Paanch Minar OTT : వారానికే ఓటీటీలోకి రాజ్ తరుణ్ క్రైమ్ థ్రిల్లర్ 'పాంచ్ మినార్' - సడన్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చేసిన మూవీ
Paanch Minar OTT Platform : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'పాంచ్ మినార్' ఓటీటీలోకి వచ్చేసింది. రిలీజ్ అయిన వారం రోజులకే స్ట్రీమింగ్ అవుతూ షాకిచ్చింది.

Raj Tarun's Paanch Minar OTT Streaming : సాధారణంగా ఏ మూవీ అయినా థియేటర్లలో రిలీజ్ అయిన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. కొన్ని మూవీస్ కనీసం నెల రోజుల్లోపే ఓటీటీలో అందుబాటులోకి వచ్చేస్తుంటాయి. కానీ, రిలీజ్ అయిన వారం రోజులకే ఓ మూవీ ఓటీటీలోకి వచ్చి సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. అదే టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'పాంచ్ మినార్'.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
రాజ్ తరుణ్ హీరోగా రామ్ కుడుముల దర్శకత్వం వహించిన 'పాంచ్ మినార్' ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే, రిలీజ్ అయిన వారం రోజులకే ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో రాశీ సింగ్ హీరోయిన్‌గా నటించగా... బ్రహ్మాజీ, అజయ్ ఘోష్, సుదర్శన్, నితిన్ ప్రసన్న కీలక పాత్రలు పోషించారు. గోవింద రాజు సమర్పణలో మాధవి, ఎంఎస్ఎం రెడ్డి నిర్మించారు.
Also Read : యుద్ధానికి 'వానర' సైన్యం సిద్ధం - వార్ ఎవరి కోసం?... సరికొత్తగా మైథలాజికల్ రూరల్ డ్రామా టీజర్
స్టోరీ ఏంటంటే?
కృష్ణ చైతన్య (రాజ్ తరుణ్) సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే, ఎంత ప్రయత్నించినా అతనికి ఉద్యోగం రాదు. అతని గర్ల్ ఫ్రెండ్ (రాశీ సింగ్) సైతం కృష్ణ జాబ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అతను జాబ్‌లో చేరితే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలని భావిస్తుంది. ఈజీగా మనీ సంపాదించాలనే ఉద్దేశంతో ఉండే కృష్ణ ఓ స్కామ్‌లో మోసపోతాడు. దాన్ని కప్పి పుచ్చుకునేందుకు తన గర్ల్ ఫ్రెండ్ కంపెనీలోనే తనకు ఉద్యోగం వచ్చిందని ఇంట్లో చెప్పి తన స్నేహితుడి కంపెనీలోనే క్యాబ్ డ్రైవర్‌గా చేరతాడు.
ఓ రోజు కిట్టు క్యాబ్ ఎక్కిన ఇద్దరు హంతకులు అతడి ముందే ఓ మర్డర్ చేస్తారు. వారి ముందు చెవిటోడిలా నటించిన కృష్ణ అప్పుడు ఏం చేశాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అసలు కిట్టు చిక్కుకున్న స్కామ్ ఏంటి? హైదరాబాద్‌లో రౌడీ షీటర్‌కు కిట్టుకు సంబంధం ఏంటి? కృష్ణ ఇంట్లో నిజం తెలిసిందా? వీటన్నిటి నుంచి బయటపడి తన లవ్ సక్సెస్ చేసుకోగలిగాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















