Squid Game 2 Trailer: డేంజర్ గేమ్స్‌కు రెడీ... నెట్‌ఫ్లిక్స్‌లో బ్లాక్ బస్టర్ సిరీస్ సీక్వెల్ ఎప్పట్నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఒక చిన్న పిల్లల ఆటను అత్యంత క్రూరంగా మార్చి, ఓ మర్డర్ మిస్టరీ రూపంలో చూపించాలనే కొత్త ఐడియాతో రూపొందిన ‘స్క్విడ్ గేమ్’ నెట్ ఫ్లిక్స్ లో సూపర్ హిట్ అయింది. దానికి సీక్వెల్ గా మరో సీజన్ రాబోతోంది.
నెట్ ఫ్లిక్స్ లో బ్లాక్ బస్టర్ అయిన కొరియన్ వెబ్ సిరీస్ లలో ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. హవాంగ్ డోంగ్ రచించి, దర్శకత్వం వహించారు. దక్షిణ కొరియాలో డబ్బున్న వారికి , పేద వారికి చాలా సామాజిక అంతరం ఉంటుంది. ఈ కారణంగా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల ఆధారంగా హవాంగ్ ఈ కథను రాసుకున్నారు. 456 ఆటగాళ్లను ఓ దీవిలో బంధిస్తారు. అందరూ పేదవాళ్లు. అప్పుల్లో కూరుకుపోయిన వాళ్లు. అలాంటి వాళ్లను ఎంపిక చేసుకొని, ఆటలో ఓడిపోయిన వారి చంపుతూ ఉంటారు ముసుగు వ్యక్తులు. సియాంగ్ గి హున్ ... ప్లేయర్ నెం 456. పేరు సియాంగ్. ఈ ప్రమాదకరమైన ఈ ఆట నుంచి బయట పడతాడు. ఈ వెబ్ సిరీస్ తొలి సీజన్ ఇక్కడితో ముగుస్తుంది.
‘స్క్విడ్ గేమ్’లో తన లానే అక్కడ ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసుకురావాలని మరో సారి ఆ డేంజర్ గేమ్స్ ను ఆడటానికి వెళతాడు. తన లానే డబ్బుల కోసం తెగించిన వారిని చూశాడు. వారికి నిజం చెప్పేలా ప్రయత్నిస్తూనే, ఈ ఆట వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ను చంపాలన్నది సియాంగ్ ప్లాన్. ఇదంతా సీజన్ 2 ట్రైలర్ లో చూపించారు. మరి మిగతా కథేంటో డిసెంబర్ 26న నెట్ ఫ్లిక్స్ లో చూడాల్సిందే.
View this post on Instagram
Also Read: ఓటీటీలోకి లక్కీ భాస్కర్... 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందంటే?
Squid Game Season 2 Release Date Netflix: ‘సైలెన్స్’, ‘మిస్ గ్రానీ’, ‘ద ఫోర్ట్రస్’ చిత్రాలకు ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఆయన తీసిన ‘మిస్ గ్రానీ’ చిత్రమే తెలుగు లో సమంత ప్రధాన పాత్రలో ‘ఓ బేబీ’ గా రీమేక్ అయింది . ఈ చిత్రాల తర్వాతే నెట్ ఫ్టిక్స్ స్క్విడ్ గేమ్ కథ వినడంతో ఈ వెబ్ సిరీస్ ప్రారంభమైంది. రెండో సీజన్ కు కూడా హవాంగ్ దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ కొరియన్ వెబ్ సిరీస్ కు హాలీవుడ్ రీమేక్ రానుందని టాక్. ‘ఫైట్ క్లబ్’, ‘సెవన్’, ‘ద జోడియాక్’ సినిమాల ఫేమ్ డేవిడ్ ఫించర్ అమెరికన్ వెర్షన్ కు దర్శకత్వం వహిస్తారట. అయితే, ఈ రీమేక్ మాత్రం వద్దని అమెరికన్ మీడియా తో పాటు స్క్విడ్ గేమ్స్ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు.
Also Read: కిరణ్ అబ్బవరం స్ట్రాంగ్ కమ్‌బ్యాక్... కొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న 50 కోట్ల సినిమా 'క'