Shanmukh Jaswanth: స్టేజీ మీద ఏడ్చేసిన షణ్ముఖ్ జస్వంత్... షన్నుకు ఎందుకంత బాధ? ఏమైంది?
కొన్నాళ్ల క్రితం డ్రగ్స్ కేసు, డ్రంక్ డ్రైవ్ కేసు... ఇలా వివాదాలతో షణ్ముఖ్ జస్వంత్ కెరీర్ లో కాస్త వెనుకబడ్డారు. ఏడాది బ్రేక్ తీసుకొని ‘లీలా వినోదం’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
Shanmukh Jaswanth cries on stage: షణ్ముఖ్ జస్వంత్... యూట్యూబ్ కంటెంట్ తో జనాలకు బాగా చేరువైన నటుడు. బిగ్ బాస్ షో ద్వారా మరింత క్రేజ్ తెచ్చుకున్నారు. ఆయన హీరోగా నటించిన వెబ్ సిరీస్ ‘లీలా వినోదం’ (Leela Vinodam Web Series) డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. షణ్ముఖ్ జస్వంత్ కొన్నాళ్ల క్రితం మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అతని కెరీర్ కు బ్రేక్ పడుతుందని చాలా మంది భావించారు. ఈ వెబ్ సిరీస్ ప్రెస్ మీట్ లో ఎమోషనల్ అయ్యారు షణ్ముఖ్.
ఎవరో చేసిన తప్పుకు బలయ్యా
''నేను కంటెంట్ చేసి ఏడాది అయిపోయింది. ఎక్కడో వైజాగ్ లో ఉన్న నేను నా కజిన్ ప్రోత్సాహంతో యాక్టింగ్ లోకి వచ్చాను. దాదాపు పదేళ్లయింది. ఈ జర్నీలో చాలా నెగటివిటీని ఎదుర్కొన్నాను. తట్టుకుంటాను. కానీ ఎవరో చేసిన తప్పుకు నేను బలయ్యాను. మా అమ్మ నాన్నలు నా వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్లకు సారీ చెబుతున్నా. అమావాస్యను చూసినవాడు పౌర్ణమిని చూస్తాడంటారు. నా కెరీర్ అయోమయోంలో ఉన్న సమయంలో నన్ను నమ్మి 'లీలా వినోదం' మేకర్స్ నాకీ అవకాశమిచ్చారు'' అని షణ్ముఖ్ జస్వంత్ చెప్పారు.
Also Read: బిగ్ బాస్ 8 విజేత నిఖిల్... అతని కంటే ముందు విన్నర్స్ ఎవరో గుర్తు ఉన్నారా? ఓ లుక్ వేయండి
‘లీలా వినోదం’ వెబ్ సిరీస్ కు పవన్ సుంకర దర్శకత్వం వహించారు. ఇందులో గోపరాజు రమణ, ఆమని, అనగ అజిత్, రూపలక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీధర్ మారిసా నిర్మాత. ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి ఇబ్బంది పడే ఓ సగటు కుర్రాడిగా జస్వంత్ కనిపిస్తారు. అయితే దీనికి ఓ కారణం ఉందట. అదేంటో సస్పెన్స్ అంటున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ టీజర్, ట్రయిలర్లు ప్రేక్షకుల్ని ఆకర్షించాయి. అనగ అజిత్ కథానాయికగా నటించి ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ (ETV Win)లో డిసెంబర్ 19న స్ట్రీమింగ్ కానుంది.
అసలేం జరిగిదంటే...
షార్ట్ ఫిలింస్ తో కెరీర్ మొదలుపెట్టిన షణ్ముఖ్, కవర్ సాంగ్స్ తో మరింత పాపులర్ అయ్యారు. సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ తో లైమ్ లైట్ లో కి వచ్చారు షణ్ముక్ జస్వంత్. బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడంతో షణ్ముఖ్ పాపులారిటీ మరింత పెరిగింది. అతనికి మరింత క్రేజ్ వచ్చింది. అయితే హౌస్ లో కొన్ని వివాదాలు అతని వ్యక్తిత్వాన్ని మసకబార్చాయి. ఈ నేపథ్యంలో అతని గాళ్ ఫ్రెండ్ తో బ్రేకప్ కూడా అయింది. బిగ్ బాస్ విన్నర్ కాలేకపోయారు. దీంతో షో తర్వాత షణ్ముఖ్ కెరీర్ కాస్త నెమ్మదించింది. ఆ తర్వాత డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు షణ్ముఖ్. ఓ యువతి ఇచ్చిన కంప్లైట్ ఆధారంగా షణ్ముఖ్ సోదరుడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులకు... ఆయన ఫ్లాటులో గంజాయి లభించింది. దాంతో సోదరులిద్దరూ గంజాయి కేసులో అరెస్ట్ అయ్యారు. షణ్ముక్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పడ్డట్టేనని చాలా మంది అనుకున్నారు. ఈ కేసు నుంచి బయటపడ్డారు షణ్ముఖ్. కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్నారు కూడా. తాజాగా ఈ వెబ్ సిరీస్ తో మళ్లీ తన కెరీర్ ను గాడిలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.