Japan OTT Update: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయిన కార్తీ ‘జపాన్’ - ఎప్పుడు, ఎక్కడంటే?
Japan Movie OTT Release Date: కార్తీ హీరోగా నటించిన ‘జపాన్’ చిత్రం త్వరలోనే ఓటీటీ ప్రేక్షకలను అలరించడానికి వచ్చేస్తోంది.
![Japan OTT Update: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయిన కార్తీ ‘జపాన్’ - ఎప్పుడు, ఎక్కడంటే? here are the ott streaming details of karthi starrer japan Japan OTT Update: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయిన కార్తీ ‘జపాన్’ - ఎప్పుడు, ఎక్కడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/04/e505e41b809ad9f7f0f255de920a01fe1701680698417802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Japan OTT Release: డిసెంబర్ నెలలో థియేటర్లలో మాత్రమే కాదు.. ఓటీటీల్లో కూడా సినిమా సందడి మొదలయ్యింది. ఈవారంతో పాటు వచ్చేవారం కూడా పలు చిత్రాలు ఓటీటీలో రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి. అందులో తమిళ హీరో కార్తీ నటించిన ‘జపాన్’ కూడా ఒకటి. ఎన్నో అంచనాలతో థియేటర్లలో విడుదలయిన ‘జపాన్’.. ఆశించినంత విజయం అందుకోలేదు. దీంతో నెలరోజుల్లోనే ఓటీటీ విడుదలకు సిద్ధమయ్యింది. అసలు ఈ మూవీ ఏ ఓటీటీలో విడుదల అవుతుంది, ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయాలను మూవీ టీమ్ తాజాగా బయటపెట్టింది.
నెలరోజుల్లో ఓటీటీలో..
కార్తీ, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ‘జపాన్’ చిత్రం.. టీజర్, ట్రైలర్‌లో ప్రేక్షకుల్లో తెగ హైప్‌ను క్రియేట్ చేసింది. కానీ విడుదలయిన తర్వాత ఫస్ట్ షో నుండే యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో చాలామంది ప్రేక్షకులు.. ఓటీటీలో వచ్చిన తర్వాత చూడొచ్చులే అని ‘జపాన్’ను పక్కన పెట్టేశారు. నవంబర్ 13న థియేటర్లలో విడుదలయిన ఈ చిత్రం.. సరిగ్గా నెలరోజుల్లో అంటే డిసెంబర్ 11న ఓటీటీలో స్ట్రీమ్ అవ్వడానికి సిద్ధమయ్యింది. మామూలుగా కార్తీకి కథలతో ఎక్స్‌పిరిమెంట్స్ చేయడం చాలా ఇష్టం. అయితే ‘జపాన్’ రిజల్ట్ చూసిన తర్వాత కొన్నాళ్ల వరకు ఇలాంటి ఎక్స్‌పిరిమెంట్స్ ఆపేస్తే బెటర్ అని ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు.
ఆ ఓటీటీకే స్ట్రీమింగ్ రైట్స్..
‘జపాన్’ చిత్రం కేవలం తెలుగు, తమిళంలోనే కాకుండా మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదలయ్యింది. ఇక డిసెంబర్ 11న కూడా అన్ని సౌత్ భాషల్లో స్ట్రీమ్ అవ్వడానికి సిద్ధమవుతుంది ఈ మూవీ. ‘జపాన్’ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ‘వాంటెడ్ - కార్తీ మన మనసులను దోచుకున్నాడు దాంతో పాటు దారిలో కొన్ని నగలను కూడా ఎత్తుకెళ్లాడు’ అనే క్యాప్షన్‌తో ‘జపాన్’ ఓటీటీ విడుదల తేదీని ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్. ఈ చిత్రంలో కార్తీ ఒక దొంగగా కనిపించగా.. అదే విషయాన్ని క్యాప్షన్‌లో తెలియజేసింది. ఇందులో కార్తీ హీరోగా నటించడంతో పాటు ‘టచింగ్ టచింగ్’ అంటూ సాగే పాటను కూడా పాడాడు.
View this post on Instagram
తరువాతి సినిమాపై ఫోకస్..
కెరీర్‌లో హిట్, ఫ్లాప్‌ను పెద్దగా పట్టించుకోకుండా ఎప్పుడూ ప్రేక్షకులకు తన సినిమాలతో ఒక కొత్తదనాన్ని ఇవ్వాలనుకుంటాడు కార్తీ. అందుకే రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జపాన్’ ఫ్లాప్ అయినా వెంటనే తన తరువాతి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం నలన్ కుమారసామీ దర్శకత్వంలో ‘వా వాతియారే’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ‘ఉప్పెన’ ఫేమ్ కృతిశెట్టి ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ‘వా వాతియారే’ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో త్వరలోనే మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట కార్తీ. అయితే ‘జపాన్’తో ఫ్లాప్ ఎదుర్కున్న కార్తీ.. తన తరువాతి చిత్రంతో కమ్ బ్యాక్ ఇవ్వాలని తన తమిళ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా తెలుగు ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. దీంతో పాటు ‘ఖైదీ 2’ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని కూడా ఎదురుచూస్తున్నారు. కార్తీ కెరీర్‌లో ‘ఖైదీ’ అనేది ఒక గుర్తుండిపోయే సినిమా అని గుర్తుచేసుకుంటున్నారు.
Also Read: షారుఖ్ ఖాన్ క్లాసిక్ చిత్రంతో ‘హాయ్ నాన్న’కు పోలికలు! - క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)