Kill Movie OTT Release Date: బాలీవుడ్ సూపర్ హిట్ యాక్షన్ ఫిల్మ్ 'కిల్' ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతోందంటే?
Kill Movie OTT Platform: ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో వచ్చి సూపర్ హిట్ సాధించిన బాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్ 'కిల్'. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే?
బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు సరైన విజయాలు అందుకోవడం కష్టంగా మారుతున్న సయమంలో... ఎటువంటి అంచనాలు లేని, అసలు నమ్మకమే లేని సినిమాలు భారీ విజయాలు అందుకుంటున్నాయి. ఇప్పుడు బాక్సాఫీస్ బరిలో 'స్త్రీ 2' కలెక్షన్లు ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. కొంత వెనక్కి వెళ్తే 'కిల్' సినిమా (Kill Movie)ను చెప్పవచ్చు. అందులో లక్ష్ లాల్వానీ (Lakshya Lalwani) హీరో. తాన్య మనక్తిలా కీలక పాత్రలో నటించింది. ఇప్పుడీ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అవుతోంది.
ఓటీటీలోకి సెప్టెంబర్ 6న రానున్న 'కిల్'
నిఖిల్ నగేశ్ భట్ దర్శకుడిగా తెరకెక్కిన 'కిల్' సినిమా జూలై 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ బరిలో మంచి వసూళ్లతో పాటు ప్రేక్షకుల నుంచి మన్ననలు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ సినిమాను ఓటీటీలోకి తీసుకు వస్తున్నారు. సెప్టెంబరు 6 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సినిమా టీమ్ అధికారికంగా అనౌన్స్ చేసింది. అయితే... ఈ సినిమా హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుందా? లేదంటే దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో కూడా వస్తుందా? లేదా? అనేది ఇంకా చెప్పలేదు.
View this post on Instagram
ఫిల్మ్ ఫెస్టివల్‌లలో స్పెషల్ షోలు!
'కిల్'ను ప్రాంతీయ భాషల్లోనూ రీమేక్ చేస్తారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. మరి, ఈ సినిమాను నేపథ్యంలో ఎన్ని ప్రాంతీయ భాషల్లో ఓటీటీలో అనువదిస్తారు? లేదంటే కేవలం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. 'కిల్' సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ చూసి నచ్చిన ఛార్లెస్ ఎఫ్. స్టాహెల్స్కీ ఇంగ్లిష్ రీమేక్ హక్కులు తీసుకున్నారు. గత ఏడాది 'టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్'తో పాటు జూన్ నెలలో జరిగిన 'ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్'లో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు.
అసలు 'కిల్' కథ ఏమిటి? సినిమాలో ఏముంది?
'కిల్' కథ విషయానికి వస్తే... అమిత్ రాథోడ్ (లక్ష్య లల్వానీ) ఆర్మీలో ఎన్ఎస్‌జీ కమాండర్. తులికా (తన్య మనిక్తలా)ను ప్రేమిస్తాడు. అయితే... ఆమె తండ్రి మాట కాదనలేక మరొకరితో ఎంగేజ్‌మెంట్ చేసుకోవడానికి ఓకే చెబుతుంది. ఆ విషయం తెలిసి ఎంగేజ్‌మెంట్ ఆపేస్తాడు అమిత్. రాంచీ నుంచి ఢిల్లీకి రైల్లో ప్రయాణం అవుతాడు. అదే రైలులో బందిపోట్లు ఎక్కుతారు. మరో వైపు తులికా, ఆమె కుటుంబం ఊహించని చిక్కుల్లో చిక్కుకుంటుంది. రైల్లో బందిపోట్లను అమిత్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేది సినిమాలో చూడాలి.
Also Read: అహో విక్రమార్క రివ్యూ: 'మగధీర' విలన్ దేవ్ గిల్ హీరోగా నటించిన సినిమా
కలెక్షన్స్ విషయానికి వస్తే... 'కిల్' రూ. 47 కోట్లు మాత్రమే రాబట్టింది. ఆ సినిమా బడ్జెట్, స్టార్ కాస్ట్ వంటివి పరిగణలోకి తీసుకుంటే... బాక్సాఫీస్ దగ్గర భారీ ఇంపాక్ట్ చూపించింది. తక్కువ నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ఊహించని విజయం అందుకుంది. లక్ష్య లల్వాని బాడీ బిల్డింగ్, యాక్షన్ సన్నివేశాల్లో చూపించిన ప్రతిభ థియేటర్లలో జనాలకు బాగా నచ్చాయి.