అన్వేషించండి

Khushbu: నా కూతుళ్లను ‘యానిమల్’ చూడొద్దన్నాను, అసలు సమాజం ఎటు పోతోంది? - ఖుష్బూ వ్యాఖ్యలు

Khushbu Sundar: ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ మూవీపై ఎంతోమంది సినీ సెలబ్రిటీలు విమర్శలు చేశారు. అందులో తాజాగా నటి ఖుష్బూ కూడా యాడ్ అయ్యారు.

Khushbu Sundar about Animal Movie: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’ మూవీ ఎంతోమంది ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఏ రేంజ్‌లో ప్రశంసలు వచ్చాయో.. అంతకంటే ఎక్కువ విమర్శలు కూడా వచ్చాయి. చాలామంది సినీ సెలబ్రిటీలు సైతం ‘యానిమల్’పై తీవ్రమైన విమర్శలు కురిపించారు. తాజాగా తమిళ నటి ఖుష్బూ కూడా ఈ సినిమా గురించి వ్యాఖ్యానించారు. తను ఇప్పటివరకు ‘యానిమల్’ చూడలేదని, తన కూతుళ్లకు ఆ సినిమా చూడొద్దని చెప్పానని బయటపెట్టారు. తాజాగా ఒక ఈవెంట్‌లో పాల్గొన్న ఖుష్బూ.. ఓపెన్‌గా ‘యానిమల్’ సినిమాపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అలాంటివి ఎన్నో చూశాను..

‘‘నేను నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్‌లో సభ్యురాలిని. నేను వేధింపులకు, మ్యారిటల్ రేప్, చట్టరీత్యా నేరమైనా కూడా ట్రిపుల్ తలాక్‌కు సంబంధించి ఎన్నో కేసులు చూశాను. యానిమల్ లాంటి ఒక సినిమా వచ్చి బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా సక్సెస్ అయ్యిందంటే దానిని సక్సెస్ చేసిన ప్రేక్షకుల మనస్థత్వాల గురించి ఆలోచించాలి’’ అంటూ ‘యానిమల్’ సినిమాపై ఖుష్బూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పలు సినీ సెలబ్రిటీలు కూడా ఇలాంటి సినిమాను హిట్ చేసినందుకు ప్రేక్షకుల మనస్థత్వాన్ని ప్రశ్నించగా ఇప్పుడు అందులో ఖుష్బూ కూడా యాడ్ అయ్యారు. కానీ ఇలాంటి మూవీ తెరకెక్కించినందుకు దర్శకుడు సందీప్‌ది మాత్రం ఏ తప్పు లేదన్నారు ఖుష్బూ.

సమాజం ఎటు పోతుంది.?

‘‘మనకు కబీర్ సింగ్, అర్జున్ రెడ్డిలాంటి సినిమాలతో కూడా సమస్యలు ఎదురయ్యాయి. ఈ విషయంలో నేను డైరెక్టర్‌ను కూడా నిందించను. ఎందుకంటే ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే కౌంట్ అవుతుంది. సమాజంలో ఏం జరుగుతుంది అనేది మేము సినిమాల్లో చూపిస్తాం. మహిళలను గౌరవించాలని చెప్తుంటాం అయినా కూడా ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు చూస్తారు. నా కూతుళ్లు కూడా ఈ సినిమా చూడడం నాకు ఇష్టం లేదు. కానీ వాళ్లు చూశారు ఎందుకంటే ఆ సినిమాలో ఏముందో వారు తెలుసుకోవాలని అనుకున్నారు. వాళ్లు చూసి వచ్చిన తర్వాత అమ్మ ప్లీజ్ ఈ సినిమా చూడకు అని నాతో చెప్పారు. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూస్తున్నారంటే సమాజం ఎటు వెళ్తుంది’’ అని ఖుష్బూ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

మరోసారి తెరపైకి..

ఖుష్బూ చేసిన వ్యాఖ్యల వల్ల మరోసారి ‘యానిమల్’ కాంట్రవర్సీ తెరపైకి వచ్చింది. చాలామంది ప్రేక్షకులు.. ఈ నటి వ్యాఖ్యలకు సపోర్ట్ చేస్తున్నారు. సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినా.. దాని వల్ల ఎన్ని కాంట్రవర్సీలు క్రియేట్ అయినా.. ‘యానిమల్’ తెరకెక్కించినందుకు సందీప్ రెడ్డి వంగాకు మాత్రం మంచి గుర్తింపు లభించింది. తాజాగా ఈ చిత్రానికి బెస్ట్ డైరెక్టర్‌గా తనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ కూడా దక్కింది. రణబీర్ కపూర్, రష్మిక మందనా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో తృప్తి దిమ్రీ కూడా ఒక కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమా వల్ల ముగ్గురికి మంచి క్రేజ్ లభించింది.

Also Read: రామ్ చ‌ర‌ణ్ 'గేమ్ ఛేంజ‌ర్'పై కియారా భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Chiranjeevi : మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Chiranjeevi : మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
Bangladesh Protest : బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి దారుణ హత్య! సజీవ దహనం చేసిన అల్లరి మూకలు!
బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి దారుణ హత్య! సజీవ దహనం చేసిన అల్లరి మూకలు!
Balakrishna : 'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
Avatar Fire And Ash Box Office Day 1: ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
Indonesian Hindu Religious Rights : ఏ ముస్లిం దేశంలో హిందువులకు అత్యధిక స్వేచ్ఛ లభిస్తుంది? ఆలయం ఏర్పాటు నుంచి ఈ విషయాల వరకు మినహాయింపు!
ఏ ముస్లిం దేశంలో హిందువులకు అత్యధిక స్వేచ్ఛ లభిస్తుంది? ఆలయం ఏర్పాటు నుంచి ఈ విషయాల వరకు మినహాయింపు!
Embed widget