Saripodhaa Sanivaaram OTT: ఓటీటీలోకి 'సరిపోదా శనివారం వచ్చేది' ఆ రోజే - ఈ నెలలోనే నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ప్రీమియర్?
Saripodhaa Sanivaaram OTT Release Date: బాక్సాఫీస్ బరిలో 100 కోట్ల క్లబ్బులో చేరిన నాని మూడవ సినిమా 'సరిపోదా శనివారం'. అతి త్వరలో డిజిటల్ ప్రీమియర్... అదేనండి ఓటీటీ విడుదలకు రెడీ కానుందని సమాచారం.
నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ 'సరిపోదా శనివారం' బాక్సాఫీస్ బరిలో దుమ్ము దులుపుతోంది. విడుదలైన మూడు వారాలలోపే 100 కోట్ల క్లబ్బులో చేరిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి ఇప్పుడు ఓ అప్డేట్ వచ్చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
సెప్టెంబర్ 26న 'సరిపోదా శనివారం' డిజిటల్ రిలీజ్!
'సరిపోదా శనివారం' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఇంటర్నేషనల్ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ తీసుకుంది. థియేటర్లలో సినిమా విడుదలకు ముందు ఆ విషయం చెప్పారు. పోస్టర్ల మీద తమ ఓటీటీ పార్టనర్ నెట్ ఫ్లిక్స్ అని పేర్కొన్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ నెల 26న ఓటీటీలో 'సరిపోదా శనివారం' విడుదల కానుందని సమాచారం.
సెప్టెంబర్ 26... అంటే ఈ రోజుకు సరిగ్గా 10 రోజులు సమయం ఉంది. అప్పుడు ఓటీటీలో నాని సినిమా సందడికి రంగం సిద్ధం అవుతుంది. ఆగస్టు 29న థియేటర్లలో 'సరిపోదా శనివారం' విడుదల అయింది. నాలుగు వారాలకు ఓటీటీ రిలీజుకు రెడీ అయింది.
Ippudu Saripoyindhi ❤️❤️
— DVV Entertainment (@DVVMovies) September 15, 2024
Won’t say thank you because you all stood like family and made sure it crossed the line with a BANG at the box office 🙏🏻🙏🏻
Finally - Poyaru Motham Poyaru 💥💥#SaripodhaaSanivaaram @NameisNani @iam_SJSuryah @priyankaamohan #VivekAthreya @JXBE pic.twitter.com/ZJx8KG4wpA
100 కోట్ల క్లబ్బులో చేరిన నాని మూడో సినిమా
'సరిపోదా శనివారం'తో బాక్సాఫీస్ దగ్గర నాని అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఆయన ఖాతాలో ముచ్చటగా మూడో 100 కోట్ల సినిమా చేరింది. నాని ఖాతాలో ఫస్ట్ 100 కోట్ల సినిమా 'ఈగ'. అయితే... అందులో ఆయనది అతిథి పాత్ర మాత్రమే. నాని క్యారెక్టర్ మరణించిన తర్వాత ఆ ఆత్మ ఈగలో చేరడంతో సినిమా అంతా ఈగ మీద నడిచింది. ఆ తర్వాత దసరాతో నాని భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ సినిమా కూడా 100 కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పుడు 'సరిపోదా శనివారం'తో మూడో 100 కోట్ల సినిమా అందింది.
Also Read: రోహిణి కమిటీపై చిన్మయి కామెంట్స్... లైంగిక వేధింపులకు పాల్పడిన వైరముత్తులను ఏం చేయలేరంటూ
వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన 'సరిపోదా శనివారం' చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తనయుడు కళ్యాణ్ దాసరితో కలిసి డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేశారు. ఇందులో ప్రియాంకా అరుల్ మోహన్ కథానాయికగా నటించారు. నాని, ప్రియాంక మధ్య సన్నివేశాలకు మంచి పేరు వచ్చింది. అయితే సినిమా విడుదలైన తర్వాత అందరికంటే ఎక్కువ పేరు విలన్ రోల్ చేసిన ఎస్ జె సూర్యకు వచ్చింది. ఇన్స్పెక్టర్ దయా పాత్రలో ఆయన అభినయం అందరి చేత చప్పట్లు కొట్టించింది. విజిల్స్ వేయించింది. ప్రశంసలు అందించింది. జేక్స్ బిజాయ్ నేపథ్య సంగీతం కూడా బావుందని పేరు వచ్చింది.
Also Read: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...