రాత్రి పూట అన్నం తింటే జీర్ణసమస్యలు రావచ్చు. అన్నంలోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు జీవక్రియలను మందగింపచేస్తాయి. రాత్రి అన్నం తింటే అసౌకర్యంగా, కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అజీర్తికి కారణం కావచ్చు. కార్బోహైడ్రేట్లు కలిగిన అన్నం తింటే వాటిలోని శక్తి కొవ్వుగా నిలువ ఉండి బరువు పెరిగేందుకు కారణం అవుతాయి. రాత్రిపూట కార్బోహైడ్రేట్లు కలిగిన అన్నం కంటే సూక్ష్మపోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం జీవక్రియల ఆరోగ్యానికి మంచిది. రాత్రి తీసుకునే ఆహారంగా ఎప్పుడైనా తేలికగా.. ప్రొటీన్లు ఎక్కువ ఉండేవి తీసుకోవాలి. ఈ ఆహారం బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపు చేస్తాయి. అన్నంలో కొలెస్ట్రాల్ తక్కువ. బియ్యంలోని ఫైబర్ ఎల్డీఎల్ శోషణకు దోహదం చేస్తుంది. ఎక్కువ ఫైబర్, ఎక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన అన్నం రాత్రి భోజనంలో తీసుకోకపోవడమే అన్ని రకాలుగా మంచిది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే