Heeramandi : సోనాక్షి సిన్హాతో బెడ్ సీన్.. ఆమె తల్లి ముందే అలా చెయ్యాల్సి వచ్చింది: ‘హీరామండి’ నటుడు ఇంద్రేష్
Heeramandi : హీరామండి.. నెట్ ఫ్లిక్స్ లో ఈ షో రిలీజైనప్పటి నుంచి దీని గురించే చర్చించుకుంటున్నారు సినిమా లవర్స్ అందరూ. ఇక ఇప్పుడు ఆ సిరీస్ లో నటించిన ఇంద్రేష్ షూటింగ్ విశేషాలు పంచుకున్నారు.
Since Sanjay Leela Bhansali's Heeramandi : ‘హీరామండి: ది డైమండ్ బజార్’.. ఇప్పుడు సినిమా లవర్స్ అందరూ ఈ సిరీస్ గురించే చర్చ. అంతలా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది సిరీస్. సంజయ్ లీలా బన్సాలీ తీసిన ఫస్ట్ సిరీస్ ఇది. మే 1న నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ఈ సిరీస్ ని ప్రేక్షకుల బాగా ఆదరించారు. దీంతో ఈ సినిమా స్టార్లు సోషల్ మీడియాలో తెగ కనిపిస్తున్నారు. ఇంటర్వ్యూల్లో, ప్రమోషన్స లో ఎక్కడ చూసినా వీళ్లు కనిపిస్తున్నారు. ఇక ఈ సిరీస్ లో చేసిన ఇంద్రేష్ ఒక ఇంటర్వ్యూలో షూటింగ్ విశేషాలు పంచుకున్నారు.
వాళ్ల ముందే ఆ సీన్ చేసింది..
ఇంటర్వ్యూలో భాగంగా.. సెట్ లో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గుర్తు చేసుకున్నాడు ఇంద్రేష్. ఒక సీన్ లో సోనాక్షి సిన్హాతో నటించాల్సినప్పుడు ఇబ్బంది పడితే.. ఆమె తనను కామ్ డౌన్ చేసి, కంఫర్ట్ చేసిందని అన్నారు. “ఒక సీన్ లో సోనాక్షి నా తలని తన కాలితో లాగాలి. అక్కడే ఆమె తల్లి పూనమ్ సిన్హా ఉన్నారు. దీంతో నేను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. కానీ, సోనాక్షి మాత్రం నన్ను రిలాక్స్ అవ్వమని, నన్ను కంఫర్ట్ చేసి నటించారు. అవన్నీ నాకు చాలా స్వీట్ మెమోరీస్ ” అని చెప్పారు ఇంద్రేష్.
బన్సాలీ సార్ పర్ఫెక్ట్..
డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ చాలా పర్ఫెక్ట్ అని చెప్పారు ఇంద్రేష్. అందుకే, ఒక్కో సీన్ గురించి దాదాపు గంట సేపు చర్చించుకుని టేక్ కి వెళ్తామని అన్నారు. “ఒక్కోసీన్ చేసేందుకు పెద్దగా టైం తీసుకోం. రీ టేక్స్ కూడా ఎక్కువగా ఉండవు. సంజయ్ సార్ అస్సలు వదిలిపెట్టరు. చాలా పర్ఫెక్ట్. అందుకే, నేను నా కో స్టార్ జాసన్.. దాదాపు గంట సేపు సీన్ గురించి డిస్కస్ చేసుకుని, ఆ తర్వాత మాత్రమే ఫ్లో తో వెళ్లేవాళ్లం” అంటూ తన ఎక్స్ పీరియెన్స్ షేర్ చేసుకున్నారు.
ఛాలెజింగ్ రోల్..
ఉస్తాద్ జీ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. ఆ క్యారెక్టర్ కావాలనే చేశానని అన్నారు. అది చాలా ఛాలెంజింగ్ గా ఉంటుందని చెప్పారు. అది తనకు బాగా సూట్ అవుతుందని చూజ్ చేసుకున్నట్లు చెప్పారు. “ఉస్తాద్ జీ క్యారెక్టర్ లో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అందుకే, నాకు కాస్టింగ్ డిపార్ట్ మెంట్ నుంచి కాల్ వచ్చిన వెంటనే ఒప్పేసుకున్నాను” అని చెప్పారు ఆయన.
రియల్ స్టోరీ..
‘హీరామండి: ది డైమండ్ బజార్’ లో సోనాక్షి సిన్హాతో పాటు అదితి రావు హైదరి, షర్మిన్ సెగల్, మనీషా కొయిరాల, సంజీదా షేక్, రిచా చడ్డా నటించారు. ఈ 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్‌ను తన స్టైల్‌లో రిచ్‌గా తెరకెక్కించారు భన్సాలీ. హీరామండి అనే ఒక రెడ్ లైట్ ఏరియాలో జరిగిన రియల్ స్టోరీ హీరామండి.
Also Read: షర్మిల కంట్రోల్ తప్పింది - తోడేలు, గుంటనక్కల కథ చెప్పిన యాంకర్ శ్యామలా.. ఆమె టార్గెట్ వారేనా?