అన్వేషించండి

Save The Tigers 3: అక్కడ యముడు, ఇక్కడ ఇంద్రుడు... 'యమదొంగ' ఫార్మాట్‌లో టైగర్స్ 3!

Save The Tigers 3 First Review: జియో హాట్‌స్టార్ ఒరిజినల్ వెబ్ సిరీస్ 'సేవ్ ద టైగర్స్ 3' జూన్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ కథకు, ఎన్టీఆర్ 'యమదొంగ'కు లింక్ ఏమిటో తెలుసా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సేవ్ ది టైగర్స్ 3 జూన్ 19న హాట్‌స్టార్‌లో ప్రసారం.
  • `యమదొంగ` ఫార్మాట్‌లో వెన్నెల కిషోర్ ఇంద్రుడి పాత్ర పోషించారు.
  • భర్తలు ఇంద్రుడిని దూషించగా వారి లోకంలో మార్పులొస్తాయి.
  • ఫాంటసీ, కామెడీ జోడించి సిరీస్ ఆసక్తికరంగా మారింది.

Save The Tigers Season 3 OTT Release Date Streaming Platform: జూన్ 19వ తేదీ నుంచి జియో హాట్‌స్టార్ ఓటీటీలో 'సేవ్ ద టైగర్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ స్పెషాలిటీ ఏమిటంటే... భార్యాభర్తల మధ్య సంబంధాలు, అనుబంధాలను వినోదాత్మకంగా చూపించడం! ఫస్ట్ రెండు సీజన్‌లు సక్సెస్ అయ్యాయి. మూడో సీజన్ కోసం కథను ఎన్ని మలుపులు తిప్పారు? ఎలా ముందుకు తీసుకు వెళ్లారు? అంటే... 'యమదొంగ' ఫార్మాట్‌ను ఫాలో అయ్యారని తెలిసింది.

అక్కడ యముడు... ఇక్కడ ఇంద్రుడు...
టైగర్స్ 3 కంటే ముందు ఎన్టీఆర్ సినిమా!
'సేవ్ ద టైగర్స్ 3' వెబ్ సిరీస్ ట్రైలర్ చూశారా? స్వర్గ లోకపు అధిపతి ఇంద్రుడి పాత్రలో 'వెన్నెల' కిశోర్ నటించారు. సిరీస్ మూడో పార్టులో కథను మలుపు తిప్పేది ఆయనే. 'సేవ్ ద టైగర్స్ 3' చూస్తే... వెన్నెల కిశోర్ పాత్రకు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ - దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిల 'యమదొంగ' సినిమాలోని లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పాత్రకు కొన్ని పోలికలు అయితే తప్పకుండా కనిపిస్తాయి.

'యమదొంగ' కథ గుర్తు ఉందా? ఎన్టీఆర్, అలీ కలిసి రంభ డ్రస్ తీసుకుని వెళ్తే... చెక్ మీద సంతకం చేసే సమయంలో ఎంఎస్ నారాయణ మరణిస్తారు. తనకు రావాల్సిన డబ్బులు రాలేదని, అందుకు కారణం యముడు అని, యముడ్ని పట్టుకుని మద్యం మత్తులో నానా తిట్లు తిడతాడు హీరో. దాంతో అతడి భూలోకం నుంచి యమలోకానికి తీసుకు వెళతారు. ఇక్కడ పాయింట్ ఏమిటి? మానవుడి మీద యముడికి కోపం రావడంతో, ఆ మానవుడి లోకం మారుస్తారు. సేమ్ టు సేమ్ ఈ పాయింట్ పట్టుకున్నారు 'సేవ్ ది టైగర్స్ 3' క్రియేటర్స్.

Also Read: Maa Inti Bangaram First Review - 'మా ఇంటి బంగారం' ఫస్ట్ రివ్యూ: సమంత బ్యాగ్రౌండ్ తెలిసింది... మరి సినిమా ఎలా ఉందంటే?

'Marriages Are Made In Heaven' (పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి) - ఈ లైన్ గుర్తు ఉంది కదా! స్వర్గలోకపు అధిపతి ఎవరు? ఇంద్రుడు. తమ తమ సంసార జీవితాల్లో భార్యలతో కష్టాలు ఎదురైన ముగ్గురు భర్తలు కలిసి బారులో కూర్చుని మందు తాగి, ఆ మద్యం మత్తులో ఇంద్రుడ్ని పట్టుకుని నానా తిట్లు తిడతారు. ఆ తిట్లు భరించలేక గుప్తా (చిత్రగుప్తుడు అనుకోవాలి)ను పిలిచి ఏదో ఒకటి చేయమని ఇంద్రుడు చెబుతాడు. 'యమదొంగ'లో హీరో లోకం మార్చడం కాన్సెప్ట్ తీసుకుని... 'సేవ్ ద టైగర్స్ 3' మేకర్స్ భలే మార్పులు చేశారు.

Also Read: Deewana First Review - 'దీవానా' ఫస్ట్ రివ్యూ: షాక్ ఇచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్... హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?

హీరో లోకం మార్చడం - 'యమదొంగ'లో, 'సేవ్ ద టైగర్స్ 3'లో సేమ్ పాయింట్ ఉంది. కానీ, ఇక్కడ టైగర్స్ 3 సిరీస్ మేకర్స్ తమ క్రియేటివిటీ చూపించారు. లోకం మార్చడంతో పాటు మనుషుల్ని పొలిన మనుషులు ఏడుగురు ఉంటారనే / లోకాలను పోలిన లోకాలు ఏడు ఉంటాయనే కాన్సెప్ట్ నుంచి రెండు లోకాలు తీసుకున్నారు. దాంతో కామెడీతో పాటు సస్పెన్స్ కూడా యాడ్ అయ్యింది. సిరీస్ వినోదాత్మకంగా మారింది. 'సేవ్ ద టైగర్స్ 3' ఫ్రాంచైజీలో మొదటి రెండు సిరీస్‌లను భార్యాభర్తల మధ్య నడిపించిన మహి వి రాఘవ్ అండ్ కో, మూడో సిరీస్ వచ్చేసరికి ఫాంటసీ ఎలిమెంట్స్ యాడ్ చేసి కొత్త రూటులోకి తీసుకు వెళ్లారు.

Also Read: Ram Charan Vs NTR - రామ్ చరణ్ vs ఎన్టీఆర్... 'ఆర్ఆర్ఆర్' తర్వాత బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?

Frequently Asked Questions

'సేవ్ ద టైగర్స్ 3' వెబ్ సిరీస్ ఎప్పుడు విడుదలవుతుంది?

'సేవ్ ద టైగర్స్' సీజన్ 3 జూన్ 19వ తేదీ నుంచి జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

'సేవ్ ద టైగర్స్ 3' కథా నేపథ్యం ఏమిటి?

ఈ సీజన్ 'యమదొంగ' ఫార్మాట్‌ను అనుసరిస్తుంది. భార్యాభర్తల మధ్య సంబంధాలను వినోదాత్మకంగా చూపుతూ, ఫాంటసీ అంశాలను జోడించారు.

'సేవ్ ద టైగర్స్ 3'లో వెన్నెల కిశోర్ పాత్ర ఏమిటి?

ఆయన స్వర్గలోకపు అధిపతి ఇంద్రుడి పాత్రలో నటించారు. కథను మలుపు తిప్పే కీలక పాత్ర ఆయనదే, ఆయన పాత్ర 'యమదొంగ'లోని మోహన్ బాబు పాత్రతో పోలికలు కలిగి ఉంటుంది.

మూడో సీజన్‌లో కొత్తగా చేర్చిన అంశాలు ఏమిటి?

ఈ సీజన్‌లో 'యమదొంగ'లోని 'లోకం మార్చడం' కాన్సెప్ట్‌తో పాటు, మనుషుల్ని పోలిన లోకాలను జోడించారు. ఇది కామెడీతో పాటు సస్పెన్స్‌ను అందిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Comedy Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Horror Thriller Series OTT : హాస్పిటల్ రూమ్ నెంబర్ 7లో ఏముంది? - మరింత భయపెట్టే 'రాతిరి'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
హాస్పిటల్ రూమ్ నెంబర్ 7లో ఏముంది? - మరింత భయపెట్టే 'రాతిరి'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bhogi OTT : ఓటీటీలోకి భోగి - శర్వానంద్ యాక్షన్ మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి భోగి - శర్వానంద్ యాక్షన్ మూవీ ఎందులో చూడొచ్చంటే?
Aadarsha Kutumbam OTT : ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Elections: రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
Komatireddy Financial Help: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
Comedy Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
AP Cabinet Decisions: 36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
రూ.36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
Jagapathi Babu : వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
Sunil Gavaskar Angry:  రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
Embed widget