Samantha: ‘సిటాడెల్’ సిరీస్ కోసం రెమ్యునరేషన్ పెంచేసిన సమంత - ఇంతకీ ఎంత ఛార్జ్ చేసిందంటే?
Samantha Remuneration: చేతిలో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ లేకపోయినా రెమ్యునరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదట సమంత. తన అప్‌కమింగ్ సిరీస్ ‘సిటాడెల్ హనీ బన్నీ’ కోసం భారీగా పారితోషికం ఛార్జ్ చేసిందట.
Samantha Remuneration For Citadel Honey Bunny: బ్యాక్ టు బ్యాక్ హిట్లు సాధించి స్టార్‌డమ్ వస్తే చాలు.. ఏ హీరో అయినా, హీరోయిన్ అయినా వారి రెమ్యునరేషన్‌ను పెంచాలనే ఆలోచనలోనే ఉంటారు. అందుకే ఈరోజుల్లో సీనియర్ హీరోల, హీరోయిన్లు సైతం ప్రతీ సినిమాకు రెమ్యునరేషన్ పెంచుకుంటూ వెళ్లిపోతున్నారు. సమంత కూడా అదే రూటును ఫాలో అవుతున్నట్టు సమాచారం. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’తో ఇప్పటికే వెబ్ సిరీస్ వరల్డ్‌లోకి అడుగుపెట్టింది సామ్. ఇప్పుడు అదే దర్శకులతో కలిసి ‘సిటాడెల్ హనీ బన్నీ’ అనే సిరీస్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. ఈ సిరీస్ కోసం సమంత భారీ రెమ్యునరేషన్ ఛార్జ్ చేసిందని రూమర్స్ వినిపిస్తున్నాయి.
వ్యాధితో బాధపడుతున్నప్పుడే..
గత కొన్నాళ్లుగా మయాసైటీస్ అనే వ్యాధితో బాధపడుతోంది సమంత. అందుకే సినిమాలకు కూడా దూరమయ్యింది. ప్రాజెక్ట్స్ కూడా ఓకే చేయడం ఆపేసింది. అలాంటి సమయంలోనే దర్శకులు రాజ్ అండ్ డీకే కలిసి తనకు ‘సిటాడెల్ హనీ బన్నీ’తో అప్రోచ్ అయ్యారు. తనకు బాలీవుడ్‌లో లైఫ్ ఇచ్చిన దర్శకులు కావడంతో, హాలీవుడ్ రేంజ్ కథనం ఉండడంతో ఈ సిరీస్ చేయడానికి ఓకే చెప్పింది సమంత. ఒకవైపు మయాసైటీస్‌కు ట్రీట్మెంట్ తీసుకుంటూనే.. ఈ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంది. అయితే ఇంత కష్టపడి ఈ సిరీస్ చేయడానికి ఒప్పుకుంది కాబట్టి రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్‌లో డిమాండ్ చేసిందట సామ్.
అత్యధిక రెమ్యునరేషన్..
‘సిటాడెల్ హనీ బన్నీ’ కోసం రూ.10 కోట్లు రెమ్యునరేషన్‌గా అందుకుందట సమంత. తన కెరీర్‌లో ఇదే ఎక్కువ పారితోషికం అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సమంత చేతిలో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ లేకపోయినా తనకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అందుకే తను ఎంత రెమ్యునరేషన్ అడిగినా ఇవ్వడానికి నిర్మాతలు సైతం రెడీ అవుతున్నారు. ఇటీవల ‘సిటాడెల్ హనీ బన్నీ’కి సంబంధించిన టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో హీరో వరుణ్ ధావన్‌తో కలిసి సమంత కూడా పలు భారీ యాక్షన్ సీన్స్‌లో పాల్గొన్నట్టు స్పష్టమవుతోంది. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వరుణ్‌తో కలిసి సందడి చేసింది సామ్.
చాలా మంచివాడు..
వరుణ్ ధావన్ గురించి సమంత మాట్లాడుతూ.. ‘‘తను లేచినప్పటి నుంచి ఎలా ఇంప్రూవ్ అవ్వాలనే ఆలోచిస్తూ ఉంటాడు. ప్రతీ సీన్ బెటర్‌గా ఎలా చేయాలనే కష్టపడుతూ ఉంటాడు. తను వర్క్ విషయంలో చాలా డెడికేషన్‌తో ఉండడంతో పాటు నేను కలిసి మంచి మనసున్న మనుషుల్లో తను కూడా ఒకరు. తన కామెడీ సెన్స్, పాజిటివ్ మనస్తత్వం సెట్‌లో అందరినీ హ్యాపీ చేస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. తనతో ఉంటే అసలు బాధపడే రోజు ఉండదు’’ అని చెప్పుకొచ్చింది. నవంబర్ 7న ఈ సిరీస్.. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలకు సిద్ధమయ్యింది. ‘సిటాడెల్ హనీ బన్నీ’తో పాటు మరో చిత్రంలో కూడా లీడ్ రోల్ చేస్తోంది సమంత.
Also Read: అందుకే టాప్ లేకుండా నటించాల్సి వచ్చింది, అందుకే చాలా బాధపడ్డా: నటి అను అగర్వాల్