MY3: రోబోట్‌గా హన్సిక - ఆ పాపులర్ కొరియా వెబ్ సీరిస్‌కు ‘MY3’ రీమేక్?
హన్సిక నటిస్తోన్న ఫస్ట్ వెబ్ సీరిస్ ‘MY3’ త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కొరియన్ డ్రామాకు ఇది రీమేక్. మరి స్టోరీ ఏమిటో తెలుసా?
ఒకప్పుడు దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగిన హన్సిక.. మళ్లీ జోరు పెంచింది. ఆమె నటించిన ‘పార్టనర్’ మూవీ విడుదలకు సిద్ధమైంది. త్వరలో ‘మైత్రీ’ వెబ్ సీరిస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వెబ్ సీరిస్ తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠి, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మంగళవారం పోస్టర్ ద్వారా ఈ వెబ్ సీరిస్ అప్‌డేట్‌ను ప్రకటించింది. ఇందులో హన్సికాను సగం ఏఐ రోబోట్‌గా, మిగతా సగం మనిషిగా కనిపిస్తోంది. నటుడు మ్యుగెన్ చేతులకు గ్లవ్స్ ధరించి కనిపించాడు. ఇప్పటికే ఈ సీరిస్ టీమ్.. ఇది ఒక రోబోటిక్ లవ్ స్టోరి అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో హన్సిక రెండు భిన్న మైన పాత్రలు నటించనున్నట్లు తెలుస్తోంది. ఒక పాత్ర మైత్రీగా, మరొక పాత్ర MY3 రోబోట్ అని తెలుస్తోంది.
కొరియా టీవీ షో ‘I am not a Robot’కు రీమేక్?
కొరియాలో పాపులర్ టీవీ షో ‘ఐ యామ్ నాట్ ఎ రోబోట్’ మూవీకి ఈ సీరిస్ రీమేక్ అని తెలుస్తోంది. అందులో కూడా హీరోయిన్ రోబోగా నటిస్తుంది. సంపన్నుడైన హీరో అరుదైన అలర్జీతో బాధపడతాడు. మనుషులను తాకితే అతడి శరీరమంతా అలర్జీకి గురవ్వుతుంది. అది ఎక్కువైతే అతడి ప్రాణాలకే ప్రమాదం. అందుకే అతడు చేతులకు గ్లవ్స్ తొడుగుతాడు. మనుషులను తన దగ్గరకు రానివ్వడు. దీంతో అతడి పనులు చేయడానికి మనిషిలాంటి రోబోట్‌ను తయారు చేయాలని సైంటిస్ట్ టీమ్‌కు చెబుతాడు. దీంతో వారు ఓ అమ్మాయి రూపాన్ని తీసుకుని రోబోట్‌ను తయారు చేస్తారు. సరిగ్గా దాన్ని అతడికి డెలివరీ చేసే సమయానికి రోబోట్ పనిచేయదు. దీంతో ఆందోళన గురైన ఆ టీమ్.. ఆ రోబోట్ రూపంలో ఉండే అమ్మాయిని హీరో ఇంటికి పంపిస్తాడు. అతడు కూడా రోబోట్ చాలా సహజంగా ఉందని నమ్మేస్తాడు. ఆ తర్వాత అతడు ఆ రోబోట్‌తో ప్రేమలో పడతాడు. మరి, అది రోబోట్ కాదు, మనిషే అని తెలిసి హీరో ఎలా స్పందిస్తాడు? చివరికి ఏం జరుగుతుందనేది కథా. ఈ సీరిస్ మొత్తం కామెడీగా, ఎమోషనల్‌గా సాగుతుంది. మరి, హన్సిక సీరిస్ కూడా అదే కథతో వస్తున్నట్లయితే.. తప్పకుండా నచ్చుతుంది. ‘ఐ యామ్ నాట్ ఎ రోబోట్’ టీవీ షో ఇప్పుడు ‘జియో సినిమా’, ‘MX’ ప్లేయర్‌లో హిందీ భాషలో అందుబాటులో ఉంది. ‘My3’ మూవీకి ‘ఓకే ఓకే’ మూవీ డైరెక్టర్ రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ వెబ్ సీరిస్ ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో స్ట్రీమింగ్ కానుంది.
View this post on Instagram
Also Read: 'చంద్రయాన్ 3' పోస్ట్‌పై స్పందించిన ప్రకాశ్ రాజ్, అది జస్ట్ జోక్?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial