Kajal Karthika: ఓటీటీలోకి కాజల్ హారర్ మూవీ ‘కార్తీక’ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kajal Karthika: కాజల్ హారర్ సినిమాల్లో చాలా అరుదుగా నటిస్తుండగా అందులో ‘కార్తీక’ కూడా ఒకటి. థియేటర్లలో ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవ్వలేకపోయిన ఈ మూవీ.. త్వరలో ఆహాలో విడుదల కానుంది.
Kajal Karthika Movie On Aha: గత కొన్నిరోజులుగా తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అయిన ఆహాలో హారర్ సినిమాల సందడి పెరిగింది. ఇప్పటికే ఆహాలో పలు హారర్ చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తుండగా.. తాజాగా త్వరలోనే విడుదల అవ్వనున్న హారర్ మూవీస్ లిస్ట్‌లో మరొకటి యాడ్ అయ్యింది. అదే ‘కార్తీక’. కాజల్ హీరోయిన్‌గా నటించిన ఈ హారర్ మూవీ.. ‘కరుంగాపియం’ అనే పేరుతో తమిళంలో విడుదలయ్యింది. ఆ తర్వాత ‘కార్తీక’ అనే పేరుతో తెలుగులో కూడా డబ్ అయ్యింది. థియేటర్లలో ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవ్వని ఈ చిత్రం.. ఇప్పుడు ఆహాలోకి వచ్చి ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమయ్యింది.
క్రేజ్ లేకపోవడంతో..
కాజల్ హీరోయిన్‌గా నటించిన ‘కార్తీక’లో తనతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. రెజీనా, రైజా విల్సన్, జనని కూడా ఇందులో లీడ్ రోల్స్‌లో నటించారు. నలుగురు హీరోయిన్లు కలిసి చేస్తున్న హారర్ మూవీ కాబట్టి ‘కరుంగాపియం’పై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమా రిలీజ్‌కు చాలా సమయం తీసుకోవడంతో మెల్లగా ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అందుకే ఈ సినిమాను థియేటర్లలో ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. తమిళంలో ఎక్కువగా హైప్ క్రియేట్ అవ్వకపోవడంతో తెలుగులో కూడా ‘కార్తీక’కు ఎక్కువగా క్రేజ్ లభించలేదు. ఇక ఈ హారర్ మూవీ త్వరలోనే ఆహా సబ్‌స్క్రైబర్స్ ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.
ప్రేక్షకుల పాజిటివ్ రివ్యూ..
‘కాజల్ కార్తీక’ అనే పేరుతో ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ కానుంది. ఏప్రిల్ 9 నుంచి ఈ సినిమా సబ్‌స్క్రైబర్స్‌కు అందుబాటులో ఉంటుందని ఆహా ప్రకటించింది. ఇక ఈ సినిమా తమిళ వర్షన్ అయిన ‘కరుంగాపియం’ మాత్రం అమెజాన్ ప్రైమ్‌లో చాలాకాలం క్రితమే విడుదలయ్యింది. కానీ ఇప్పటికీ ఈ మూవీ ప్రైమ్ సబ్‌స్క్రైబర్స్ అందరికీ అందుబాటులో లేదు. దీనిని చూడాలంటే రెంట్ తీసుకోవాల్సిందే. డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ‘కార్తీక’ చాలా డిఫరెంట్ కథ అని, హారర్ ఎలిమెంట్స్ బాగున్నాయంటూ చూసిన కొందరు ప్రేక్షకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కాజల్ అయితే చాలా బాగా నటించిందంటూ ప్రశంసించారు.
View this post on Instagram
యోగి బాబు పాత్ర హైలెట్..
ఇప్పటివరకు కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన హారర్ సినిమాలకు అనుకున్నంత క్రేజ్ లభించలేదు. ఇప్పుడు ‘కార్తీక’ కూడా అదే లిస్ట్‌లో యాడ్ అయ్యింది. కానీ ఆహాలో విడుదలయిన తర్వాత ఈ మూవీ ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. తమిళంలో పేవ్ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని.. తెలుగులో ముత్యాల రామదాసు సమర్పణలో వెంకట సాయి ఫిల్మ్స్ బ్యానర్‌పై టి. జనార్ధన్ విడుదల చేశారు. ఈ సినిమాలో షెర్లీస్ సేత్, యోగి బాబు, జాన్ విజయ్ వంటి నటీనటులు కూడా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇది పూర్తిగా హారర్ కామెడీ చిత్రం కాకపోయినా యోగి బాబు పాత్ర మాత్రం ప్రేక్షకులను నవ్వించేలా ఉంటుంది.
Also Read: మేం మరీ ఫూల్స్ కాదు - దిల్ రాజు వల్ల ఆ రోజు బాగా హర్ట్ అయ్యా - విజయ్ షాకింగ్ కామెంట్స్!