అన్వేషించండి
Advertisement
Beast OTT Release: 'బీస్ట్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడు వస్తుందంటే?
విజయ్ 'బీస్ట్' థియేటర్లలోకి వచ్చి కొన్ని గంటలు కాకముందే ఓటీటీలో సినిమా విడుదల ఎప్పుడనేది బయటకు వచ్చేసింది. డిజిటల్ స్క్రీన్ మీద ఈ సినిమా స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
ప్రేక్షకులు 'థియేటర్లలో సినిమా విడుదల తేదీ ఎప్పుడు?' అనేది చూసుకోవడంతో పాటు 'ఓటీటీ విడుదల తేదీ ఎప్పుడు?' అనేది కూడా చూసుకుంటున్న రోజులు ఇవి. స్టార్ హీరోలు, ఛోటా మోటా యంగ్‌స్టర్స్ అనే సంబంధం లేకుండా... హీరోలందరి సినిమాలు ఈ మధ్య నెల రోజులు తిరక్కుండా ఓటీటీలోకి వస్తున్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ 'బీస్ట్' కూడా అదే కేటగిరీలో చేరబోతోందని సమాచారం.
విజయ్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'బీస్ట్'. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. అనిరుద్ సంగీతం అందించిన 'అరబిక్ కుతు...' సాంగ్ వైరల్ అవ్వడంతో సినిమాకు మంచి బజ్, ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ, సినిమాకు సూపర్ హిట్ టాక్ రాలేదు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... మే రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందట. (Beast Movie OTT Release Date)
ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ సన్ టీవీ నెట్‌వర్క్‌కు 'సన్ నెక్స్ట్' ఓటీటీ వేదిక ఉంది. అందులో 'బీస్ట్' తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ వెర్షన్స్ స్ట్రీమింగ్ కానున్నాయని టాక్. 'బీస్ట్' హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్‌కు అమ్మేశారట. (Beast OTT Release On May 13) మే 13న ఓటీటీలో అన్ని భాషల్లోనూ విడుదల కానుందని తెలుస్తోంది.
Also Read: 'బీస్ట్' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?
చెన్నైలోని ఓ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి 'బీస్ట్' చిత్రాన్ని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన హీరోయిన్ పూజా హెగ్డే (వీడియో):
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion