Nagarjuna: నా పేరు చెప్పి దొంగతనాలు చేయొద్దు - అభిమానికి నాగార్జున రిక్వెస్ట్
Nagarjuna: సీనియర్ హీరో నాగార్జునకు ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏం తగ్గలేదు. ముఖ్యంగా మహిళల్లో ఈ హీరోకు ఉన్న క్రేజే వేరు. అందుకే తాజాగా తన ఫ్యాన్స్ అభిమానంతో పంపించిన లేఖలను చదివారు నాగ్.
Nagarjuna: సీనియర్ హీరో నాగార్జున ఈ ఏడాది మొదట్లోనే ‘నా సామిరంగ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతికి ఎన్ని సినిమాలు పోటీలో ఉన్నా.. తన సినిమా మీద నమ్మకంతో బరిలోకి దిగారు. ఇక ‘నా సామిరంగ’ కొంతవరకు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకొని యావరేజ్ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో విడుదలయిన నెలరోజుల తర్వాత ఈ మూవీ ఓటీటీలో కూడా విడుదలయ్యింది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. తాజాగా ఈ సినిమాను ఓటీటీలో చూడాలని ప్రమోట్ చేస్తూ తన ఫ్యాన్స్ తనకోసం రాసిన ప్రేమలేఖలను చదివారు నాగార్జున.
తెలుగు నేర్చుకుంటున్నాను..
ముందుగా ఒక అబ్బాయి తన తండ్రి నాగార్జునకు పెద్ద ఫ్యాన్ అంటూ రాసుకొచ్చాడు. తను పదేళ్ల వయసులో ఉన్నప్పుడు నాగార్జున పుట్టినరోజును తన ఫ్రెండ్స్‌తో సెలబ్రేట్ చేసుకోవడానికి తన తండ్రి జేబులో నుండి రూ.600 దొంగతనం చేసినట్టు చెప్పాడు. అది చదివిన నాగ్.. ‘‘నా పేరు చెప్పి మరీ దొంగతనాలు చేయొద్దు’’ అని సలహా ఇచ్చారు. ఇంకొక లేడీ ఫ్యాన్ అయితే నాగార్జున ఎప్పటికీ తనకు ఎవర్ యూత్ హీరోనే అంటూ తన అభిమానాన్ని బయటపెట్టింది. అది చదివి నవ్వుకున్నారు నాగార్జున. మరొక ఫ్యాన్.. తను నార్త్ ఇండియాకు చెందిన వ్యక్తి అని, కేవలం నాగార్జున ఇంటర్వ్యూలు, సినిమాలు చూడడం కోసమే తెలుగు నేర్చుకుంటున్నానని చెప్పింది. అంతే కాకుండా ఆగ్రాలో ఒక ఫ్యాన్ మీట్ కూడా పెట్టమని కోరింది.
పేజీ కవిత..
నాగార్జున అభిమాని అయిన మరో వ్యక్తి తను ఆకాశంలో సూర్యుడు అంటూ కవితను కూడా రాశాడు. నాగ్ చాలా అందంగా ఉంటారని తెగ పొగిడేశాడు. ఇంకొక లేడీ ఫ్యాన్ అయితే నాగార్జునకు పూర్తిగా ఒక పేజీ కవిత రాసి పంపింది. అది చదివి వావ్ అనుకున్నారు ఈ సీనియర్ హీరో. అమల పేరుతో ఉన్న ఒక ఫ్యాన్ కూడా నాగ్‌కు లేఖ రాసింది. ముందుగా తను హైదరాబాద్‌కు వచ్చినప్పుడు అసలు నాగార్జున అంటే ఎవరో తెలియదని, మెల్లగా ఆయన సినిమాలు చూడడం మొదలుపెట్టిన తర్వాత ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోయానని చెప్పింది. ఆ ప్రేమలేఖలు అన్ని చదివిన తర్వాత.. ‘‘అందరికీ థ్యాంక్స్. నన్ను చాలా ప్రేమిస్తున్నారు. చాలా అభిమానిస్తున్నారు’’ అంటూ అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నారు.
పరవాలేదనిపించింది..
‘నా సామిరంగ’ విషయానికొస్తే.. టాలీవుడ్‌లో ఎందరో యంగ్ హీరోలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన విజయ్ బిన్నీ.. ఈ చిత్రంతో డైరెక్టర్‌గా మారాడు. కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్.. నాగ్ సరసన హీరోయిన్‌గా నటించింది. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ లాంటి యంగ్ హీరోలు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. ఇక ఈ మూవీలో అల్లరి నరేశ్‌కు జోడీగా మిర్నా మీనన్ నటించగా.. రాజ్ తరుణ్‌కు పెయిర్‌గా రుక్సార్ కనిపించింది. ఈ సినిమా థియేటర్లలో దాదాపు రూ. 50 కోట్ల కలెక్షన్స్ సాధించి పరవాలేదనిపించింది. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read: నా కూతుళ్లను ‘యానిమల్’ చూడొద్దన్నాను, అసలు సమాజం ఎటు పోతోంది? - ఖుష్బూ వ్యాఖ్యలు