Dance Ikon Season 2 - Wild Fire: ఆహాలో 'డాన్స్ ఐకాన్ సీజన్ 2'... షో కాన్సెప్ట్, టైమింగ్స్ నుంచి కంటెస్టెంట్స్ వరకు - మీకు ఈ విషయాలు తెల్సా?
Dance Ikon Season 2 - Wild Fire : 'డాన్స్ ఐకాన్ సీజన్ 2 - వైల్డ్ ఫైర్' షోకి ప్రముఖ నటీనటులు జడ్జిలుగా, సెలబ్రిటీలు మెంటార్స్ గా, అలాగే టాప్ యాంకర్స్ హోస్ట్ లుగా వ్యవహరించబోతున్నారు. ఆ షో వివరాలు..

డాన్స్ లవర్స్ ను బాగా అలరించిన 'డాన్స్ ఐకాన్ సీజన్ 1' కు కంటిన్యూగా 'డాన్స్ ఐకాన్ సీజన్ 2 - వైల్డ్ ఫైర్' త్వరలోనే ఓటీటీలో ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. ఈ పాపులర్ షోలో దేశవ్యాప్తంగా పలువురు కంటెస్టెంట్స్ పాల్గొనబోతున్నారు. మరి ఈ షోలో పాల్గొనబోతున్న ఆ కంటెస్టెంట్లు ఎవరు? యాంకర్, న్యాయ నిర్ణేతలు ఎవరు? షో టెలికాస్ట్ టైమింగ్స్ ఏంటి? వంటి వివరాలను తెలుసుకోండి.
హీరోయిన్ ఫరియా అబ్దుల్లాతో పాటు శేఖర్ మాస్టర్
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చేసింది తక్కువ సినిమాలే. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ హైదరాబాద్ ముద్దుగుమ్మ 'జాతి రత్నాలు' మూవీతో చిట్టిగా కుర్రకారు మనసులో స్థానం సంపాదించుకుంది. అలాగే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బంగార్రాజు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబర్, రావణాసుర, ఆ ఒక్కటీ అడక్కు, కల్కి 2898 ఏడీ, మత్తు వదలరా 2 వంటి చిన్న పెద్ద సినిమాలు అన్నింటిలోనూ నటిస్తూ దూసుకెళ్తోంది. అలాగే ఈ అమ్మడు 'నక్షత్ర' అనే యూట్యూబ్ వెబ్ సిరీస్ పరిచయమైన సంగతి తెలిసిందే. 'ది జంగబూరు కర్స్' అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించింది. ఇప్పుడు ఓటీటీ మూవీ లవర్స్ ని మరోసారి 'డాన్స్ ఐకాన్ సీజన్ 2 - వైల్డ్ ఫైర్'తో పలకరించబోతోంది. ఈ షోలో ఫరియా అబ్దుల్లా జడ్జ్ గా వ్యవహరించబోతోంది. అలాగే ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మరొక జడ్జిగా వ్యవహరించబోతున్నారు. దీనికి ఓంకార్ హోస్టుగా వ్యవహరించబోతున్నారు.
షోలో మొత్తం ఐదుగురు మెంటార్స్... ఎవరంటే?
ఇక ఈ షోలో ప్రముఖ డాన్స్ మాస్టర్లు మెంటార్స్ గా వ్యవహరించబోతుండడం ఇంట్రెస్టింగ్ గా మారింది. యశ్వంత్ మాస్టర్, దీపికా రంగరాజు, జాను లిరి, మానస్ నాగులపల్లి, ప్రేరణ కంభం వంటి వారు మెంటార్స్ గా వ్యవహరిస్తారు. ఇక ఈసారి షోలో సరికొత్త ముఖాలు కనిపించబోతున్నాయి. అలాగే ట్విస్టులు, సర్ప్రైజ్ లోకు కూడా కొదవేమీ ఉండదు. అంతేకాదు ఈసారి ఆడియన్స్ వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి ఓటు వేసే అవకాశాన్ని కల్పించబోతున్నారు. మరో ఇంటరెస్టింగ్ విషయం ఏంటంటే వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా ఉండబోతోంది. ఇదంతా చూస్తుంటే ఆల్మోస్ట్ 'బిగ్ బాస్'ను పోలిన కాన్సెప్ట్ లా కన్పిస్తోంది. కానీ ఇదొక డాన్స్ షో... అదే తేడా.
కాన్సెప్ట్, స్ట్రీమింగ్ డేట్
ఇప్పటికే పలు డాన్స్ షోలు బుల్లితెరపై దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు ఓటీటీ ఆహాలో 'డాన్స్ ఐకాన్ సీజన్ 2 - వైల్డ్ ఫైర్' కార్యక్రమం మరోసారి డాన్స్ లవర్స్ ను ఎంటర్టైన్ చేయబోతోంది. ఇందులో హిప్ హాప్, క్లాసికల్, టెంపరరీ వంటి డాన్స్ స్టైల్స్ లో పర్ఫార్మెన్స్ చేసి అదరగొట్టబోతున్నారు కంటెస్టెంట్స్. షో టైమింగ్స్. ఫిబ్రవరి 14 నుంచి ప్రీమియర్ కాబోతోంది. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. కంటెస్టెంట్స్ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

