Animal, Salaar On Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగోడి సత్తా - గ్లోబల్ రేటింగ్స్‌లోనూ దూసుకెళ్తోన్న ‘సలార్’, ‘యానిమల్’
Animal and Salaar rule Netflix: ఈ మధ్య రిలీజై బంపర్ హిట్ అందుకున్న మన రెండు సినిమాలు గ్లోబల్ లెవెల్‌లో సత్తాచాటుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌ని ఏలేస్తున్నాయి.
Animal and Salaar OTT Records: 'సలార్', 'యానిమల్' థియేటర్‌లో రిలీజైన ఈ సినిమాలు రికార్డులు సృష్టించాయి. మంచి హిట్ టాక్ అందుకున్నాయి. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో కూడా తమ సత్తా చాటుతున్నాయి. గ్లోబల్ లెవెల్‌లో రికార్డులు సృష్టిస్తున్నాయి. నాన్ ఇంగ్లీష్ సినిమాల క్యాటగిరీలో టాప్ - 4, టాప్-6 స్థానాల్లో కొనసాగుతున్నాయి.
టాప్ 4 'యానిమల్', టాప్ 6 'సలార్'
డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'సలార్'. బాక్సాఫీస్ దగ్గర భారీగా కలెక్షన్లు రాబట్టింది. రూ.700 కోట్ల కలెక్షన్‌తో ప్రభాస్ ఖాతాలో మరో భారీ హిట్ నమోదయ్యేలా చేసింది. ఇక ఆ తర్వాత వెంటనే జనవరి 20న నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది ఈ సినిమా. ఇక అప్పటి నుంచి గ్లోబల్ లెవెల్‌లో టాప్ - 10లో కొనసాగింది. టాప్ - 10లో నిలిచిన నాన్ ఇంగ్లీష్ మూవీగా రికార్డ్ సృష్టించింది 'సలార్'. ప్రస్తుతం టాప్ -6లో కొనసాగుతున్న సలార్ సినిమాని రెండో వారంలో దాదాపు 1.9 మిలియన్ మంది వీక్షించారు.
‘సలార్’ ఇప్పటికీ అదే రికార్డ్ కొనసాగిస్తోంది. 'సలార్'తర్వాత ఆ రికార్డు సొంతం చేసుకుంది 'యానిమల్' సినిమా. ప్రస్తుతం గ్లోబల్ లెవెల్‌లో టాప్ -4లో ఉంది 'యానిమల్'. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా.. జవవరి 26న నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. కాగా.. జనవరి 28 వరకు ఆ సినిమాని 6.2 మిలియన్ల మంది చూశారని ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
ఇక 'సలార్' పాన్‌ఇండియా సినిమా కాదు.. గ్లోబల్ సినిమాగా మారిపోయింది' అని మేకర్స్ గతంలో ప్రకటించారు. ఇక ఈ సినిమాని త్వరలోనే ఇంగ్లీష్ భాషలో కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది హొంబలే సినిమా. ఇక ఓటీటీలో తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండగా.. హిందీలో మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు. సినిమా రిలీజ్ అయిన 8 వారాల తర్వాతే హిందీలో రిలీజ్ చేయాలనే రూల్ ఉన్న నేపథ్యంలో ఇంకా రిలీజ్ కాలేదు.
కేజీఎఫ్ - 1, 2తో భారీ హిట్లు అందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ 'సలార్'ని తెరకెక్కించారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్ స్నేహితుడిగా ప్రధాన పాత్ర చేశారు. సలార్‌కి సీక్వెల్ కూడా ఉన్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో 'సలార్ -2' ఏ రేంజ్‌లో ఉండబోతుందో అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక 'యానిమల్' సినిమాకి కూడా పార్ట్ - 2 ఉంది. అది ఇంకా బోల్డ్‌గా, డెప్త్‌గా ఉంటుందని హీరో రణ్‌బీర్‌కపూర్ చెప్పారు. సందీప్‌రెడ్డి వంగ రిలీజ్ చేసిన ఈ సినిమా.. అతిపెద్ద హిట్‌టాక్ అందుకుంది. ఇక ఓటీటీలో దూసుకుపోతున్న ఈ సినిమాపై విమర్శలు కూడా అదే రేంజ్‌లో వస్తున్నాయి. ఏకంగా ఓటీటీ నుంచి తొలగించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. దీంతో మరి నెట్‌ఫ్లిక్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Also Read: షూటింగ్స్‌కు ప్రభాస్ బ్రేక్ - కారణం ఇదేనట, ఫ్యాన్స్ కలవరం