Soniya Singh: రాజమౌళి పాటల్లోనూ డబుల్ మీనింగ్స్ - అలా మాట్లాడితేనే ఎంజాయ్ చేస్తున్నారు: నటి సోనియా సింగ్
Soniya Singh: యూట్యూబర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన సోనియా సింగ్.. ఒక షోలో మాట్లాడిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ వల్ల చాలా ఫేమస్ అయ్యింది. తాజాగా దాని వల్ల తనకు ఎదురైన నెగిటివిటీపై స్పందించింది సోనియా.
Soniya Singh: యూట్యూబర్‌గా తమ కెరీర్‌ను ప్రారంభించి సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చినవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో సోనియా సింగ్ ఒకరు. సోనియా సింగ్, సిద్ధు పవన్ జంట సోషల్ మీడియాలో ఫేమస్. వీరిద్దరూ కలిసి చేసిన వెబ్ సిరీస్‌లను చూసే ప్రేక్షకుల సంఖ్య చాలా ఎక్కువ. అయితే వీరిద్దరూ కలిసి ఒక షోలో పాల్గొనడానికి వచ్చినప్పుడు సోనియా సింగ్ మాట్లాడిన మాటలు డబుల్ మీనింగ్‌లో ఉన్నాయని చాలామంది నెటిజన్లు తనను ట్రోల్ చేశారు. ఇప్పటికీ ఆ ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. దీంతో తాజాగా మరోసారి వాటిపై స్పందించింది సోనియా సింగ్.
నేను సైలెంట్..
‘‘మేము ఎక్కడా బ్యాడ్‌గా ఫీల్ అవ్వలేదు. డబుల్ మీనింగ్ అంటే ముందుగా అసలు డబుల్ మీనింగ్ అంటే ఏంటి అని అడుగుతాను. ఒక ఉదాహరణ చెప్తాను. రాజమౌళి సినిమాల్లో సాంగ్స్ అంటే చాలామందికి ఇష్టం. ఈమధ్య రీల్స్‌లో ఆ సాంగ్స్‌ను కట్ చేసి వాటి వెనుక డబుల్ మీనింగ్ వెతుకున్నారు. కానీ అప్పట్లో ప్రేక్షకులు ఆ పాటలను చాలా పాజిటివ్‌గా తీసుకొని ఎంజాయ్ చేశారు. ఏ విషయం అయినా జనాలు ఎలా చూస్తే అలా కనిపిస్తుంది. నేను మాట్లాడింది ఏదీ స్క్రిప్ట్ కాదు. మామూలుగా నేను సైలెంట్‌గా ఉంటాను. కానీ ఆ సైలెన్స్‌ను జనాలు యాక్సెప్ట్ చేయట్లేదు. నేను మాట్లాడుతుంటూ వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఎలా ఉన్నా 20 శాతం మంది మనకు నెగిటివ్‌గానే ఉంటారు’’ అని చెప్పుకొచ్చింది సోనియా సింగ్.
అదే ముఖ్యం..
‘‘అందరిని నేను తృప్తిపరచలేను. నేను సంతోషంగా ఉన్నానా లేదా అన్నదే నాకు ముఖ్యం. అలా చేస్తే పబ్లిసిటీ వస్తుందంటే నేను అయిదేళ్ల క్రితమే నా కెరీర్‌ను ప్రారంభించాను. అప్పుడే ఇలా చేసేదాన్ని. ఇప్పుడు కూడా 20 శాతం మంది నా ప్రవర్తనను తీసుకోలేకపోయారు. కానీ 80 శాతం మంది ఎంజాయ్ చేశారు. ఎవరు ఏమనుకుంటున్నారు అని పక్కన పెడితే సిద్ధుకు ఏం ప్రాబ్లమ్ లేదు’’ అని తెలిపింది సోనియా సింగ్. సిద్ధు కూడా తనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. ‘విరూపాక్ష’ ఆడియో లాంచ్‌లో సోనియా మాటలను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నాడు. ఇక వారు పాల్గొన్న షో గురించి చెప్తూ.. అందులో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ముందే చెప్పరని, అప్పుడు మన మైండ్‌లో ఏం అనిపిస్తే అది మాట్లాడతామని చెప్పాడు సిద్ధు పవన్.
వెబ్ సిరీస్‌తో ఫేమస్..
ముందుగా ఒక యూట్యూబ్ ఛానెల్‌లో కలిసి వీడియోలు చేసేవారు సోనియా సింగ్, సిద్ధు పవన్. అప్పుడే వారు ప్రేమలో పడ్డారు. అప్పటినుండి వీరు కలిసి చేసిన ప్రతీ వీడియో హిట్ అయ్యింది. అలా వీరు కలిసి అరడజనుకు పైగా వెబ్ సిరీస్‌లలో నటించారు. దీంతో వీరి ఫేమ్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ వరకు వచ్చేసింది. ఈటీవీ విన్ కోసం ‘శశి మథనం’ అనే వెబ్ సిరీస్‌ను చేశారు. తాజాగా ఈ సిరీస్ విడుదల అయ్యింది. ‘శశి మథనం’ ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవ్వడానికి వీరిద్దరూ కలిసి చాలా ప్రమోషన్స్ కూడా చేశారు. మొత్తానికి ఒక్క షోతో సోనియా సింగ్ పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయిందని నెటిజన్లు అనుకుంటున్నారు.
Also Read: ఈటీవీ విన్ ఓటీటీ కోసం... చంద్రశేఖర్ యేలేటి వెబ్ సిరీస్!