Kantara Chapter 1 OTT Deal: రిషబ్ శెట్టి 'కాంతార చాప్టర్ 1' బిగ్ ఓటీటీ డీల్ - బడ్జెట్‌లో ఎంత రికవరీ చేసిందంటే?
Kantara Chapter 1 OTT Platform: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి లేటెస్ట్ 'కాంతార చాప్టర్ 1' రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. భారీ ధరకు ఓటీటీ డీల్ కుదిరినట్లు సమాచారం.

Rishab Shetty Kantara Chapter 1 OTT Deal Locked: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి అవెయిటెడ్ డివోషనల్ పీరియాడిక్ డ్రామా 'కాంతార చాప్టర్ 1'. 2022లో చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన 'కాంతార'కు ప్రీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతుండగా... రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బిజినెస్ డీల్ జరగ్గా... డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కూడా భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఓటీటీ డీల్ ఎంతో తెలుసా?
ఈ మూవీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.125 కోట్ల మేర డీల్ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, ఇది కేవలం సౌత్ లాంగ్వేజెస్ వరకేనా లేక హిందీ భాషకు కూడా కలిపేనా అనేది తెలియాల్సి ఉంది. అటు, తెలుగు రాష్ట్రాల్లోనూ థియేట్రికల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దాదాపు రూ.100 కోట్లకు ఫిక్స్ అయినట్లు తెలుస్తుండగా... ఇది టాలీవుడ్ టాప్ హీరోల పెద్ద చిత్రాల బడ్జెట్‌కు సమానం. నైజాంలో రూ.40 కోట్లు, కోస్తాంధ్రలో రూ.45 కోట్లు, సీడెడ్‌లో రూ.15 కోట్లకు డీల్ కుదిరినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక మూవీ బడ్జెట్ విషయానికొస్తే ఫస్ట్ పార్ట్ కంటే 5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
చిన్న సినిమాగా వచ్చిన 'కాంతార' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. తొలుత కన్నడ భాషలోనే రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ రావడంతో మిగిలిన భాషల్లోనూ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు ప్రీక్వెల్ అంతకు మించి ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
రిలీజ్ ఎప్పుడంటే?
రిషబ్ సెట్టి హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ అక్టోబర్ 2న కన్నడతో పాటు తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషలతో పాటు బెంగాళీ, ఇంగ్లీష్‌లోనూ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రమోషన్స్ కూడా టీం భారీగానే ప్లాన్ చేస్తోంది. 'కాంతార' మూవీ ఎక్కడ ఎండ్ అయ్యిందో దానికి ముందు జరిగిన సంఘటనలు, పుంజుర్లి దేవునికి సంబంధించి పూర్తి వివరాలు కీలక సన్నివేశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. మన ఊరు, మన సంప్రదాయాలు, మన జనం, మన మట్టి కథను చూపిస్తూనే భారీ యాక్షన్ సీక్వెన్స్, కత్తి యుద్ధాలు కూడా చూపించనున్నట్లు ప్రమోషనల్ వీడియోల బట్టి తెలుస్తోంది.
రిషబ్ సరసన 'సప్త సాగరాలు దాటి' ఫేం రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా కనకవతి పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్‌గా ఫస్ట్ లుక్ రివీల్ చేయగా ఆకట్టుకుంటోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ ప్రొడ్యూస్ చేస్తుండగా... అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ ఫ్రాంచైజీలో మూడో పార్ట్ కూడా రానుందని... అందులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.





















