News
News
X

Prince OTT Release: ప్రిన్స్ ఓటీటీలో వచ్చేస్తుంది - ఎప్పుడు రానుందంటే?

అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ప్రిన్స్ సినిమా నవంబర్ 25వ తేదీ నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ కానుంది.

FOLLOW US: 
 
జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో, తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘ప్రిన్స్’ దీపావళికి థియేటర్లలో విడుదల అయింది. అయితే ప్రేక్షకుల వద్ద నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధం అవుతోంది.

నవంబర్ 25వ తేదీ నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ విషయాన్ని డిస్నీప్లస్ హాట్‌స్టార్ తమ తమిళ అధికారిక పేజీ ద్వారా ప్రకటించారు. అనుదీప్ మొదటి సినిమా జాతిరత్నాలు థియేటర్ల వద్ద సూపర్ హిట్ కాగా, ఓటీటీలో మిశ్రమ స్పందనను అందుకుంది. ప్రిన్స్‌కు థియేటర్ల వద్ద మిశ్రమ స్పందన ఎదురైంది. ఓటీటీల్లో ఆదరణ లభిస్తుందేమో చూడాలి.

టాలీవుడ్‌లో టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లు అయిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. శాంతి టాకీస్ నిర్మాణ భాగస్వామిగా ఉంది. నారాయణ్ దాస్ కె. నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.

ఒక భారతీయ కుర్రాడు, వేరే దేశానికి చెందిన అమ్మాయిని ప్రేమించడం వల్ల కలిగే ఇబ్బందులను  ఈ సినిమాలో ఫన్నీగా చూపించారు. 'సీమ రాజా', 'రెమో', 'డాక్టర్', 'డాన్' సినిమాలతో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేశారు. 

News Reels

ఇక అనుదీప్ చేతిలో కూడా రెండు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్‌తో హారిక హాసిని బ్యానర్‌లో ఒక సినిమా అనుకుంటున్నామని.. ఇంకా కథ ఓకే అవ్వలేదని చెప్పారు. అలానే హీరో రామ్‌కి ఒక కథ చెప్పాలని అన్నారు. హారిక హాసిని, మైత్రి మూవీ మేకర్స్ అంటే టాప్ ప్రొడక్షన్ హౌస్ లు. ఈ బ్యానర్స్ లో సినిమాలు పడి క్లిక్ అయితే అనుదీప్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరడం గ్యారెంటీ. మరేం జరుగుతుందో చూడాలి. 

View this post on Instagram
 
A post shared by Disney+ Hotstar Tamil (@disneyplushotstartamil)

Published at : 14 Nov 2022 07:34 PM (IST) Tags: Sivakarthikeyan Anudeep KV Prince Prince OTT Release Date Prince in DisneyPlus Hotstar

సంబంధిత కథనాలు

Malaika Arora: అర్బాజ్‌తో అందుకే విడిపోయా - అర్జున్‌తో రిలేషన్ ట్రోల్స్ పట్టించుకోను: మలైకా అరోరా

Malaika Arora: అర్బాజ్‌తో అందుకే విడిపోయా - అర్జున్‌తో రిలేషన్ ట్రోల్స్ పట్టించుకోను: మలైకా అరోరా

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!

Mirzapur season 3: ‘మీర్జాపూర్’ సీజన్ 3 అప్‌డేట్ - ఎమోషనల్ పోస్టుతో గుడ్డూ భయ్యా గుడ్ న్యూస్!

Mirzapur season 3: ‘మీర్జాపూర్’ సీజన్ 3 అప్‌డేట్ - ఎమోషనల్ పోస్టుతో గుడ్డూ భయ్యా గుడ్ న్యూస్!

Yashoda Movie OTT Release : సమంత 'యశోద' - ఈ వారమే ఓటీటీలోకి

Yashoda Movie OTT Release : సమంత 'యశోద' - ఈ వారమే ఓటీటీలోకి

Ginna Movie Trends: ఓటీటీలో దూసుకుపోతున్న ‘జిన్నా’ మూవీ? దేశవ్యాప్తంగా ట్రెండింగ్!

Ginna Movie Trends: ఓటీటీలో దూసుకుపోతున్న ‘జిన్నా’ మూవీ? దేశవ్యాప్తంగా ట్రెండింగ్!

టాప్ స్టోరీస్

Bandi sanjay Drugs Case: బెంగళూరు డ్రగ్స్ కేసు రీ ఓపెన్ చేస్తామని బండి సంజయ్ హెచ్చరికలు ! అసలు ఆ కేసేంటి ? అందులో ఎవరు ఉన్నారు ?

Bandi sanjay Drugs Case: బెంగళూరు డ్రగ్స్ కేసు రీ ఓపెన్ చేస్తామని బండి సంజయ్ హెచ్చరికలు ! అసలు ఆ కేసేంటి ? అందులో ఎవరు ఉన్నారు ?

Mandous Cyclone Alert : దూసుకొస్తున్న మాండౌస్‌- శుక్రవారం తీరం రాత్రి తీరం దాటేది ఎక్కడంటే?

Mandous Cyclone Alert : దూసుకొస్తున్న మాండౌస్‌- శుక్రవారం తీరం రాత్రి తీరం దాటేది ఎక్కడంటే?

Rohit Sharma Innings: 'రోహిత్' ది వారియర్- భారత్ మ్యాచ్ ఓడినా అతను మనసులు గెలిచాడు

Rohit Sharma Innings: 'రోహిత్' ది వారియర్- భారత్ మ్యాచ్ ఓడినా అతను మనసులు గెలిచాడు

కేజీయఫ్ తాత ఇక లేరు - అనారోగ్యంతో కన్నుమూత!

కేజీయఫ్ తాత ఇక లేరు - అనారోగ్యంతో కన్నుమూత!