Chaari 111: వెన్నెల కిషోర్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్... ఇప్పుడు యూకేలో ట్రెండింగ్‌లో 'చారి 111'
Chaari 111 on OTT: స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'చారి 111'. థియేటర్లలో రిలీజై ఏడాది దాటింది. ఓటీటీలోకి వచ్చి కూడా! ఇప్పుడు సినిమా ట్రెండింగ్ లిస్టులోకి వచ్చింది.

స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ టైటిల్ పాత్రలో యాక్ట్ చేసిన యాక్షన్ కామెడీ థ్రిల్లర్ 'చారి 111'. టీజీ కీర్తి కుమార్ డైరెక్షన్ చేసిన ఈ సినిమాను బర్కత్ స్టూడియోస్ మీద అదితీ సోనీ ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా గ్లోబల్ లెవెల్లో ఓటీటీలో ట్రెండింగ్ లిస్టులోకి వచ్చింది.
యూకేలో... ప్రైమ్ వీడియోలో... ట్రెండింగ్ లిస్టులో...
'చారి 111' సినిమా గత ఏడాది మార్చి ఒకటిన థియేటర్లలో రిలీజ్ అయింది. వెన్నెల కిషోర్ కామెడీతో పాటు టీజీ కీర్తి కుమార్ స్టోరీ, డైరెక్షన్ పట్ల కాంప్లిమెంట్స్ వచ్చాయి. స్పై థ్రిల్లర్ సినిమాలను చూసే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఎప్పుడూ ఉంటారు. అందులోనూ ఫన్, యాక్షన్ బ్లెండ్ చేసి తీసిన 'చారి 111' టాలీవుడ్ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసింది.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వ్యూవర్స్ కూడా 'చారి 111' సినిమాను అప్రిషియేట్ చేశారు. థియేటర్లలో, ఓటీటీలో విడుదలైన ఏడాది తర్వాత కూడా ఈ సినిమా ట్రెండింగ్ లిస్టులో ఉండడం విశేషం. ప్రజెంట్ యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ట్రెండింగ్ లిస్టులో ఉంది.
''యూకేలో మా సినిమా ట్రెండింగ్ కావడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అదే సమయంలో సంతోషంగానూ ఉంది. తెలుగులో తీసిన ఈ సినిమా ఇంటర్నేషనల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించడం చాలా హ్యాపీ. ఇండియన్ బోర్డర్స్ దాటి మరి మా సినిమా ట్రెండింగ్ కావడం యూనిట్ అందరికీ ఎంతో సంతోషంగా ఇచ్చింది'' అని డైరెక్టర్ టీజీ కీర్తి కుమార్ చెప్పారు. తెలుగు ప్రేక్షకులు గర్వపడే బోల్డ్ - ఆఫ్ బీట్ సినిమా తీయాలని తాము ముందు నుంచి అనుకున్నామని, అయితే ఇప్పుడు గ్లోబల్ ఆడియన్స్ తమ సినిమాను చూడటం ఫిలిం మేకర్స్ క్రియేటర్స్ అందరికీ ఒక భరోసా ఇస్తుందని నిర్మాత అదితి సోనీ అన్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్... 'ఉస్తాద్ భగత్ సింగ్'కు పాన్ ఇండియా హీరోలు షాక్ అయ్యే రేంజ్‌లో?
'చారి 111' కథ విషయానికి వస్తే... తీవ్రవాదులను అరికట్టడానికి ఎటువంటి నియమనిబంధనలు లేకుండా పనిచేసే ఒక ఏజెన్సీని ఒక ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తారు. ఆ ఏజెన్సీ పేరు రుద్రనేత్ర. అందులో అండర్ కవర్ ఏజెంట్ హీరో. హైదరాబాద్ సిటీలో హ్యూమన్ బాంబు బ్లాస్ట్ జరిగిన తర్వాత రుద్రనేత్ర అలర్ట్ అవుతుంది. ఆ కేసును హీరోకి అప్పగిస్తుంది. ఆ తర్వాత ఏమైందనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Also Read: 'బేబీ' నిర్మాతలతో కలిసి కిరణ్ అబ్బవరం కొత్త సినిమా... క్యాచీ టైటిల్ ఫిక్స్ చేశారండోయ్





















