అన్వేషించండి

Governor OTT : ఓటీటీలోకి వచ్చేసిన మనోజ్ బాజ్‌పాయ్ కొత్త మూవీ - నేషనల్ అవార్డ్ విన్నర్ పొలిటికల్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Governor OTT Platform : బాలీవుడ్ స్టార్ మనోజ్ బాజ్‌పాయ్ ఫైనాన్షియల్ పొలిటికల్ థ్రిల్లర్ గవర్నర్ ఓటీటీలోకి వచ్చేసింది. జూన్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మనోజ్ బాజ్‌పాయ్ ‘గవర్నర్’ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
  • రూ.349 అద్దెకు చూడవచ్చు, బాజ్‌పాయ్ నటనకు ప్రశంసలు దక్కాయి.
  • 1990-91 ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ పోరాటం కథాంశం.
  • దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు ఆయన కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు.

Manoj Bajpayee's Governor The Silent Saviour OTT Streaming : బాలీవుడ్ స్టార్, నేషనల్ అవార్డ్ విన్నర్ మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫైనాన్షియల్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గవర్నర్ : ది సైలెంట్ సేవియర్'. ఎన్నో అంచనాల మధ్య జూన్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కాలేదు. దాదాపు నెల రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) 'గవర్నర్' (Governor The Silent Saviour) శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రస్తుతం రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. రూ.349 చెల్లించి మూవీ చూడొచ్చు. సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చినా మనోజ్ బాజ్‌పాయ్ నటనకు మాత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. 

ఈ మూవీకి చిన్మయ్ డి మాండ్లేకర్ దర్శకత్వం వహించగా... ఆర్బీఐ గవర్నర్‌గా మనోజ్ బాజ్‌పాయ్ అద్భుతంగా నటించారు. ఆయనతో పాటే అదాశర్మ, నౌషాద్ మహమ్మద్ కుంజు, మధూషా తదితరులు కీలకపాత్రలు పోషించారు. సన్ షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై విపుల్ అమృత్ లాల్‌షా నిర్మించారు. అమిత్ త్రివేది మ్యూజిక్ అందించగా... జావేద్ అక్తర్ సాహిత్యం అందించారు.

Also Read : Purushaha OTT : ఓటీటీలోకి సడన్‌గా లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ పురుషః - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

స్టోరీ ఏంటంటే?

ఈ మూవీ స్టోరీ 1990 - 91ల నాటి భారత ఆర్థిక సంక్షోభం చుట్టూ సాగుతుంది. దేశం ఆర్థిక పరంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సాధారణ వ్యక్తి తీసుకున్న కఠిన నిర్ణయాలు మళ్లీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పడేలా చేశాయి అనేదే ప్రధానాంశంగా స్టోరీ సాగుతుంది. గల్ఫ్ యుద్ధం వల్ల ఇంధన ధరలు పెరిగిపోవడం, విదేశీ మారక నిల్వలు అట్టడుగు స్థాయికి చేరుకోవడంతో దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది.

ఆ టైంలో దేశాన్ని గట్టిక్కించే బాధ్యతను కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆర్బీఐ గవర్నర్ (మనోజ్ బాజ్‌పాయ్) తీసుకుంటారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి  రుణం కోసం ఓ సీక్రెట్ మిషన్ చేపడతారు. ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు, రాజకీయ ఒత్తిళ్లు అన్నింటినీ అధిగమిస్తారు. అసలు గవర్నర్ చేపట్టిన సీక్రెట్ మిషన్ ఏంటి? రాజకీయ ఒత్తిళ్లను ఎలా అధిగమించారు? ఆర్థిక వ్యవస్థపై జర్నలిస్ట్ చేసిన పరిశోధన ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : Chennai Love Story Review - 'చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ: ప్రేమకు ఫాంటసీ టచ్... కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Frequently Asked Questions

గవర్నర్ : ది సైలెంట్ సేవియర్ సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది?

'గవర్నర్' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ప్రస్తుతం రెంటల్ విధానంలో రూ.349 చెల్లించి అందుబాటులో ఉంది.

'గవర్నర్' సినిమాలో మనోజ్ బాజ్‌పాయ్ పాత్ర ఏమిటి, అతని నటన ఎలా ఉంది?

ఈ సినిమాలో మనోజ్ బాజ్‌పాయ్ ఆర్బీఐ గవర్నర్‌గా నటించారు. సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చినా, ఆయన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.

'గవర్నర్ : ది సైలెంట్ సేవియర్' సినిమా కథాంశం ఏమిటి?

ఈ సినిమా కథ 1990-91 నాటి భారత ఆర్థిక సంక్షోభం చుట్టూ తిరుగుతుంది. ఆర్బీఐ గవర్నర్ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి పడిన కష్టాలు ప్రధానాంశం.

'గవర్నర్' సినిమాకు దర్శకత్వం వహించినది ఎవరు, ఇతర ప్రధాన నటీనటులు ఎవరు?

ఈ సినిమాకు చిన్మయ్ డి మాండ్లేకర్ దర్శకత్వం వహించారు. మనోజ్ బాజ్‌పాయ్‌తో పాటు అదాశర్మ, నౌషాద్ మహమ్మద్ కుంజు, మధూషా కీలక పాత్రల్లో నటించారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Srinivasa Mangapuram OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Embed widget