(Source: ECI/ABP News/ABP Majha)
Demonte Colony 2 OTT: డీమాంటీ కాలనీ 2... బ్లాక్ బస్టర్ తమిళ హారర్ థ్రిల్లర్ రైట్స్ ఏ ఓటీటీ తీసుకుందో తెలుసా?
Demonte Colony 2 OTT Platform: అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వంలో అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ నటించిన హారర్ థ్రిల్లర్ 'డీమాంటీ కాలనీ 2'. దీని ఓటీటీ రైట్స్ ఏ సంస్థ తీసుకుందంటే?
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తమిళ సినిమాయే అయినప్పటికీ... తెలుగులోనూ ప్రశంసలు అందుకుంది. ఆ సినిమాతో అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ మూవీ విజయంతో నయనతార ప్రధాన పాత్రలో 'ఇమైక్క నోడిగల్ (తెలుగులో 'అంజలి సీబీఐ ఆఫీసర్'గా విడుదల అయ్యింది), విక్రమ్ హీరోగా 'కోబ్రా' చేసే అవకాశం అందుకున్నారు. ఇప్పుడు 'డీమాంటీ కాలనీ 2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
తెలుగులోనూ 'డీమాంటీ కాలనీ 2' సూపర్ రెస్పాన్స్!
తొమ్మిదేళ్ల తర్వాత 'డీమాంటీ కాలనీ'కి సీక్వెల్ తీశారు. తొలుత వేరే దర్శకుడిని అనుకున్నా... చివరకు అజయ్ ఆర్ జ్ఞానముత్తు ప్రాజెక్టులోకి వచ్చారు. అరుళ్ నిధి మరోసారి హీరోగా నటించారు. ఈసారి ఆయన డ్యూయల్ రోల్ చేయగా... ప్రధాన పాత్రలో ప్రియా భవానీ శంకర్ నటించారు. తమిళంలో ఆగస్టు 15న థియేటర్లలో విడుదల అయ్యింది. వారం ఆలస్యంగా ఆగస్టు 23న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకు మంచి స్పందన లభించింది. మరి, ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఏ సంస్థ దగ్గర ఉన్నాయో తెలుసా?ఈ నెల 23న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ మూవీ "డీమాంటీ కాలనీ 2"
జీ తెలుగు ఓటీటీకి 'డీమాంటీ కాలనీ 2'
'డీమాంటీ కాలనీ 2' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ 'జీ తెలుగు' తీసుకుంది. తమిళ వెర్షన్ 'జీ తమిళ్'లో స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం ఓటీటీ హక్కులు మాత్రమే కాదు... శాటిలైట్ హక్కులను కూడా 'జీ టీవీ' నెట్వర్క్ సంస్థ తీసుకుంది.
Also Read: విడుదలకు ముందే శాటిలైట్ డీల్ క్లోజ్... మారుతి నగర్ సుబ్రమణ్యం ఏ టీవీలో వస్తుందంటే?
#DemonteColony2Telugu is a Monstrous Blockbuster❤️🔥
— GSK Media (@GskMedia_PR) August 23, 2024
It's bone-chilling phenomenon with sensational thrills💥💥
Book Your Tickets Now for #DemonteColony2 😈
🎟 https://t.co/njj15ssbYx@arulnithitamil @priya_Bshankar @AjayGnanamuthu @SamCSmusic @Bethireddy_Offl @SreeBalajiFilms… pic.twitter.com/AxQjw6yuvW
'డీమాంటీ కాలనీ 2'లో అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్, ముత్తు కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను జ్ఞానముత్తు పట్టరై, వైట్ నైట్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజ్ వర్మ ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ బాలాజీ ఫిలింస్ సంస్థలు నిర్మించాయి. దీనికి విజయ సుబ్రహ్మణ్యం, ఆర్.సి. రాజ్ కుమార్ నిర్మాతలు.
Also Read: ఆహా ఓటీటీలో చూడాల్సిన బెస్ట్ హారర్ మూవీస్ ఇవే... వీటిని అస్సలు మిస్ కావొద్దు
తమిళనాడులో చియాన్ విక్రమ్ 'తంగలాన్' వంటి పెద్ద సినిమాతో 'డీమాంటీ కాలనీ 2' విడుదలైంది. బాక్సాఫీస్ బరిలో పోటీని తట్టుకుని నిలబడింది. మంచి వసూళ్లు రాబట్టింది. తెలుగులోనూ సేమ్ రెస్పాన్స్ రావడంతో సినిమా టీమ్ హ్యాపీగా ఫీల్ అయ్యింది. 'డీమాంటీ కాలనీ 2' విజయంలో సామ్ సిఎస్ నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. మీనాక్షి గోవింద్ రాజన్, సర్జనో ఖాలిద్, అర్చన రవిచంద్రన్ తదితరులు నటించిన ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ: హరీశ్ కన్నన్, కూర్పు: కుమరేష్ డి, సహ నిర్మాతలు: బి సురేష్ రెడ్డి - బి మానస రెడ్డి.