Rama Ayodya OTT Release: ఆహా... శ్రీరామనవమికి 'రామ అయోధ్య' - హనుమాన్ సంగీత దర్శకుడి సపోర్ట్
Rama Ayodya Documentary: శ్రీరామనవమి సందర్భంగా ఆ రోజు ఆహా ఓటీటీలో భార్గవ పిక్చర్స్ సంస్థ రూపొందించిన 'రామ అయోధ్య' డాక్యుమెంటరీ ఫిల్మ్ రిలీజ్ కానుంది.
శ్రీరామనవమి (Sri Rama Navami 2024) ఈ ఏడాది భారతీయులు అందరికీ ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. హిందువులు ఎన్నో ఏళ్లుగా కంటున్న కల శ్రీ రాముని జన్మభూమి అయోధ్యలో బలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇప్పుడు ఆ అయోధ్య విశేషాలను సామాన్యులకు సైతం అర్థం అయ్యేలా వివరిస్తూ ఓ డాక్యుమెంటరీ తెరకెక్కింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
శ్రీరామనవమికి 'రామ అయోధ్య' విడుదల
Rama Ayodhya Documentary Digital Streaming Date: మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముని పదహారు సద్గుణాలపై తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్ 'రామ అయోధ్య'. ఈ ప్రాజెక్ట్ చిత్రీకరణ అంతా అయోధ్యలో జరిగింది. దీనికి నేషనల్ ఫిల్మ్ అవార్డ్ గ్రహీత సత్య కాశీ భార్గవ కథ, కథనం అందించగా... కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ శ్రీరామ నవమి సందర్భంగా... ఏప్రిల్ 17వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ఈ 'రామ అయోధ్య' స్ట్రీమింగ్ కానుంది.
'బాల' సుందరం, శ్రీ'రామ' మందిరం!🏹
— ahavideoin (@ahavideoIN) April 12, 2024
ఈ శ్రీరామనవమికి, అయోధ్య రామయ్య మీ ఇంటికి..🙏
@SatyakashiB @kbaravi @krishnaSRam pic.twitter.com/UPjNgiTvku
'రామ అయోధ్య'కు హనుమాన్ సంగీత దర్శకుడి అండ
శ్రీరాముడు అంటే హనుమంతునికి ప్రాణం అని ప్రత్యేకంగా చెప్పాలా? ఇప్పుడు ఆ 'హనుమాన్' సంగీత దర్శకుడు హరి గౌర, ఈ 'రామ అయోధ్య' డాక్యుమెంటరీకి తన వంతు మద్దతు అందిస్తున్నారు. 'రామ అయోధ్య' రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేయడంతో పాటు, డాక్యుమెంటరీ చూసి తన ఆలోచనలు, అభిప్రాయాలను దర్శక రచయితలతో పంచుకున్నారు.
Also Read: ఆ ఒక్కటీ అడక్కు రిలీజ్ డేట్ ఫిక్స్ - నరేష్ కొత్త సినిమా థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?
Sensational music director of #HanuMan movie and more, @GowrahariK garu, shares insights on Sri Rama and encourages watching the #RamaAyodhya documentary Film premiering on @ahavideoIN on 17th 🙏 @SatyakashiB @KrishnaSRam #HariGowra #HanumanMovie #MusicDirector #SJMediaspot pic.twitter.com/TusqOqlNZz
— Jagadeeshpatel (@Jagadeeshtrsv) April 14, 2024
ఈ వారం 'రామ అయోధ్య' ఓటీటీ విడుదల సందర్భంగా రచయిత సత్య కాశీ భార్గవ మాట్లాడుతూ... ''మా 'రామ అయోధ్య'లో శ్రీరాముని ముఖ్య గుణములను చెబుతూ... అయోధ్యలో స్థల పురాణం, అక్కడి ముఖ్యమైన ప్రదేశాలు చూపిస్తూ, వాటి విశేషాలు వివరించం. తెలుగు వారందరికీ తప్పకుండా 'రామ అయోధ్య' నచ్చుతుందని ఆశిస్తున్నా'' అని అన్నారు.
'రామ అయోధ్య'కు దర్శకత్వం వహించిన కృష్ణ మాట్లాడుతూ... ''అయోధ్య అంటే కేవలం రామ మందిరం మాత్రమే కాదు... అక్కడ ఇంకా అనేక పవిత్ర ప్రదేశాలు, మందిరాలు ఉన్నాయి. వాటన్నిటినీ మేం చాలా బాగా చూపించాం. అంతే కాదు... శ్రీరాముని గుణాలను ప్రస్తుత కాలంలో మనం ఎలా ఆచరించవచ్చో అందరికీ అర్థం అయ్యేలా సాధారణ భాషలో చెబుతూ డాక్యుమెంటరీ తెరకెక్కించాం'' అని చెప్పారు.
'రామ అయోధ్య' డాక్యుమెంటరీకి నిర్మాణ సంస్థలు: భార్గవ పిక్చర్స్ - దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్, నిర్మాతలు: సత్య కాశీ భార్గవ - భారవి కొడవంటి, సంగీతం: వందన మజాన్, ఛాయాగ్రహణం: శైలేంద్ర, కూర్పు: యాదగిరి - వికాస్, రచన: సత్య కాశీ భార్గవ, దర్శకత్వం: కృష్ణ ఎస్ రామ.