![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kajal Karthika OTT Streaming: 'కాజల్ కార్తీక' ఓటీటీలోకి వచ్చేసింది - కాజల్, రెజీనా హారర్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
కాజల్ అగర్వాల్, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన 'కాజల్ కార్తీక' సినిమా ఈ రోజు నుంచి హనుమాన్ మీడియా ద్వారా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
![Kajal Karthika OTT Streaming: 'కాజల్ కార్తీక' ఓటీటీలోకి వచ్చేసింది - కాజల్, రెజీనా హారర్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే? Kajal Karthika OTT release Kajal Aggarwal Regena Cassandrra starrer Horror Thriller streaming on Aha Video Kajal Karthika OTT Streaming: 'కాజల్ కార్తీక' ఓటీటీలోకి వచ్చేసింది - కాజల్, రెజీనా హారర్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/09/1e0a427d9190cfd0f5901a50a28b2af01712661277726313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telugu version of Karungaapiyam starring Kajal Aggarwal and Regina Cassandra is now available for digital streaming on Aha: కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన హీరోయిన్లు. అగ్ర హీరోలు, యంగ్ స్టార్స్ సరసన ఆ ఇద్దరూ నటించారు. అయితే, వాళ్లిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించారు. అది ఏమిటో తెలుసా? 'కాజల్ కార్తీక'. ఇప్పుడు ఆ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగులోకి 'కాజల్ కార్తీక'గా తమిళ హారర్ ఫిల్మ్!
కాజల్ అగర్వాల్, రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్ 'కరుంగాపియం' (Karungaapiyam Movie). ఇంకా ఈ సినిమాలో జననీ అయ్యర్, కలయరసన్, రైజా విల్సన్, పార్వతి తిరువొతు ఇతర ప్రధాన తారాగణం. ఈ సినిమా గత ఏడాది మే 19న తమిళనాట థియేటర్లలో విడుదల అయ్యింది. అక్కడ మంచి విజయం అందుకుంది. ఆ సినిమాను తెలుగులో 'కాజల్ కార్తీక' పేరుతో డబ్బింగ్ చేశారు.
ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'కాజల్ కార్తీక'
Kajal Karthika movie streaming on AHA: ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న 'కాజల్ కార్తీక' చిత్రాన్ని ఆహా ఓటీటీలో విడుదల చేసింది హనుమాన్ మీడియా. తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అందుబాటులోకి రావడంతో కాజల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Also Read: అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్... స్టార్ హీరో సినిమాకు అంత దారుణమా? అయ్యయ్యో పరువు అంతా పాయె మియా!
OTT Alert 》Tamil Film #Karungaapiyam (2023) Telugu Dubbed #KajalKarthika Now Streaming on Aha Video.
— South Dubbed Hindi Updates (@SouthHiDubbed) April 9, 2024
Runtime - 2 hr 13 min
Stars - Kajal Aggarwal, Regena Cassandrra, Janani, Raiza Wilson, Sherlin Seth, Yogi Babuhttps://t.co/1S6s3Xaxzc pic.twitter.com/PjLOc4zWSU
'కాజల్ కార్తీక' చిత్రానికి డీకే రైటర్ అండ్ డైరెక్టర్. పదార్తి పద్మజ నిర్మాత. హర్రర్ అంశాలతో పాటు ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చే సన్నివేశాలు సినిమాలో బోలెడు ఉన్నాయని నిర్మాత పద్మజ తెలిపారు. ఇంకా ఆవిడ మాట్లాడుతూ... ''కాజల్ అగర్వాల్ గారు హారర్ క్యారెక్టర్లో నటించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంది. విఘ్నేష్ వాసు సినిమాటోగ్రఫీ, ప్రసాద్ .ఎస్.ఎన్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. కామెడీ, హారర్ సినిమాలు ఎంజాయ్ చేసే వీక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది'' అని చెప్పారు.
Also Read: ఆ హిట్ సినిమాలు మిక్సీలో వేస్తే వచ్చిన కిచిడీ 'ఫ్యామిలీ స్టార్' - రామ రామ... ఏంటిది పరశురామా?
ఐదు కథలకు కాజల్ & రెజీనాకు సంబంధం ఏమిటి?'కాజల్ కార్తీక' ట్రైలర్ సినిమాపై వీక్షకుల్లో ఆసక్తి పెంచింది. ఐదు వేర్వేరు కథలతో కాజల్, రెజీనాకి సంబంధం ఏమిటి? ఊరుప్రజలు అందరూ కాజల్ (Kajal Aggarwal)ను కొట్టడానికి కారణం ఏమిటి? అనేది క్యూరియాసిటీ పెంచింది. కామెడీతో పాటు హారర్ అంశాలు కోరుకునే ప్రేక్షకులకు ఓటీటీలో ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
Also Read: మైదాన్ రివ్యూ: ఫుట్ బాల్ కోచ్ రహీమ్ బయోపిక్ - అజయ్ దేవగణ్ సినిమా ఎలా ఉందంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)