అన్వేషించండి

VV Vinayak-Ravi Teja Movie: వీవీ వినాయక్ దర్శకత్వంలో రవితేజ సినిమా! 'కృష్ణ' తర్వాత మరో హిట్ పడేనా?

గత కొంతకాలంగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న వీవీ వినాయక్, రవితేజతో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు మాస్ మహారాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

వీవీ వినాయక్. ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ డైరెక్టర్. ఆయన తెరకెక్కించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోతలు మోగించాయి. కానీ, గత కొంత కాలంగా  ఫామ్ కోల్పోయారు. వినాయక్ తెరకెక్కించిన సినిమాలు అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేక పోతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి తను తాను ఫ్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజతో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.   

‘కృష్ణ’ కాంబో మళ్లీ రిపీట్!

వాస్తవానికి రవితేజ, వినాయక్ కాంబోలో వచ్చిన ‘కృష్ణ’ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. రవితేజలోని పూర్తి స్థాయి మాస్ రూపాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు వినాయక్. ఈ సినిమాలో రవితేజ నటన, యాక్షన్ సన్నివేశాలు పాటలు ప్రేక్షకులను బాగా ఎంటర్ టైన్ చేశాయి. ఇద్దరి కాంబోలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ కాంబోలో మరో సినిమా వస్తుందని చాలా కాలంగా టాక్ వినిపిస్తోంది. కానీ, కుదరడం లేదు. వినాయక్ గత కొంతకాలంగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. చిరంజీవితో చేసిన ‘ఖైదీ నెం.150’ తర్వాత అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారు.  వినాయక్ తాజాగా తెరకెక్కించిన హిందీ ‘ఛత్రపతి’ మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. కానీ, ఆ సినిమా కూడా  ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ సినిమా చెత్త అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు.

రవితేజతో వినాయక్ సినిమా

నిజానికి వినాయక్ సినిమాలకు దూరం అవుతాడేమో అని చాలా మంది భావించారు. కానీ, ఆయనకు వరుస ఫ్లాఫులు వచ్చినా.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు కారణంగా ఆయనతో సినిమాలు చేసేందుకు హీరోలు ఆసక్తి చూపిస్తారు. అయితే, చక్కటి కథల కోసం వినాయక్ ప్రయత్నిస్తున్నారట. ఎట్టకేలకు ఓ సినిమా కథ ఓకే అయ్యిందట. ఈ  కథ రవితేజకు చెప్పారట. ఆయనకు కూడా నచ్చడంతో ఓకే చెప్పారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

వచ్చే ఏడాది సెట్స్ మీదకు వచ్చే అవకాశం!

గత కొంత కాలంగా రవితేజ వరుస సినిమాలు చేస్తున్నారు. సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాల్లో నటిస్తున్నారు. అయితే, రవితేజ ప్రస్తుతం కొన్ని సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చారు. ఆ సినిమాలు పూర్తి అయ్యాక వినాయక్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది  జనవరి లేదంటే ఫిబ్రవరిలో ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పనులు మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక రవితేజ తాజాగా నటించిన ‘టైగర్ నాగేశర్వరరావు’ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. స్టువర్టుపురం గజదొంగ నాగేశర్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరెక్కింది.

Read Also: మావారి కంటే ఆయనే బెస్ట్, దీపికా కామెంట్స్‌కు రణవీర్ షాక్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Toxic Actor Yash: నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget