Rambo In Love Web Series OTT Release Date: రొమాంటిక్ కామెడీ 'ర్యాంబో ఇన్ లవ్'... కోర్డ్ డ్రామా 'ది ట్రయల్' సీజన్ 2 - ఒకే ఓటీటీలో రెండు వెబ్ సిరీస్‌లు
Rambo In Love Series OTT Platform: ఒకే ఓటీటీలో 2 వెబ్ సిరీస్‌లు సందడి చేయబోతున్నాయి. ర్యాంబో ఇన్ లవ్, లీగల్ డ్రామా 'ది ట్రయల్' త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

Rambo In Love The Trial Season 2 Web Series OTT Release Date: యూత్, మాస్ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేలా ఒకే ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యేందుకు రెండు వెబ్ సిరీస్‌లు రెడీ అవుతున్నాయి. ఒకటి రొమాంటిక్ కామెడీ జానర్ కాగా... మరొకటి కోర్టు రూమ్ లీగల్ డ్రామా. ఈ రెండు సిరీస్‌ల స్ట్రీమింగ్ డేట్స్‌ను తాజాగా అనౌన్స్ చేశారు మేకర్స్.
రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్
అభినవ్ మణికంఠ, పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ 'ర్యాంబో ఇన్ లవ్'. ఈ సిరీస్‌కు అజిత్ రెడ్డి దర్శకత్వం వహించగా... కావ్య అచ్చు, నందు భార్గవ్, పవన్, అప్పాజీ అంబరీష, కేశవ్ దీపక్ కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్ సెప్టెంబర్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ కానుంది.
'అతను వెంబడిస్తాడు. ఆమె తప్పించుకుంటుంది. ఆమె కొడుతుంది. అతను తప్పించుకుంటాడు. ఇది లవ్, వార్... ర్యాంబో వర్సెస్ సుకన్య' అంటూ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. తన ఆఫీస్‌లో మాజీ లవర్ సుకన్యతో కలిసి వర్క్ చేయాల్సిన పరిస్థితి వస్తే... రాంబాబు అనే యువకుడు ఏం చేశాడనేదే ప్రధానాంశంగా ఈ సిరీస్ రూపొందించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్, వీడియో ఆకట్టుకుంటున్నాయి.
View this post on Instagram
లీగల్ డ్రామా... 'ది ట్రయల్' సీజన్ 2
రెండేళ్ల క్రితం రిలీజై ఆడియన్స్‌ను అలరించిన వెబ్ సిరీస్ 'ది ట్రయల్'. అమెరికన్ సిరీస్ 'గుడ్ వైఫ్' ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ కొత్త సీజన్ ఓటీటీలోకి రాబోతోంది. 'ది ట్రయల్' సీజన్ 2 సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌కు ఉమేష్ బిస్త్ దర్శకత్వం వహించగా... జిషు షేన్ గుప్తా కీలక పాత్ర పోషించారు.
Also Read: ఇట్ ఈజ్ వెరీ సీరియస్... నేను బతికే ఉన్నానండీ బాబూ - ఫేక్ న్యూస్‌పై 'ఇంద్ర' మూవీ విలన్ ఫైర్
సీజన్ 1 స్టోరీ ఏంటంటే?
అవినీతి, లైంగిక ఆరోపణలతో జైలు పాలైన తన భర్తను కాపాడుకునేందుకు ఓ మహిళా న్యాయవాది ఏం చేశారనేదే ప్రధానాంశంగా 'ది ట్రయల్' సిరీస్ రూపొందించారు. రాజీవ్ సేన్ గుప్త (జిషు సేన్ గుప్త) హైకోర్టులో అడిషనల్ జడ్జిగా పని చేస్తుంటాడు. ఓ సమయంలో అవినీతి, లైంగిక ఆరోపణలతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. తన భర్త జైలుకెళ్లడంతో కుటుంబ బాధ్యతను నొయోనిక సేన్ గుప్త (కాజోల్) తీసుకుంటుంది.
పెళ్లికి ముందు లాయర్‌గా పని చేసిన నొయోనిక తన భర్తను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. తన స్నేహితులు విశాల్ (అలీఖాన్) సాయంతో మళ్లీ విధుల్లో చేరుతుంది. అసలు రాజీవ్ నిజంగానే తప్పు చేశారా? కేసు వాదనలో ఆమె తెలుసుకున్న నిజాలేంటి? ఎవరైనా అతన్ని కావాలని ఇరికించారా? తన భర్తను నియోనిక బయటకు తీసుకు రాగలిగిందా? అనేది ఫస్ట్ సీజన్‌లో చూపించగా... ఇప్పుడు సెకండ్ సీజన్‌లో దాని తర్వాత జరిగిన పరిణామాలను చూపించనున్నారు.





















