Janaki V Vs State Of Kerala OTT Streaming: లైంగిక వేధింపులకు గురైన అమ్మాయి న్యాయ పోరాటం - అనుపమ పరమేశ్వరన్ లీగల్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Janaki V Vs State Of Kerala OTT Platform: అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లీగల్ థ్రిల్లర్ 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.

Anupama Parameswaran's Janaki V Vs State Of Kerala OTT Streaming On Zee5: రిలీజ్‌కు ముందే వివాదాలు. టైటిల్ మార్చాలంటూ సెన్సార్ బోర్డ్. మారిస్తే స్టోరీనే మార్చాల్సి వస్తుందంటూ చెప్పిన మూవీ టీం. ఎట్టకేలకు కోర్టు చొరవతో సమసిన వివాదం. ఆ మూవీనే అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లీగల్ థ్రిల్లర్ 'జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'.
తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇప్పటికే ప్రముఖ ఓటీటీ 'Zee5' ఓటీటీలో తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండగా... తాజాగా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నుంచి ఓటీటీలో తెలుగు ఆడియోలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సంక్రాంతికి వస్తున్నాం, రాబిన్ హుడ్, భైరవం వంటి మూవీస్‌తో ఎంటర్‌టైన్ చేసిన 'జీ5' ఇప్పుడు విమర్శకుల ప్రశంసలు పొందిన మాలీవుడ్ లీగల్ డ్రామాను ఓటీటీ ఆడియన్స్ ముందుకు తెచ్చింది.
ఈ మూవీలో అనుపమతో పాటు సురేష్ గోపి కీలక పాత్ర పోషించారు. ఆయన ఇందులో లాయర్ రోల్‌లో కనిపించారు. వీరితో పాటే శ్రుతి రామచంద్రన్ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీకి ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించగా... కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఫణీంద్ర కుమార్ నిర్మించారు. లైంగిక వేధింపులకు గురైన అమ్మాయి చేసిన న్యాయ పోరాటమే బ్యాక్ డ్రాప్‌గా మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ 'జానకి' అనే టైటిల్ పెట్టడంపై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం తెలపగా... మూవీ టీం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఫైనల్‌గా 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' బదులు 'జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' కానీ 'వి జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' కానీ టైటిల్ పెట్టాలని తెలిపింది. ఈ మార్పులతో మూవీని రిలీజ్ చేయగా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.
JSK – A gripping courtroom drama streaming from tonight on ZEE5.
— ZEE5 Telugu (@ZEE5Telugu) August 21, 2025
Don’t miss it!"#JanakiVsStateOfKeralaOnZEE5@TheSureshGopi @anupamahere @jsujithnair @DreamBig_film_s
#PravinNarayanan #DivyaPillai #AskarAli#MadhavSuresh #Renadive #SamjithMohammed #Ghibran pic.twitter.com/V6y56Swv5c
Also Read: మెగాస్టార్ మావయ్యకి బర్త్డే విశెష్ చెప్పిన అల్లు అర్జున్.. మెగా ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చినట్టేనా?
స్టోరీ ఏంటంటే?
జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) బెంగుళూరులో ఐటీ కంపెనీలో ఉద్యోగి. పండుగ కోసం కేరళలోని తన సొంతూరికి వస్తుంది. ఓ రోజు స్నేహితులతో కలిసి బేకరీకి వెళ్లిన ఆమెకు చేదు అనుభవం ఎదురవుతుంది. ఆమెపై ఎవరో ఆగంతుకుడు లైంగిక దాడి చేస్తాడు. దీంతో ఆమె న్యాయ పోరాటానికి దిగుతుంది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కూడా ఇది సవాల్‌గా మారుతుంది. గొప్ప పేరున్న అడ్వకేట్ డేవిడ్ (సురేశ్ గోపి) నిందితుల తరఫున వాదిస్తాడు. న్యాయ పోరాటంలో ఆమెకి ఎదురైన సవాళ్లేంటి? తన ప్రమేయం లేకుండా తన కడుపులో పెరుగుతున్న బిడ్డను ప్రభుత్వమే చూసుకోవాలన్న ఆమె విజ్ఞప్తిపై కేరళ హైకోర్టు ఏం చేసింది? ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















