Leo OTT Release Date: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'లియో' - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
తలపతి విజయ్ నటించిన 'లియో' మూవీ త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. నవంబర్ 21 నుంచి 'లియో' నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ 'లియో'(Leo) త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. దసరా కానుకగా థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రావడం గమనార్హం. తాజాగా 'లియో' మూవీ ఓటీటీ డేట్ ని లాక్ చేసుకుంది. డీటెయిల్స్ లోకి వెళ్తే.. కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'లియో'(Leo) అక్టోబర్ 19న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో లియో కూడా బాగామని తెలియడంతో ఈ సినిమాపై ముందు నుంచే ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.
కానీ విడుదలైన తర్వాత ఈ మూవీ ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ ని అందుకుంది. 'ఖైదీ', 'విక్రమ్' రేంజ్ లో 'లియో' లేదనే టాక్ కూడా బయటకు వచ్చింది. కానీ సినిమాలో తలపతి విజయ్ తన నట విశ్వరూపం చూపించడంతో ఫ్యాన్స్ ఈ సినిమాని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా కానీ కలెక్షన్స్ లో మాత్రం దుమ్ము రేపుతోంది. లియో మొదటి రోజు రూ.140 కోట్ల గ్రాస్ అందుకొని ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. కోలీవుడ్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా 'లియో' సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. కేవలం కోలీవుడ్ లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి కలెక్షన్స్ తో రన్ అవుతుంది.
ఇలాంటి తరుణంలో 'లియో' ఓటీటీ స్ట్రీమింగ్ కి సంబంధించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. 'లియో' ఓటీటీ రైట్స్ ని ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే సినిమా థియేటర్లో రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా అగ్రిమెంట్ చేసుకున్నారట. దాని ప్రకారం నవంబర్ 21 నుంచి లియో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. అంతేకాదు ఈ ఓటీటీ అగ్రిమెంట్ కారణంగానే హిందీ నేషనల్ మల్టీప్లెక్స్ లో సినిమా రిలీజ్ కాలేదు. అక్కడ రూల్ ప్రకారం థియేటర్ రిలీజ్ కు ఓటీటీ రిలీజ్ కు మధ్య కనీసం ఆరువారాల గ్యాప్ ఉండాలి.
కానీ మూవీ యూనిట్ భారీ ధరకు లియో ఓటీటీ రైట్స్ ని అమ్మేసి నాలుగు వారాల్లోనే ఓటీటీ రిలీజ్ కి అగ్రిమెంట్ చేసుకుంది. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ నుంచి ఓటీటీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతోంది. ఇక ఈ చిత్రంలో విజయ్ పార్థీ, లియో అనే రెండు విభిన్నతరహా పాత్రలో కనిపించారు. ఇద్దరు పిల్లల తండ్రిగా పార్తీ పాత్రలో విజయ్ కనిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే లియోగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనూ అదరగొట్టారు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ మీనన్, మ్యాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియ ఆనంద్, శాండీ సహాయక పాత్రల్లో కనిపించారు. సెవెన్ స్క్రీన్ బ్యానర్ పై ఎస్.ఎస్ లలిత్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు.
Also Read : వీవీ వినాయక్ దర్శకత్వంలో రవితేజ సినిమా! 'కృష్ణ' తర్వాత మరో హిట్ పడేనా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial