Merry Christmas OTT Release: ఓటీటీలోకి విజయసేతుపతి 'మెర్రీ క్రిస్మస్' ఎప్పుడు? స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Merry Christmas OTT Release: విజయసేతుపతి, కత్రినా కైఫ్ నటించిన 'మెర్రీ క్రిస్మస్' ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? స్ట్రీమింగ్ ఎక్కడ అవ్వనుంది?
Vijay Sethupathi & Katrina Kaif’s Merry Christmas OTT Release: విజయ్ సేతుపతి, బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ నటించిన సినిమా ‘మెర్రీ క్రిస్మస్’. ఈ సినిమాని హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కించారు. తెలుగులో డబ్ చేశారు ఈ సినిమాని. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. సినిమా బాగుందనే టాక్ కూడా బాగా వినిపించింది. అయితే, థియేటర్ లో మాత్రం టికెట్లు తెగలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ‘మెర్రీ క్రిస్మస్’. అయితే, ఇప్పుడిక ఈ సినిమాకి సంబంధించి ఓటీటీ రిలీజ్ అప్ డేట్ వచ్చేసింది.
మార్చి 8న వచ్చేస్తోంది
‘మెర్రీ క్రిస్మస్’ సినిమా జనవరి 12న థియేటర్లలో సందడి చేసింది. అయితే, సరిగ్గా ఎనిమిది వారాల తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దీనికి సంబంధించి రైట్స్ కొన్నట్లుగా సమాచారం. అయితే, దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బాలీవుడ్ సౌత్ ఇండియన్ సినిమా..
'జవాన్' సినిమాలో విలన్ గా నటించి బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు విజయ్ సేతుపతి, ఇక ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన బాలీవుడ్ సౌత్ ఇండియా సినిమా ఇది. ఎందుకంటే.. ఈ చిత్రాన్ని హిందీ, తమిళంలో తెరకెక్కించారు. ‘బద్లాపూర్’, ‘అంధాధున్’ లాంటి అవార్డు విన్నింగ్ థ్రిల్లర్ సినిమాలు తీసిన డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాకు తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో హిందీ వెర్షన్‌లో సంజయ్ కపూర్, వినయ్ పట్నాయక్, ప్రతిమ కన్న, టిన్ను ఆనంద్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి తనదైన శైలిలో నటించారు. కత్రినా కైఫ్ కూడా యాక్షన్ సన్నివేశాల్లో నటించి అభిమానులను అలరించారు. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్‌ల కెమిస్ట్రీ కూడా సినిమాలో బాగా పండింది.
తమిళ వెర్షన్ విషయానికి వస్తే.. రాధిక శరత్ కుమార్, షణ్ముగరాజా, కెవిన్ జై బాబు, రాజేశ్ విలియమ్స్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకి ప్రీతం మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించగా.. రమేశ్ తరుణ్ టిప్స్ ఇండస్ట్రీస్, మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించాయి.
తెలుగులో ఎవ్వరికీ తెలియని సినిమా..
హిందీ, తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. మూడు భాషల్లో ఒకేసారి రిలీజ్ అయినప్పటికీ తెలుగు ప్రజల్లో చాలామందికి ఈ సినిమా ఉందనే విషయం కూడా తెలీదు. సంక్రాంతి టైంలో రిలీజ్ చేయడంతో.. టాలీవుడ్ సినిమాల హడావుడి, వివాదాల్లో ఈ సినిమా కొట్టుకుపోయిందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో తెలుగులో అసలు దీనికి ఓపెనింగ్స్ లేవని అంటున్నారు.
Also Read: జీవితంలో చాలా చూశాను, ఇప్పుడు నాకు ఇష్టమైనవి చేస్తున్నాను : మనీషా కోయిరాలా