అన్వేషించండి

Sidharth Malhotra: రామ్ చ‌ర‌ణ్ 'గేమ్ ఛేంజ‌ర్'పై కియారా భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sidharth Malhotra: రామ్ చ‌ర‌ణ్ 'గేమ్ ఛేంజ‌ర్' గురించి కియారా త‌న‌కు చాలా చెప్పింద‌ని, తెలుగులో న‌టించాల‌ని త‌న‌కు కూడా ఆశ‌గా ఉంద‌ని సిద్ధార్థ్ మల్హోత్రా త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టారు.

Sidharth Malhotra About Ram charan, Rajamouli and Allu Arjun: సిద్ధార్థ్ మల్హోత్రా.. ప్ర‌స్తుతం ‘యోధ’  సినిమా ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇంట‌ర‌వ్యూలు ఇస్తూ మీడియా స‌మావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు సిద్ధార్థ మ‌ల్హోత్ర‌, రాశీఖ‌న్న‌ా, చిత్రబృందం. జ‌ర్న‌లిస్టులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానాలు చెప్పారు. తెలుగులో త‌న‌కు న‌చ్చే డైరెక్ట‌ర్, హీరోల గురించి చెప్పుకొచ్చారు సిద్ధార్థ్ మల్హోత్రా. 'గేమ్ ఛేంజ‌ర్' సినిమా గురించి త‌న భార్య కియారా చాలా విష‌యాలు చెప్తుంద‌ని ఆయ‌న అన్నారు. 

రాజ‌మౌళి సార్ ఫేవ‌రెట్.. 

"తెలుగులో సినిమా చేసే అవ‌కాశం ఉందా?" అని అడిగిన ప్ర‌శ్న‌కి సిద్ధార్థ్ మల్హోత్రా ఇలా సమాధానం చెప్పారు. "మంచి క్యారెక్ట‌ర్ వ‌స్తే క‌చ్చితంగా ప‌నిచేస్తాను. టాలీవుడ్ లో డైరెక్ట‌ర్లు, రైట‌ర్లు హీరో క్యారెక్ట‌ర్ ని చాలా బాగా రాస్తారు. అది నాకు చాలా న‌చ్చుతుంది. ఇక్క‌డ చాలామంది టాలెంటెడ్ డైరెక్ట‌ర్లు, రైట‌ర్లు ఉన్నారు. వాళ్ల‌తో ప‌నిచేసే ఛాన్స్ వ‌స్తే క‌చ్చితంగా చేస్తాను. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ లో రాజ‌మౌళి సార్ అంటే చాలా ఇష్టం. అన్ని రోజులు షూటింగ్ చేసినా ఎంజాయ్ చేసేలా చేస్తారు. స్క్రీన్ మీద హీరో సెల‌బ్రేట్ చేసుకునేలా చూపిస్తారు. అల్లు అర్జున్ వ‌ర్క్, రామ్ చ‌ర‌ణ్ వ‌ర్క్ చాలా స్ఫూర్తిగా అనిపిస్తుంది. నా భార్య కియారా కూడా రామ్ చ‌ర‌ణ్, శంక‌ర్ సార్  'గేమ్ ఛేంజ‌ర్' లో వ‌ర్క్ చేస్తోంది. ఆమె ఇక్క‌డి వ‌ర్క్ క‌ల్చ‌ర్, త‌న వ‌ర్క్ ఎక్స్ పీరియ‌న్స్ గురించి చాలా చెప్తుంది" అని అన్నారు సిద్ధార్థ్ మల్హోత్రా. 

రామ్ చ‌ర‌ణ్, శంక‌ర్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న 'గేమ్ చేంజర్' సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి, సముద్రఖని, ఎస్.జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. హైద‌రాబాద్ లో ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ జ‌రుగుతున్న‌ట్లుగా తెలుస్తోంది. 

'గేమ్ ఛేంజ‌ర్' సినిమాలో న‌టిస్తున్న కియారా అద్వానీ, సిద్ధార్థ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2020లో ‘షెర్షా’ మూవీ షూటింగ్ సమయంలో కియారాతో సిద్ధార్థ్ ప్రేమలో పడ్డాడని రూమర్స్ వచ్చాయి. ఇక 2023లో వీరు పెళ్లితో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత ‘మిషన్ మజ్ను’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ హీరో. ఇక ఇప్పుడు సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీ ఖన్నా కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమానే ‘యోధ’.  ఈ సినిమా మార్చి 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించి పోస్ట‌ర్లు, టీజ‌ర్లు ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ సినిమాకి సాగ‌ర్ ఆంబ్రే, పుష్క‌ర్ ఓజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ‘యోధ’ స్ఫూర్తిదాయ‌కంగా, దేశ భ‌క్తి క‌లిగిన సినిమా అని రాశీఖ‌న్నా అన్నారు. ఈ సినిమాలో చేయ‌డం అద్భుత‌మైన అనుభూతి అని ఆమె చెప్పారు.

Also Read: 'హరిహర వీరమల్లు' ఆగిపోలేదు - సినిమాకి రెండో భాగం కూడా ఉంది : నిర్మాత ఏ.ఎం రత్నం

టాప్ హెడ్ లైన్స్

Anasuya Bharadwaj : భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
NBK111 Release Date : NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
Eshwar Sai Reaction : నేను చేసింది తప్పే - వివాదం తర్వాత ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్
నేను చేసింది తప్పే - వివాదం తర్వాత ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget