Maareesan OTT Release Date: ఓ అల్జీమర్స్ పేషెంట్... ఓ దొంగ... అనుకోని ప్రయాణం - ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'పుష్ప' విలన్ కామెడీ థ్రిల్లర్
Maareesan OTT Platform: ఫహాద్ ఫాజిల్, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ థ్రిల్లర్ 'మారీశన్' ఓటీటీలోకి వచ్చేస్తోంది. గత నెలలో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది.

Fahadh Faasil's Maareesan OTT Release On Netflix: మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ కామెడీ థ్రిల్లర్ 'మారీశన్'. జులై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆడియోతో అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా వెల్లడిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. 'అబ్బాయిలూ లోపలికి రండి. మేము తిరువణ్ణామలైకి వెళ్తున్నాం. నెట్ ఫ్లిక్స్‌లో మారీశన్‌ను చూడండి.' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఈ మూవీకి సుదీశ్ శంకర్ దర్శకత్వం వహించగా... ఫహాద్, వడివేలుతో పాటు వివేక్ ప్రసన్న, కోవై సరళ, సీనియర్ నటి సితార, రేణుక, లివింగ్‌స్టన్, తీనప్పన్, శరవణన్ సుబ్బయ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు. ఫహాద్ డిఫరెంట్ రోల్ ఆకట్టుకోగా వడివేలు కామెడీ నవ్వులు పూయించింది. కామెడీ, ఎమోషన్ కలగలిపి 'మారీశన్' ఆడియన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చింది.
View this post on Instagram
Also Read: 'భోళా శంకర్' మూవీ రిజల్ట్ - ప్రొడ్యూసర్‌ను చూసి జాలిపడ్డ క్లర్క్... ఆ స్టోరీ ఏంటో తెలుసా?
స్టోరీ ఏంటంటే?
దయాలన్ (ఫహాద్ ఫాజిల్) ఓ దొంగ. వేలాయుధం పిళ్లై (వడివేలు) ఓ అల్జీమర్స్ పేషెంట్. వేలాయుధం వద్ద చాలా డబ్బు ఉందని తెలుసుకున్న దయాలన్ అవి కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. తన ఫ్రెండ్‌ను కలిసేందుకు వేలాయుధం ఊరికి బయలుదేరగా తనతో పాటు వెళ్లి దారిలో డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. తన మాయ మాటలతో వేలాయుధాన్ని ముగ్గులోకి దింపి తన బైక్‌పై ఎక్కేలా చేస్తాడు. ఇద్దరూ కలిసి వేలాయుధం ఫ్రెండ్ ఊరికి బయల్దేరతారు.
అసలు ఈ ప్రయాణంలో ఏం జరిగింది? అనుకున్నట్లుగానే దయాలన్ వేలాయుధం వద్ద డబ్బు కొట్టేశాడా? వేలాయుధం పరిస్థితి చూసి ఏమైనా మారిపోయాడా? ఆ ప్రయాణంలో వారికి ఎదురైన పరిణామాలేంటి? అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన వెంటనే మూవీ చూసేయండి.





















