అన్వేషించండి

Panchayat 3 Trailer: ‘పంచాయత్ 3’ ట్రైలర్ విడుదల - పంచాయతీ సెక్రటరీగా తిరిగొచ్చిన జితేంద్ర కుమార్

Panchayat 3 Trailer: ఇప్పటికే రెండు సీజన్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకొని ఆడియన్స్‌ను ఎంతగానో అలరించింది ‘పంచాయత్’. ఇప్పుడు ఇదే సిరీస్ నుండి మూడో సీజన్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.

Panchayat Season 3 Trailer Is Out Now: గత కొంతకాలంగా హిందీ వెబ్ సిరీస్‌లు ఓటీటీ వరల్డ్‌లో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే దాదాపుగా విడుదలయిన ప్రతీ హిందీ వెబ్ సిరీస్... ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అలాంటి సిరీస్‌లో ‘పంచాయత్’ కూడా ఒకటి. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఓటీటీ ప్రేక్షకులను అలరించింది. అందుకే ఈసారి ఎక్కువగా గ్యాప్ తీసుకోకుండా మూడో సీజన్‌ను విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. దాంతో పాటు ‘పంచాయత్ 3’ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ కూడా విడుదల చేశారు. ఆ ట్రైలర్ చూస్తే సీజన్ 3 అంతకు మించి ఉండబోతుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.

ట్రాన్స్‌ఫర్ క్యాన్సల్...

అభిషేక్ త్రిపాఠి (జితేంద్ర కుమార్) గ్రామ పంచాయతీ సెక్రటరీగా ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ అందుకోవడంతో ‘పంచాయత్ 2’ ముగుస్తుంది. ఇక సీజన్ 2 ఎక్కడ ముగిసిందో సీజన్ 3 అక్కడే ప్రారంభమవుతుందని ట్రైలర్‌లోనే స్పష్టం చేశారు మేకర్స్. అభిషేక్ త్రిపాఠి స్థానంలోకి వచ్చిన కొత్త సెక్రటరీ ఎంట్రీతో ‘పంచాయత్ 3’ ట్రైలర్ మొదలవుతుంది. కానీ ఆ సెక్రటరీని ఫులేరా ఊరి ప్రజలు ఎవరూ పట్టించుకోరు. దీంతో అభిషేక్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ క్యాన్సల్ అయ్యి మళ్లీ ముందు ఉన్న స్థానంలోకి రావాలని ఆర్డర్ వస్తుంది. వేరే దారి లేక తనకు ఇష్టం లేకపోయినా మళ్లీ అదే ఊరికి పంచాయతీ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరిస్తాడు అభిషేక్. కానీ ఈసారి అనవసరమైన గొడవల్లో జోక్యం చేసుకోనని ముందే నిర్ణయించుకుంటాడు.

గ్రామంలో తిరుగుబాటు..

అప్పుడే ప్రధాన మంత్రి గరీబ్ అవాస్ యోజన స్కీమ్‌ను పొందడానికి ఫులేరా గ్రామంలో ఎవరు అర్హులో పంచాయతీ సెక్రటరీగా బయటపెడతాడు అభిషేక్. అందులో అర్హులు కాని కొందరు గ్రామ ప్రజలు తిరుగుబాటు మొదలుపెడతారు. రాజకీయ నాయకులు తమను పట్టించుకోవడం లేదని, ఈసారి ఎన్నికల్లో తాము కూడా నిలబడతామని నిర్ణయించుకుంటారు. అలా కథ మళ్లీ మొదటికి వస్తుంది. ‘పంచాయత్ 3’ ట్రైలర్ చూస్తుంటే ముందు రెండు సీజన్స్‌లోని ఒరిజినాలిటీని ఏ మాత్రం పక్కన పెట్టకుండా సీజన్ 3ను కూడా తెరకెక్కించారని అర్థమవుతుంది. ముందు విడుదలయిన 2 సీజన్స్‌లాగానే 3వ సీజన్‌ను కూడా దీపక్ కుమార్ మిష్రానే డైరెక్ట్ చేశారు.

జితేంద్ర కుమార్ నటనే హైలెట్..

జితేంద్ర కుమార్ లేకపోతే ‘పంచాయత్’ వెబ్ సిరీస్ లేదు అని చాలామంది ప్రేక్షకులు ప్రశంసించారు. తాజాగా విడుదలయిన సీజన్ 3 ట్రైలర్ చూసిన తర్వాత మరోసారి ఆ విషయం స్పష్టమవుతోంది. ఇందులో మరోసారి తనకు ఇష్టం లేని పంచాయతీ సెక్రటరీ పాత్రలో జితేంద్ర కుమార్ అద్భుతంగా నటించాడని అర్థమవుతోంది. ఇక ‘పంచాయత్ 3’లో జితేంద్ర కుమార్‌తో పాటు నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్‌గా తెరకెక్కిన ‘పంచాయత్ 3’.. మే 28న ప్రైమ్ సబ్‌స్క్రైబర్ల ముందుకు రానుంది. తాజాగా విడుదలయిన ఈ సీజన్ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో తెగ లైకులు వచ్చేస్తున్నాయి.

Also Read: నా వ్యక్తిత్వాన్ని రక్షించండి, కోర్టును ఆశ్రయించిన జాకీ ష్రాఫ్‌ - ఆ సంస్థలకు హైకోర్టు నోటీసులు

టాప్ హెడ్ లైన్స్

Jagamae Sangeetham OTT: ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Aakali Rajyam OTT : మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Srinivasa Mangapuram OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget