Dhoolpet Police Station Series OTT : ఓటీటీలోకి థ్రిల్లర్ సిరీస్ 'ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్' - మొత్తం 50 ఎపిసోడ్స్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Dhoolpet Police Station Series OTT Platform : మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్' ఓటీటీలోకి వచ్చేసింది. మొత్తం 50 ఎపిసోడ్స్ కాగా... ప్రతీ శుక్రవారం న్యూ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

Ashwin Kumar's Dhoolpet Police Station Series OTT Streaming : ఓటీటీ ఆడియన్స్‌కు సూపర్ థ్రిల్ పంచేందుకు మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. నగరంలో వరుస హత్యలను ఛేదించే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్' ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో అందుబాటులోకి వచ్చింది.
ఎన్ని ఎపిసోడ్స్ అంటే?
ఈ వెబ్ సిరీస్ మొత్తం 50 ఎపిసోడ్స్ కాగా ఈ నెల 5 నుంచి ప్రతీ శుక్రవారం నుంచి కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. రాత్రి 7 గంటలకు అందుబాటులోకి రానుంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో రానుంది. సిరీస్‌కు జెస్విని దర్శకత్వం వహించగా... అశ్విన్, శ్రీతు, పదిని కుమార్, గురు, ప్రీతి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అశ్వతన్ మ్యూజిక్ అందించారు.
View this post on Instagram
View this post on Instagram
Also Read : మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
స్టోరీ ఏంటంటే?
ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రాత్రి మూడు హత్యలు జరిగితే ఆ కేసును ఇద్దరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ ఎలా సాల్వ్ చేశారనేదే ఈ సిరీస్ స్టోరీ అని తెలుస్తోంది. నగరంలో ఒకే రాత్రి జరిగిన 3 హత్యల కేస్ సాల్వ్ చేసేందుకు ఏసీపీ అశ్విన్ రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత అతనికి సపోర్ట్‌గా మరో ఏపీసీ కూడా వస్తాడు. ఈ క్రమంలో కేసు విచారణ వేగవంతం అవుతుంది. అసలు ఆ హత్యలు ఎవరు చేశారు? దీని వెనుక క్షుద్రపూజలు, నరబలులు ఏమైనా ఉన్నాయా? అనేది సస్పెన్స్.





















