Sai Pallavi: అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఫస్ట్ మూవీపై స్పందించిన సాయి పల్లవి
Sai Pallavi: బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ డైరెక్టర్ గా ఓటీటీలో రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఆసినిమాపై సాయిపల్లవి ప్రశంసలు కురిపించింది.
Sai Pallavi Congrajulated Junaid Khan For Maharaj Movie Release: బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ డెబ్యూ సినిమా 'మహరాజ్'. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటీకీ రిలీజ్ అవ్వలేదు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. 'మహారాజ' చూసిన వాళ్లంతా జునైద్ ఖాన్ పై, అతని యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇప్పుడు హీరోయిన్ సాయి పల్లవి కూడా తన హీరోపై ప్రశంసల జల్లు కురిపించింది. మహారాజ గురించి ఆమె తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈసందర్భంగా జునాయిద్ కి కంగ్రాట్స్ చెప్పింది సాయి పల్లవి.
జునైద్ కంగ్రాట్స్..
సాయిపల్లవి పెట్టిన ఇన్ స్టా స్టోరీ వైరల్ అవుతుంది. "జునైద్ ఖాన్ నీ ఫస్ట్ ఫిలిమ్ రిలీజ్ అయినందుకు కంగ్రాట్స్. జై దీప్ హాల్వత్, షాలినీ పాండే, షర్వరీ లవ్ యూ ఆల్" అంటూ ఆమె పోస్ట్ పెట్టారు. మహారాజలో జునైద్ ఖాన్ పోస్టర్ ను ఆమె షేర్ చేశారు. ‘మహారాజ’ సినిమాకి సిదార్థ మల్హోత్ర డైరెక్ట్ చేయగా.. ఆదిత్య చోప్రా ప్రొడక్షన్ లో తెరకెక్కింది. ఇక ఈ సినిమాని డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
జునైద్ ఖాన్ సరసన బాలీవుడ్ ఎంట్రీ..
తెలుగు, తమిళ్, మలయాళంలో ఎన్నో హిట్ సినిమాలు తీసిన సాయిపల్లవి ఇక ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక అది కూడా జునైద్ ఖాన్ సరసన నటిస్తున్నారు ఆమె. ఈ మధ్యే దాదాపు 60 రోజుల పాటు మంచి లొకేషన్స్ లో ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ నిర్వహించారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా వస్తోంది ఈ సినిమా. అయితే, ఇప్పటి వరకు టైటిల్ మాత్రం ఖరారు కాలేదు. మంచి మంచి లొకేషన్స్ లో, ఇప్పటి వరకు ఏ సినిమాలో చూపించని అద్భుతమైన లొకేషన్స్ లో ఈ సినిమాని తెరకెక్కించినట్లు బాలీవుడ్ లో టాక్. ‘మహారాజ’ రిలీజ్ కోసం సాయిపల్లవి, జునైద్ ఖాన్ సినిమా షూటింగ్ కి గ్యాప్ వచ్చిందని, ఇప్పుడిక తర్వాత మళ్లీ ఈ షూట్ స్టార్ట్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
రామాయణంలో బజీగా..
ప్రస్తుతం సాయి పల్లవి 'రామాయణ' ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. అమీర్ ఖాన్ రాముడు కాగా.. సాయిపల్లవి సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. 2027లో సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం. దీన్ని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. ఇక జునైద్ ఖాన్ విషయానికొస్తే.. ఆయన సినిమా రిలీజ్ కాకముందే ఆఫర్లు వరుస పెట్టాయట. సాయిపల్లవితో సినిమా చేస్తుండగా.. ఖుషీ కపూర్ తో కూడా ఒక సినిమా ఫైనల్ అయ్యిందట. తమిళంలో సూపర్ డూపర్ హిట్‌ను సాధించిన ‘లవ్ టుడే’ యూత్‌ఫుల్ మూవీని హిందీలో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు అమీర్ ఖాన్. దాంట్లో తన కొడుకుని హీరోగా అనుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: మేకప్‌తో కస్టడీకి.. నవ్వుతూ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన పవిత్ర గౌడ - లేడీ ఎస్సైకు నోటీసులు