Criminal Justice Web Series OTT Release: హిట్ క్రైమ్ థ్రిల్లర్ సీజన్ 4 వచ్చేస్తోంది - 'క్రిమినల్ జస్టిస్' కొత్త టీజర్ చూశారా.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Criminal Justice Season 4 OTT Platform: పంకజ్ త్రిపాఠీ లీడ్ రోల్ పోషించిన హిట్ వెబ్ సిరీస్ 'క్రిమినల్ జస్టిస్' కొత్త సీజన్ రాబోతోంది. మే 22 నుంచి సీజన్ 4 జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

Pankaj Tripathi's Criminal Justice Web Series Season 4 OTT Release On Jio Hotstar: క్రైమ్ థ్రిల్లర్ జానర్ అంటేనే ఓ స్పెషల్ క్రేజ్. తాజాగా ఓటీటీ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు 'క్రైమ్ థ్రిల్లర్ లీగల్ డ్రామా' సిరీస్ కొత్త సీజన్ వచ్చేస్తోంది. 'పంకజ్ త్రిపాఠీ' (Pankaj Tripathi) కీలక పాత్ర పోషించిన 'క్రిమినల్ జస్టిస్' (Criminal Justice) వెబ్ సిరీస్ నాలుగో సీజన్ సిద్ధమైంది.
స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
మే 22 నుంచి 'క్రిమినల్ జస్టిస్ సీజన్ 4: ఫ్యామిలీ మ్యాటర్' సిరీస్ 'జియో హాట్ స్టార్'లో (Jio Hotstar) స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటివరకూ 3 సీజన్లు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు నాలుగో సీజన్ రాబోతోంది. దీనికి సంబంధించి మేకర్స్ తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. బీబీసీ స్టూడియోస్‌తో కలిసి రోషన్ సిప్పీ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు.
పంకజ్ త్రిపాఠీతో పాటు జీషన్ ఆయూబ్, సుర్వీన్ చావ్లా, ఆశా నేగి, మిత వశిష్ఠ, శ్వేతాబసు సిరీస్‌లో కీలక పాత్రలు పోషించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా జైలు శిక్ష అనుభవిస్తున్న బాధితుల తరఫున పోరాడే లాయర్ మాధవ్ మిశ్రా పాత్రలో పంకజ్ త్రిపాఠి నటించి మెప్పించారు. కొత్త సిరీస్ ఓ జంట లవ్, మర్డర్ చుట్టూ సాగనున్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. తనకో లాయర్ కావాలంటూ మాధవ మిశ్రా దగ్గరికి ఓ అమ్మాయి రావడంతో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఈ కేస్ అనుకున్నంత సులువు కాదని.. లేకుంటే తన దగ్గరికి వచ్చేది కాదంటూ లాయర్ మాధవ్ మిశ్రా అనడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
Seedha aur simple toh Madhav Mishra ji ke syllabus mein hai hi nahi. Aapke favourite vakeel sahab aa rahe hain courtroom mein wapas! ⚖️#HotstarSpecials #CriminalJustice - A Family Matter, streaming from May 22, only on #JioHotstar@ApplauseSocial @BBCStudiosIndia @nairsameer… pic.twitter.com/Gu1B3bnLWF
— JioHotstar (@JioHotstar) April 29, 2025
క్రిమినల్ జస్టిస్ ఫస్ట్ సీజన్ 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంది. 2008లో వచ్చిన ఓ బ్రిటీష్ టీవీ సిరీస్ ఆధారంగా దీన్ని రూపొందించారు. తిగ్మాంశు ధూలియా, విశాల్ పూరియా ఈ సిరీస్ డైరెక్ట్ చేశారు. 10 ఎపిసోడ్స్‌తో వచ్చిన ఫస్ట్ సీజన్ ఓటీటీ ఆడియన్స్‌ను విశేషంగా అలరించింది. ఇక, అదే జోష్‌తో 2020 డిసెంబరులో సెకండ్ సీజన్ వచ్చింది. ఇందులో పంకజ్ త్రిపాఠీతో పాటు కీర్తి కుల్హరి ప్రధాన పాత్రలో నటించారు. 2022, ఆగస్టులో మూడో సీజన్ వచ్చింది. ఆ తర్వాత మూడేళ్లకు కొత్త సీజన్ రాబోతోంది.
న్యూ ఎలిమెంట్స్ కోర్ట్ రూమ్ డ్రామా..
'క్రిమినల్ జస్టిస్' సిరీస్‌లో నటించడం తనకెంతో ఆనందాన్ని ఇస్తుందని.. ప్రతీసారి ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నట్లు పంకజ్ త్రిపాఠి తెలిపారు. 'మాధవ్ కేవలం రోల్ మాత్రమే కాదు. ప్రతి చాప్టర్ నాతో మరొకరు ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈసారి సరికొత్త ఎలిమెంట్స్ కోర్ట్ రూం డ్రామాను ప్రేక్షకులకు అందించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.' అని అన్నారు.





















