Solo Boy OTT Release: మిడిల్ క్లాస్ To మిలియనీర్ - ఓటీటీలోకి 'సోలో బాయ్'... థియేటర్‌లో ఉండగానే అప్డేట్ ఇచ్చిన హీరో
Solo Boy OTT: బిగ్ బాస్ ఫేం గౌతమ్ కృష్ణ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ 'సోలో బాయ్'. ఈ సినిమా థియేటర్లో ఉండగానే ఓటీటీ రిలీజ్‌పై అప్డేట్ ఇచ్చారు హీరో. త్వరలోనే ఓటీటీలోకి వస్తుందన్నారు.

Solo Boy Movie OTT Release Update: బిగ్ బాస్ ఫేం గౌతమ్ కృష్ణ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ 'సోలో బాయ్'. ఈ నెల 4న రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రమోషన్లతో మంచి క్రేజ్ తీసుకొచ్చినా కమర్షియల్‌గా అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు థియేటర్లలో ఉండగానే ఓటీటీ రిలీజ్‌పై అప్డేట్ ఇచ్చారు హీరో గౌతమ్.
రెడీగా ఉండండి
ఈ మూవీని త్వరలోనే ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు గౌతమ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. 'సోలో బాయ్ త్వరలోనే మీ ఇళ్లల్లోకి వస్తున్నాడు. ఓటీటీలోకి కమింగ్ సూన్.' అంటూ రాసుకొచ్చారు. దీంతో మరో వారంలోనే మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే... ఏ ప్లాట్ ఫాంలోకి వస్తుందో అనేది క్లారిటీ లేదు. అమెజాన్ ప్రైమ్ లేక ఆహాలోనా లేదా ఇతర ఓటీటీలో అందుబాటులోకి వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
టీవీ రియాలిటీ షో 'బిగ్ బాస్' 2 సీజన్లలో పార్టిసిపేట్ చేసి పాపులర్ అయ్యారు గౌతమ్ కృష్ణ. 'బిగ్ బాస్ 7'లో కంటెస్టెంట్‌గా పాల్గొని... 8వ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచారు. 'సోలో బాయ్' మూవీకి నవీన్ కుమార్ దర్శకత్వం వహించగా... రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటించారు. వీరితో పాటే పోసాని కృష్ణమురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రమ్, సూర్య, ఆనంద్ చక్రపాణి, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజినీవర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సెవెన్ హిల్స్ బ్యానర్‌పై వేణుదారి బేబీ నేహాశ్రీ సమర్పణలో సతీష్ మూవీని నిర్మించారు. 'ఆపరేషన్ సింధూర్'లో అమరుడైన తెలుగు జవాన్ మురళీ నాయక్ పేరెంట్స్ చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు. హీరో వారికి రూ.లక్ష సాయం అందించారు.
View this post on Instagram
Also Read: రాజమౌళి ముఖ్య అతిథిగా వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్... ఆయనతో పాటు ఇంకెవరు వస్తారంటే?
స్టోరీ ఏంటంటే?
ఓ మిడిల్ క్లాస్ యువకుడు మిలియనీర్‌గా ఎలా మారాడు? అనేదే సోలో బాయ్ స్టోరీ. తల్లిదండ్రులు కష్టపడి కృష్ణమూర్తి (గౌతమ్ కృష్ణ)ని ఇంజినీరింగ్ చదివిస్తారు. కాలేజీలో ప్రియ (రమ్య పసుపులేటి)తో లవ్‌లో పడతాడు. గొప్పింటి అమ్మాయి అయిన ప్రియ అతన్ని అవమానించి లవ్ బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. దీంతో మద్యానికి బానిసగా మారతాడు. తండ్రి ప్రోత్సాహంతో మారి ఉద్యోగంలో చేరతాడు. అక్కడ శ్రుతి (శ్వేత అవస్తి) అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న టైంలో కృష్ణమూర్తి తండ్రిని కోల్పోతాడు.
అదే టైంలో ఆర్థిక ఇబ్బందులతో అతనితో ఉండలేనని శ్రుతి డివోర్స్ ఇస్తుంది. ఓ వైపు తండ్రి మృతి... మరోవైపు భార్య విడాకులు. వీటన్నింటినీ తట్టుకుని కష్టాలను అధిగమించి తన ప్రతిభతో కృష్ణమూర్తి మిలియనీర్‌గా ఎలా మారాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.



















