Golla Ramavva OTT : తెలంగాణ సాయుధ పోరాట గాథ 'గొల్ల రామవ్వ' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Golla Ramavva OTT Platform : 'కథా సుధ'లో భాగంగా తెలంగాణ సాయుధ పోరాట గాథ 'గొల్ల రామవ్వ' ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు సీతామాలక్ష్మి 'తాళ్లూరి రామేశ్వరి' టైటిల్ పాత్ర పోషిస్తున్నారు.

Talluri Rameshwari's Golla Ramavva OTT Release Date Locked : లవ్, ఫ్యామిలీ, మెసేజ్ ఓరియెంటెడ్ ఇలా ప్రతీ వారం 'కథా సుధ'లో భాగంగా ఓ సరికొత్త కథాంశంతో ఓటీటీ లవర్స్‌కు ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది 'ఈటీవీ విన్'. తాజాగా మరో పీరియాడికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలంగాణ సాయుధ పోరాట గాథను మరోసారి కళ్లకు కట్టేలా ఆవిష్కరించనుంది.
సాయుధ పోరాట గాథ... 'గొల్ల రామవ్వ'
తెలుగు జాతి గర్వం, భారత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ పీవీ నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాట గాథకు దృశ్య రూపం 'గొల్ల రామవ్వ'. ప్రఖ్యాత రచయిత ముళ్లపూడి వెంకటరమణ తనయుడు ముళ్లపూడి వరా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వీరోచిత గాధ ఈ నెల 25 నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ కానుంది.
తెలుగు 'సీతామాలక్ష్మి' తాళ్లూరి రామేశ్వరి 'గొల్ల రామవ్వ' టైటిల్ పాత్ర పోషించనున్నారు. ఆమెతో పాటే అన్విత్, మణి మతేనా, అల్లు గీత తదితరులు కీలక పాత్రలు పోషించారు. 'మౌనమే నీ భాష' చిత్రాన్ని నిర్మించిన టీమే ఈ మూవీని సైతం నిర్మించింది. ఈ మూవీకి సాయి మధుకర్ మ్యూజిక్ అందించగా... రవి బయ్యవరపు, వర ముళ్లపూడి స్క్రీన్ ప్లే, రచయితగా వ్యవహరించారు. గంగమోని శేఖర్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్ - వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకాలపై... రామ్ విశ్వాస్ హనూర్కర్ - రాఘవేంద్రవర్మ (బుజ్జి) సంయుక్తంగా... అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
View this post on Instagram
Also Read : క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే






















