం చేస్తోంది. అంతే కాదు  కళాకారుల గుర్తింపు, ఆదాయానికి కూడా గండిపడుతుంది.  స్క్విడ్ గేమ్స్ 3 లీక్ నెట్‌ఫ్లిక్స్‌కు మాత్రమే కాకుండా, దర్శకుల నుంచి VFX కళాకారుల వరకు - సృజనాత్మక వ్యక్తులకు ఇది పెద్ద షాక్‌కు గురి చేసింది.  

వినోద పరిశ్రమ ముఖ్యంగా స్క్విడ్ గేమ్స్ వంటి హై-ప్రొఫైల్ నిర్మాణ సంస్థలు పైరసీతో పోరాడుతూనే ఉన్నాయి. చట్టవిరుద్ధమైన అప్‌లోడ్‌లు తొలగించడానికి టెక్ టీంలు ప్రయత్నిస్తున్నారు.  
 
గమనిక: ABP దేశం ఇటువంటి పైరసీ చర్యలను ఖండిస్తుంది. కంటెంట్ సృష్టికర్తలకు మద్దతుగా నిలుస్తుంది. కథలకు ప్రాణం పోసే కళ, కళాకారులను గౌరవిద్దాం. బాధ్యతాయుతంగా చూడండి. పైరసీకి నో చెప్పండి.

టాప్ హెడ్ లైన్స్

Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Embed widget