![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nanda Kishore: ప్రేక్షకులు అలా అనుకున్నారు, నా జీవితంలో బాధాకరమైన విషయం అదే - సీరియల్ యాక్టర్ నందకిషోర్
Serial Actor Nanda Kishore: ‘చిలసౌ స్రవంతి’ సీరియల్ ద్వారా బుల్లితెరపై ఓ వెలుగు వెలిగారు నందకిషోర్. ఆ సీరియల్ కో యాక్టర్ మీనా కుమారితో వచ్చిన రూమర్స్‌పై ఆయన తాజాగా స్పందించారు.
![Nanda Kishore: ప్రేక్షకులు అలా అనుకున్నారు, నా జీవితంలో బాధాకరమైన విషయం అదే - సీరియల్ యాక్టర్ నందకిషోర్ Serial Actor Nanda Kishore responds on rumors with Chi La Sow serial co actor Meena Kumari Nanda Kishore: ప్రేక్షకులు అలా అనుకున్నారు, నా జీవితంలో బాధాకరమైన విషయం అదే - సీరియల్ యాక్టర్ నందకిషోర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/15/f740d4810bc47680d8da467ad1b552f21718445356155802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Serial Actor Nanda Kishore: సీరియల్స్‌లో యాక్టివ్‌గా కనిపించకపోయినా.. ప్రేక్షకులు మర్చిపోలేని ఆర్టిస్టులలో నందకిషోర్ ఒకరు. చాలా ఏళ్ల క్రితం టెలికాస్ట్ అయిన ‘చిలసౌ స్రవంతి’ సీరియల్‌ను ఇప్పటికీ చాలామంది బుల్లితెర ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. దానికి హీరోహీరోయిన్‌గా నటించిన నందకిషోర్, మీనా కుమారి నటన కూడా కీలక పాత్ర పోషించింది. అప్పట్లో సీరియల్స్‌లో హీరోహీరోయిన్ కెమిస్ట్రీ వర్కవుట్ అయితే వారిద్దరూ రియల్ లైఫ్ కపుల్ అని ఫిక్స్ అయిపోయారు. తమను కూడా అలాగే అనుకోవడంపై నందకిషోర్ తాజాగా స్పందించారు. అంతే కాకుండా తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు కూడా షేర్ చేసుకున్నారు.
నందకిషోర్ లవ్ స్టోరీ..
‘‘చిలసౌ స్రవంతి సీరియల్ టైమ్‌కు నాకు పెళ్లయిపోయింది. మీనా కుమరికి కూడా పెళ్లయిపోయింది. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు రూమర్స్ అనేవి కామన్. ఇవన్నీ విని నేను నవ్వుకున్నాను, మా ఇంట్లో వాళ్లు ఇంకా నవ్వుకున్నారు. మేమేంటి అని వాళ్లకు తెలుసు కదా. అప్పట్లో అంత రీచ్ లేదు కాబట్టి సీరియల్స్‌లో, షోలో కలిసి చేశారు వీరిద్దరూ కపుల్ ఏమో అనుకున్నారు. తప్పు లేదు’’ అని పాజిటివ్‌గా స్పందించారు నందకిషోర్. ఇక తన ప్రేమ, పెళ్లి గురించి చెప్తూ.. 10వ తరగతిలోనే తన భార్యను చూసి ఇష్టపడ్డానని బయటపెట్టారు. ఇంటర్‌లో తనకు ప్రపోజ్ చేశానని అన్నారు. కానీ అప్పుడే తన భార్య తండ్రి చనిపోవడంతో తన ప్రేమను యాక్సెప్ట్ చేయలేదని, డిగ్రీలో కూడా మూడేళ్లు వెంటపడితే యాక్సెప్ట్ చేసిందని తమ ప్రేమకథ గురించి చెప్పారు.
వెంకటేశ్ హెల్ప్ చేశారు..
‘చిలసౌ స్రవంతి’ తర్వాత పలు సీరియల్స్‌లో నటించినా కూడా ఈ సీరియల్ మాత్రమే తనకు వేరే లెవెల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. అయితే ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉన్నా రెమ్యునరేషన్ విషయంలో తనను ఎవరూ ఎప్పుడూ మోసం చేయలేదని తెలిపారు నందకిషోర్. ఇక తను ఎవరికీ వెన్నుపోటు పొడిచే అవకాశాలు కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పటివరకు తను చేసిన పొరపాట్ల వల్లే ఇబ్బందిపడ్డానని, వేరేవాళ్లు ఎప్పుడూ తనను ఇబ్బంది పెట్టలేదని పాజిటివ్‌గా మాట్లాడారు. ఇక జీవితంలో తన ఇన్‌స్పిరేషన్ గురించి మాట్లాడుతూ.. చాలామంది లాగా తనకు కూడా చిరంజీవి అంటే చిన్నప్పటి నుండి ఇష్టమే అని అన్నారు. పర్సనల్‌గా హీరో వెంకటేశ్ తనకు చాలా హెల్ప్ చేశారని బయటపెట్టారు.
అదే బాధ..
తన జీవితంలో బాధాకరమైన సంఘటన ఏంటి అని అడగగా.. ‘చిలసౌ స్రవంతి’ సీరియల్‌కు నందకిషోర్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది. ఆ అవార్డ్ అందుకుంటున్న సమయంలో తన తండ్రి లేరని తెలిపారు. ఆ సీరియల్ స్టార్ట్ అయ్యి సక్సెస్ అయినప్పుడు తన తండ్రి ఉన్నారని కానీ సీరియల్ రన్ అవుతున్న సమయంలోనే మరణించారని గుర్తుచేసుకున్నారు. ప్రొఫెషన్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాలను కూడా చెప్పుకొచ్చారు నందకిషోర్. కెరీర్ మొదట్లో పదేపదే అవకాశాల కోసం తనను చాలామంది పట్టించుకోలేదని, డిస్టర్బెన్స్ లాగా ఫీల్ అయ్యారని చెప్తూ ఫీల్ అయ్యారు. ప్రస్తుతం నందకిషోర్ కీలక పాత్రలో నటిస్తున్న ‘ఉప్పెన’ అనే సీరియల్ కూడా క్లైమాక్స్‌కు చేరుకుంది.
Also Read: అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబినేషన్ మూవీపై కన్‌ఫ్యూజన్ - ఇంతకీ దీని కథ ఏంటి?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)