By: ABP Desam | Updated at : 02 Sep 2023 12:31 PM (IST)
‘పాపం పసివాడు’ వెబ్ సిరీస్(Photo Credit: ahavideoin/instagram)
సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’. పలు షోలతో పాటు సిరీస్ లు, సినిమాలను నిర్మిస్తోంది. ఇప్పటికే ‘అన్ స్టాపబుల్ ’ పేరిట బాలయ్య షో బాగా పాపులర్ అయ్యింది. ఎలాంటి నెగెటివ్ ప్రభావం లేకుండా సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. చక్కటి కామెడీ, ఎమోషనల్ తో కూడిన కంటెంట్ తో వ్యూవర్స్ ను అకట్టుకుంటోంది. వారం వారం ‘ఏజెంట్’ వెబ్ సిరీస్ ఒక్కో ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేస్తున్న ‘ఆహా’, మరో వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అయ్యింది.
గత ఏడాది ‘పాపం పసివాడు’ పేరుతో ఓ సిరీస్ ను రూపొందిస్తున్నట్లు ‘ఆహా’ ప్రకటించింది. అప్పటి నుంచే ఈ సిరీస్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్, నటుడు, ఇండియన్ ఐడల్ 5 విన్నర్ శ్రీరామ చంద్ర ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయనతో పాటు రాశీ సింగ్, గాయత్రి చాగంటి, శ్రీ విద్యా మహర్షి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫుల్ ఫన్ తో ముందుకు సాగే ఈ సిరీస్ సెప్టెంబర్ 29న ‘ఆహా’ ఓటీటీలోకి రాబోతోంది. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన టీజర్ విడుదల అయ్యింది. ఫుల్ ఫన్ తో ఆకట్టుకుంటోంది. కంప్లీట్ కన్ఫ్యూజన్ తో క్రాంతి అనే క్యారెక్టర్ శ్రీరామచంద్ర చేస్తున్నాడు. ప్రతి విషయంలోనూ కన్ఫ్యూజ్ అవుతూ ఫన్ ను జెనరేట్ చేస్తున్నాడు. ఇతడు ఓ అమ్మాయిని ఇష్టపడటం, మరో అమ్మాయి ఇతడిని ఇష్టపడటం, ఇద్దరి కాదని ఇంకో అమ్మాయి వచ్చిన చచ్చినా నేనే నచ్చాని చెప్పాలంటూ గన్ తో బెదిరించడం ఆకట్టుకంటున్నాయి.
‘పాపం పసివాడు’ సిరీస్ కు లలిత్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కైషోర్ కృష్ణ సహ దర్శకుడిగా కొనసాగుతున్నారు. గౌకుల్ భారతి సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. గ్యారీ బిహెచ్ ఈ సిరీస్ కు ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విజయ్ మక్కెన ఆర్ట్ డైరెక్టర్ కాగా, జోస్ జిమ్మీ సంగీతాన్ని సమకూర్చారు. అటు ‘ఆహా’లో గత కొంతకాలంగా చిన్న సినిమాలతో పాటు షోలు వెబ్ సిరీస్ లు ఆకట్టుకుంటున్నాయి. రోజు రోజుకు ‘ఆహా’ ఆహా అనేలా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. సబ్ స్క్రైబర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ‘ఆహా’ టీమ్ కొత్త కంటెంట్ కు శ్రీకారం చుడుతోంది. మరింతగా ప్రేక్షకులలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ప్రేక్షకులకు మంచి ఎంటర్ టైన్మెంట్ ను అందించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే సరికొత్తగా ‘పాపం పసివాడు’ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. మంచి కామెడీతో ఈ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని ‘ఆహా’ భావిస్తోంది. ఈ సిరీస్ తో మరింతగా సబ్ స్క్రైబర్స్ ను పెంచుకునేందుక ప్రయత్నిస్తోంది.
Read Also: ఫ్యాన్సీ అమౌంట్, సూపర్ లగ్జరీ కారు- ‘జైలర్‘ దర్శకుడికి నిర్మాత అదిరిపోయే బహుమతి
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Miss Shetty Mr Polishetty OTT : ఈ వారమే ఓటీటీలో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' - నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ ఎప్పుడంటే?
The Great Indian Suicide : ఆహాలో 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' - హెబ్బా పటేల్ సినిమా ఎక్స్‌క్లూజివ్ రిలీజ్!
Upcoming OTT Movies: ఈవారం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి, ఓటీటీలో ఏకంగా 35కు పైగా చిత్రాల విడుదల
RDX OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ - తెలుగులో ఎప్పుడంటే?
DD Returns: తెలుగులో సంతానం తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ - ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందంటే?
బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా
Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?
MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్
/body>